అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా “బంగార్రాజు”. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బంగార్రాజు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని తెలియజేస్తూ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా
నాగార్జున మాట్లాడుతూ.. సోగ్గాడే చిన్నినాయన చిత్రాన్ని
ఆగస్టు 21న షూటింగ్ మొదలుపెట్టాం పండుగకే అనుకున్నాం. కానీ.. అనుమానంతో ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఈ నెల14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము.నా టీం కృషివల్లే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే గలిగాం.సోగ్గాడే చిన్నినాయన చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది ఇప్పుడు బంగార్రాజు కూడా సంక్రాంతికి వస్తుండటంతో అక్కినేని అభిమానులు అందరూ చాలా సంతోషంగా వున్నారు. పండుగ లాంటి బంగార్రాజు చిత్రాన్ని సోగ్గాడే చిన్నినాయన చిత్రం కూడా సంక్రాంతికి విడుదల చేశాం ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ అయిన బంగార్రాజు చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా కెరీర్ లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, జానకిరాముడు చిత్రాలు ఎలా ప్లస్ అయ్యాయో నాగచైతన్యకు ఈ చిత్రం కూడా అంత ప్లస్ అవుతుంది. సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ లో బిజీగా ఉండటం వల్లే నాగచైతన్య ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. RRR, రాధేశ్యాం విడుదల వాయిదా పడటం బాధగా ఉంది ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, అయినా ఈ పండుగకు ఈ చిత్రాలు ఉన్నాకూడా “బంగార్రాజు” చిత్రాన్ని విడుదల చేసే వాళ్ళం.ప్రతి సంక్రాంతి కనీసం మూడు,నాలుగు సినిమాలు ఉండాలి. 2016 సోగ్గాడే చిన్నినాయన వచ్చిన వచ్చి నప్పుడు కూడా నాలుగు సినిమాలు విడుదల ఆయ్యాయి. ఇక ఏపీ సినిమా టికెట్ ధరలపై నాకేమీ ఇబ్బంది లేదు అంటే నా సినిమా వరకు ఇబ్బంది లేదు టికెట్ ధరలు ఎక్కువ ఉంటే కొంచెం డబ్బులు ఎక్కువ స్థాయి తక్కువగా ఉంటే తక్కువ వస్థాయి సంక్రాంతి కి వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ..నాగ చైతన్య ఏ సినిమాకు ఆ సినిమాకు కొత్తగా కనిపిస్తారు. కానీ ఇందులో మరింత కొత్తగా కనిపిస్తారు.రమ్యకృష్ణ గారు అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్యల గార్లకు సమానమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రేక్షకుల అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు
జి అధినేత ప్రసాద్ మాట్లాడుతూ.. బంగార్రాజు లాంటి సినిమా మాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది.బంగారం సినిమా అనుకున్నాం నాగార్జున గారు నాగచైతన్య కలిసి నిజం తో ఈ సినిమా ఇంకా ప్రతిష్టాత్మకంగా మారింది అని అన్నారు
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..లడ్డుందా, వాసి వాడి తస్సాదియ్య పాటలకు మంచి స్పందన వచ్చింది. సోగ్గాడే లో డిక్క డిక్క డుం డుం పాటను నాగార్జున సార్ తో పాడించాం ఇందులో కూడా పాదించాలనుకుని “లడ్డుందా.. ‘ పాట విన్నాక మొత్తం పెడతాను అన్నారు
హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. నాగార్జున సర్ వర్క్ చేయడం నా అదృష్టం. నాగ్ సర్ ఎనర్జీని ఎవరితోని మ్యాచ్ చేయడం ఆయన నిజంగానే కింగ్ చైతన్య తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సర్పంచి నాగలక్ష్మి గా నా పాత్రను ఎంజాయ్ చేస్తూ చేశాను. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు అని అన్నారు
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ
సాంకేతిక బృందం
కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్స్: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్









