ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ పతాకంపై నాగవర్మ బైర్రాజు హీరోగా, దివ్యాసురేశ్ హీరోయిన్ గా, ఇంకా,ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్ నటీనటులు గా హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు నిర్మిస్తున్న చిత్రం “విక్రమ్” అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం తెలుగు లో “విక్రమ్” గా,తమిళ్ లో “మహావీరన్” గా రెండు భాషల్లో మూడు రాష్ట్రాలలో నూతన సంవత్సర శుభా కాంక్షలుతో డిసెంబర్ 31న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా సమావేశంలోప్రదర్శింప బడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది.ఈ సందర్భంగా పాత్రికేయుల

హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు మాట్లాడుతూ.…మా దర్శకుడు ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు.ఇందులో నటించిన వారంతా చాలా బాగా చేశారు.నటుడు ఖయ్యుమ్ తో నటించడం నాకు చాలా హెల్ప్ అయ్యింది.ఇది నాకు మొదటి చిత్రమైనా సీనియర్ ఆర్టిస్టులు అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. హీరోయిన్ కూడా నాతొ పోటీ పడి నటించింది. సత్య మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ మంచి పాటలు అందించాడు. నటీనటులు, టెక్నీసిషన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 31 న విడుదలైన మా “విక్రమ్” సినిమా ఎంతో ప్రేక్షకాదరణ పొందు తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు,శ్రేయోభిలాషులు అందరూ నన్ను నాగవర్మ అని కాకుండా విక్రమ్ అని పిలుస్తున్నారు.నేను నటించిన ఫస్ట్ మూవీ కే నా సినిమా టైటిల్ తో నన్ను విక్రమ్ గా పిలవడం చాలా ఆనందంగా ఉంది.నిర్మాతగా హీరోగా ఈ సినిమాకి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను.మధ్యలో కోవిడ్ రావడం ఇలా ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టినా ఆ స్ట్రగుల్స్ అన్నీ ఈ సినిమా సక్సెస్ తో మర్చిపోయాను. సీనియర్ యాక్టర్ లా బాగా చేశావని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెపుతూ పొగడ్తలతో ముంచెత్తుతున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మేము ఈ నెల 19 న మరొక కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నాము.ఈ సినిమా ను జూనియర్ ఎన్టీఆర్ తో “నాగ” సినిమా తీసిన సీనియర్ డైరెక్టర్ తో మా నెక్స్ట్ మూవీ స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. మా విక్రమ్ చిత్రాన్ని ఆదరించినట్లే ఈ సినిమా ను కూడా మమ్మల్ని ఆదరించి ముందుకు నడిపించాలని ప్రేక్షక దేవుల్ని కోరుతున్నాను. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అని అన్నారు.
చిత్ర దర్శకుడు హరి చందన్ మాట్లాడుతూ..మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన నేను సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ కథ ను తయారు చేసుకొని నిర్మాత నాగవర్మ కు చెప్పడం జరిగింది.ఈ కథ చాలా బాగుందని తననే హీరోగా చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో తనే హీరోగా, నిర్మాత గా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు.కోవిడ్ సమస్యలు ఉన్నా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాము. డిసెంబర్ 31 న తెలుగులో “విక్రమ్” గా తమిళ్ లో “మహావీరన్” గా ఒకే సారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.ఇందుకు కారకులైన తెలుగు, తమిళ ప్రేక్షకులకు మా ధన్యవాదాలు.ఈ సినిమా కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ .దీన్ని బేస్ చేసుకొని తీశాము. ఒక యువ ప్రేమజంట ల్లో ఎవరైనా ఒకసారి సడన్ గా యు టర్న్ తీసుకోవడం వలన వారికి ఎదురయ్యే పరిస్థితులను ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఎన్నో చిన్న చిన్న సంఘటనలను బేస్ చేసుకొని ఒక కమర్షియల్ డ్రామా ఫిలింగా చేసుకొని దానికి లవ్ యాక్షన్ డ్రామాగా మలచడం జరిగింది. ఇందులో విక్రమ్ పాత్ర నుండి మొదలై క్లైమాక్స్ వరకు ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది.ఇందులో సీనియర్ యాక్టర్స్ సురేష్,పృద్వి, ఖయ్యుమ్, జ్యోతి,జయవాణి ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నిసిషన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ సినిమా ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్ కు ఈ సినిమా కొత్త ఒరవడిని సృష్టిస్తుందని నమ్ముతున్నారు అన్నారు.
నటుడు ఖయువుమ్ మాట్లాడుతూ..దర్శక,నిర్మాతలకు మొదటి చిత్రమైనా చాలా బాగా తీశాడు.ఈ సినిమాలో ఆయన స్విచ్వెషన్ తగ్గట్టు హీరో చాలా చక్కగా నటించాడు.మ్యూజిక్ చాలా బాగుంది. ఇలాంటి మంచి చితాన్ని ప్రేక్షకులందరూ ఆదరిస్తూ సపోర్ట్ గా నిలవాలి అన్నారు.
సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రానికి సంగీత దర్శకుడు గా పని చేసే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకుధన్యవాదాలు. లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు చాలా చక్కగా తీశారు. ఇందులోని ఆర్.ర్.హైలెట్ గా ఉంది అన్నారు.
ఆర్టిస్ట్ జయవాణి మాట్లాడుతూ.. ఇందులో నేను మదర్ క్యారెక్టర్ చేశాను.ఈ సినిమాను దర్శక, నిర్మాతలు చాలా బాగా తీశారు.మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చితాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు
ఆర్టిస్ట్ జ్యోతి మాట్లాడుతూ..విక్రమ్ లో నేను శాంభవి క్యారెక్టర్ చేశాను.ఈ సినిమాలోని డైలాగ్స్ చాల హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. డైరెక్టర్ కు ,హీరో కు ఇది కొత్త సినిమా అయినా దర్శక,నిర్మాతలు ఈ సినిమాను చాలా బాగా తీశారు అన్నారు.
ఆర్టిస్ట్ అనురాధ మాట్లాడుతూ. ఇందులోని కథ చాలా డీఫ్రెంట్ గా సినిమా చాలా బాగుంది అన్నారు.
ఆర్టిస్ట్ సాయిరాం మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో,హీరోయిన్లు చాలా చక్కగా చేశారు.24 క్రాఫ్ట్స్ కూడా చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ప్రతి సీన్ చాలా బాగుంది అన్నారు.
ఆర్టిస్ట్ చిత్రం బాషా మాట్లాడుతూ .. ఇందులో నేను డీఫ్రెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ చిత్రంలో హీరో గారు చక్కటి ఏమోషన్ ను పండించారు. హీరో ఫ్రెండ్ గా చేసిన ఖయ్యుమ్ కూడా చాలా బాగా చేశాడు అన్నారు.
కొరియోగ్రాఫర్ సత్య మాట్లాడుతూ..ఈ రోజుల్లో ఒక మూవీ తీసి రిలీజ్ చెయ్యడం అంటే చాలా గ్రేట్.అలాంటిది ఈ సినిమాలో హీరోగా, నిర్మాత గా మారి కోవిడ్ వున్నా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులోని టెక్నిసిషన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు.ఇలాంటి చిత్రంలో నేను బాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది ఆన్నారు
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా విక్రమ్ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.
నటి నటులు :నాగవర్మ, దివ్య రావు, సూర్య, పృద్వి, వైజాగ్ ప్రసాద్,ఖయ్యుమ్, తాగుబోతు రమేష్, జ్యోతి, సురేష్,నట కుమారి, ఆదిత్య ఓం తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ నేమ్ :ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్ :నాగవర్మ బైర్రాజు
స్టోరీ, స్క్రీన్ ప్లే,డైలాగ్స్, డైరెక్షన్ :హరి చందన్
మ్యూజిక్ డైరెక్టర్ :సురేష్ ప్రసాద్
సినిమాటోగ్రఫేర్ :వేణు మురళీధర్ వదనాల
ఆర్ట్ :బాబ్జి
కోరియోగ్రఫీ :సత్య -కపిల్ శర్మ
ఎడిటర్ :శ్రీను మెనగా
కో.డైరెక్టర్ :;బద్రీనాథ్ వర్ధన్









