‘2020 Goal Mall’ Audio Release..Movie Releasing on Feb 18th

1970 ,80 లలో  శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు,శ్రీదేవి , జయప్రద వంటి నటులు తమ నటన, స్టైల్ తో యూత్ ను ఊర్రూతలూగించారు. అప్పటి రెట్రో కాస్ట్యూమ్స్ ను సెలెక్ట్ చేసుకొని వారి పాత్రలలో నటిస్తూ ఇప్పటి పరిస్థితులను అద్దం పట్టే విధంగా తెరకెక్కుతున్న సస్పెన్స్ కామెడీ డ్రామా “2020 గోల్ మాల్”. కె.కె.చైతన్య సమర్పణలో బాబీ ఫిలిమ్స్  ప్రొడక్షన్ పతాకంపై మిట్టకంటి రామ్, విజయ్ శంకర్ , దీక్ష సోనవానె, మహి మల్హోత్రా, కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లు గా జాన్ జిక్కిని దర్శకుడు గా పరిచయం చేస్తూ కె.కె. చైతన్య నిర్మించిన చిత్రం ” 2020 గోల్ మాల్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదల చేస్తున్న సందర్భంగా  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ చిత్ర యూనిట్  ఆడియో వేడుక ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి డిజిక్వెస్ట్ బసిరెడ్డి,ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయులు సమావేశంలో
చిత్ర దర్శకుడు జాన్ జక్కి మాట్లాడుతూ…..నా కలను నెరవేర్చుకోవదానికి తిరుగుతున్న నాకు ఒక మిత్రుడు సహాయంతో బాబీ గారిని కలిస్తే కొత్త కాన్సెప్ట్ ఉంటే చెప్పమన్నాడు. ఇంతకుముందు నేను చేసిన ప్రాజెక్ట్స్ ను చెపుతూ.. ” 2020 గోల్ మాల్”  కాన్సెప్ట్  మూవీ చెప్పడం జరిగింది. ఈ సినిమా కంటెంట్ బాగుందని  సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు.గతంలో  కోల్పోయిన ప్రేమ తాలుకు జ్ఞాపకాలను  గుర్తుచేసుకుంటె జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ. ఇందులో రామ్ ఇంకా విజయ మిగిలిన పాత్రలు అందరు రెట్రో లుక్ లో కనిపిస్తారు.ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు జీవితాంతం ఋణపడి ఉంటాను..వీరు ఎంతో ప్యాసినెట్ ఉన్న ప్రొడ్యూసర్స్.  మాకు ఎం కావాలన్నా సపోర్టు చేశారు. నటీనటులు టెక్నిసిషన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. కనిష్క అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.కొత్త కంటెంట్ తో వస్తున్న సస్పెన్స్ కామెడీ డ్రామా ఇది. ఫ్యామిలీ అంతా చూడదగ్గ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18 న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరో మిట్టకంటి  రామ్ మాట్లాడుతూ.. ” 2020 గోల్ మాల్”టైటిల్ చాలా ఇంట్రెస్ట్ ను క్రీయేట్ చేస్తుంది.అర్థం కాని విషయాలు,ఎదో జరుగుతుందని తెలుసు కానీ.. ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం “గోల్ మాల్” అంటారు.ఇలాంటి విషయాలు ఇందులో చాలా ఉంటాయి.ఒక పల్లెటూరు లో జరిగే స్టోరీ ఇది.ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అందరూ కలసి చూసే సినిమా..ఇందులో మేము రెట్రో క్యాస్ట్యూమ్స్ లో ఉంటాము. శోభన్ బాబు గారు ఇప్పుడు వచ్చి ఈ పరిస్థితుల్లో  వుంటూ తనకొచ్చిన రాంగ్ థాట్ వల్ల ఒక ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తే ఎంత డ్యామేజ్ జరిగింది అనేదే కథాంశం.ఇందులో పాటలు చాలా బాగున్నాయి. ఈ పాటలను  బాబా సెగల్,జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, కీరవాణి కుమారుడు కాలభైరవ వంటి పెద్ద పెద్ద సింగర్స్ తో పాడించడం జరుగుతుంది. శోభన్ బాబు, శ్రీదేవి , జయప్రద, కృష్ణ కృష్ణంరాజు గార్ల గెటప్ లో మేము ఉంటాం.  మంచి కథని ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ రెట్రో స్టైల్ ను ఎంచుకోవడం జరిగింది. 1970 ,80 ల  కాస్ట్యూమ్స్ ను వాడడం జరిగింది. ఈ కాస్ట్యూమ్స్ కోసం మేము చాలా కష్టపడ్డాము. మంచి కథని ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ రెట్రో స్టైల్ ను ఎంచుకోవడం జరిగింది. ఈ కాస్ట్యూమ్స్ కోసం మేము చాలా కష్టపడ్డాము.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ..ఈ టీం
పెద్ద సింగర్స్ ఎన్నుకొని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు.ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయని  మేము రిలీజ్ చేయడం జరిగింది. మంచి సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు. ఈ నెల 18 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.

నటుడు వినోద్ నువ్వుల మాట్లాడుతూ..మంచి టైటిల్ తో రెట్రో సబ్జెక్ట్ లో  నూతన ప్రసాద్ క్యారెక్టర్  చేశాను. సినిమా బాగా వచ్చింది. మా అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ నిస్తుంది. నిర్మాత కు మంచి అభిరుచి తో ఈ మూవీ చేశాడు.యూత్ ఫ్యామిలీ కు తగ్గ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి మా చిత్రం అందరికీ నచ్చుతుందని అన్నారు.

ఆర్టిస్ట్ నందకిషోర్ మాట్లాడుతూ.. రిట్రో స్టైల్ లో వస్తున్న ఈ సినిమాలో నేను రావుగోపాల్ రావు  వంటి మంచి క్యారెక్టర్ చేశాను.ఈ సినిమాను  అందరూ  ఫ్యామిలీ మెంబెర్స్ లా హ్యాపీ గా చేశాము అన్నారు.

డిజిక్వెస్ట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో రిలీజ్ చేస్తున్న ” 2020 గోల్ మాల్” వంటి చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాను.వీరికి ఈ సినిమా నుంచి సక్సెస్ సాధించి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసే అవకాశాలు రావాలని ఆశిస్తూ సినిమా టీం కు  దర్శక,నిర్మాతలకు ఆల్ ద బెస్ట్ అన్నారు

నటీనటులు
మిట్టకంటి  రామ్  , విజయ్ శంకర్ అక్షత  , మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ తదితరులు

టెక్నికల్ టీమ్:
సమర్పణ : బాబీ ఫిలిమ్స్
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
రిట్రో కాన్సెప్ట్ : బాబీ కె.ఎస్ .ఆర్
సినిమాటోగ్రఫీ: జగన్ . ఏ
ఎడిటర్ : నాహిద్
మ్యూజిక్: కనిష్క
నిర్మాత:  కే.కే చైతన్య
రచన-దర్శకత్వం: జాన్ జక్కి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here