ధనలక్ష్మి మూవీస్ పతాకంపై రణధీర్, నందినిరెడ్డి జంటగా ఎం. వినయ్‌బాబు దర్శకత్వంలో చందర్‌గౌడ్ బీసు నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. గురువారంతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని గుమ్మడికాయ కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు వినయ్‌బాబు మాట్లాడుతూ.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ప్రేమకథా చిత్రం. ఈ తరం యువతకు మంచి మెసేజ్ ఉంది. అలాగే తల్లి దండ్రులకు కూడా మంచి మెసేజ్ ఉంది. హీరో, హీరోయిన్లు కొత్త వారైనప్పటికీ అద్భుతంగా చేశారు. అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. హీరోయిన్ యాక్షన్ సీన్స్ కూడా బాగా చేసింది. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత గారు సహకరించడం వల్లే మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఇటీవల మంత్రి తలసాని గారి చేతుల మీదుగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మా యూనిట్ అందరి సహకారంతో అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగాము. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు’’ అన్నారు.
నిర్మాత చందర్‌గౌడ్ మాట్లాడుతూ… ‘‘ఈ సినిమా కథ వినయ్‌బాబు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. తొలి చిత్రమే మంచి కథతో చేయడం హ్యాపీగా ఉంది. మా అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. భద్రాచలం, బెంగుళూరు, మంగుళూరు, హైదరాబాద్‌లలో ఖర్చుకు వెనకాడకుండా చేశాం. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండే రాజకీయ, లవ్, ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. ప్రేక్షకులందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది మాకు’’ అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్.ఎస్. నివాస్ మాట్లాడుతూ… నన్ను నమ్మి ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యతలు అప్పగించిన దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు. నా శాయశక్తులా మంచి సంగీతాన్ని ఇవ్వటానికి కృషి చేశాను’’ అన్నారు.
హీరో రణధీర్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ నందినిరెడ్డి మాట్లాడుతూ..నాకు ఇందులో మంచి పాత్ర ఇచ్చారు.ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
నటీనటులు :
రణబీర్, నందిని, సీనియర్ నటుడు సుమన్, సూర్య, అమిత్ తివారి, మిర్చి మాధవి, విట్టల్, బిహెచ్ఇఎల్ ప్రసాద్, మహబూబ్ భాష తదితరులు.
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ ధనలక్ష్మి మూవీస్
నిర్మాత : చంద్ర గౌడ్ బీసు
దర్శకత్వం : ఎం వినయ్ బాబు
డిఓపి : ఏ విజయ్ కుమార్
మ్యూజిక్ : ఎస్ ఎస్ నివాస్
ఫైట్స్ : రామ్ సుంకర
పి ఆర్.ఓ : చందు రమేష్.









