Suspense Crime Thriller ‘Guduputani’ Movie Review

Cinemarangam.com
సినిమా : “గూడుపుఠాణి ”
రివ్యూ రేటింగ్: 3.5/5
బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
డైరెక్షన్: కుమార్.కె.ఎం
నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె తదితరులు.
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య
ఫైట్స్: సోలిన్ మల్లేష్
స్టిల్స్: ఎమ్ఎమ్.రెడ్డి
పి ఆర్.ఓ : శ్రీధర్

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా  కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం “గూడుపుఠాణి ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్రిస్మస్ కానుకగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తో డిసెంబర్ 25న గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానున్న  ఈ చిత్రం ఆన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన బిజినెస్ అవ్వడంతో చిత్ర నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ పాత్రికేయ మిత్రులకు ఓక రోజు ముందు గానే ప్రీమియర్ వేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

కథ
గిరి (సప్తగిరి), సిరి (నేహా సోలంకి) పెళ్లి చేసుకునేందుకు ఊరి చివర గుడిలోకి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటున్న వీరిని గమనించని గుడి  పూజారి (అనంత్) గుడి మూసేసి వెళ్లిపోతాడు.ఆ గుడిలో చిక్కుకున్న గిరి, సిరికి. ఆ గుడిలో ఉన్న అమ్మవారి బంగారు నగలను ఎత్తుకు పోవడానికి  వచ్చిన దొంగలను చూస్తారు. అక్కడ జరిగిన కొన్ని అనూహ్య భయాలకు ఈ జంట లోనుకావడంతో..ఆ దొంగలు సిరిని పట్టుకుని బందీ చేస్తారు.మరో వైపు దేవాలయంలో ఓ యువ జంట హత్య కలకలం రేపుతుంది. ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగుతారు పోలీసులు.తనకు కాబోయో భార్యను గిరి ఆ దుండగుల బారి నుంచి ఎలా కాపాడుకున్నాడు?, అసలీ దొంగలకు గతంలో జరిగిన ఆలయ హత్యలకు సంబంధం ఏంటి?, అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే…

నటీనటుల పనితీరు
గిరి పాత్రలో సప్తగిరి చాలా సహజంగా నటించారు. నేహా సోలంకి ట్రెడిషినల్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆమె క్యారెక్టర్ కు సినిమాలో హీరోకు తగినంత స్పేస్ ఉండటం విశేషం. రఘు కుంచె విలన్ గా కొత్తగా అనిపిస్తారు.రఘు కుంచె విలనిజం అందరికీ భయాన్ని కలిగిస్తుంది.అనంత్ పూజారి క్యారెక్టర్ లి అద్భుతంగా చేశాడు.. అలాగే మిగిలిన నటులందరూ చాలా బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎమ్ కుమార్.
సినిమా ప్రారంభంలోనే విలన్ గా నటించిన రఘు కుంచెను క్రూరంగా చూపించడంతో సినిమా మీద ఆసక్తిని పెరిగేలా చేశాడు.. యువ జంట హత్య, ఆపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలవడం గూడుపుఠాణి సినిమా నెక్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో ఈ సినిమా హారర్ జానర్ లో ఉంటుందా అనే సందేహాలు కలుగుతాయి. గుడిలోకి  దొంగలముఠా ఎంటర్ అవ్వడంతోనే అసలు సినిమా మొదలవ్వడంతో హీరో, హీరోయిన్ స్ట్రగుల్ ఫెస్ చేయాల్సి వస్తుంది..దొంగలపై సప్తగిరి  ఫైట్ చేయడం కొంచెం డీఫ్రెంట్ గా ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. కథతో పాటు. పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులోని నీలినింగి పాట ట్యూన్, పిక్చరైజేషన్ చాలా బాగుంది, సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటి టెక్నికల్ విభాగాల్లోనూ “గూడుపుఠాణి” సినిమా బాగుంది. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే  కోరికతో సినిమాను నిర్మించే క్రమంలో ఏక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమాను నిర్మించడంలో ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్ నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లు సక్సెస్ ఐటారు.వారికి సినిమా పై వుండే  ప్యాషన్ కనిపిస్తుంది. . ఇక కథలో ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్. ఇది రివీల్ చేస్తే కథ మీద ఇంట్రెస్ట్ పోతుంది.రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కథలు ఇష్ట‌ప‌డేవారికి ఈ సినిమా మ‌రింత బాగ న‌చ్చుతుంది.

Cinemarangam.com Rating..3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here