‘Nene Nakshatra’ Movie Grand Releasing on February 19th.

నేనే నక్షత్ర చిత్రం ఫిబ్రవరి 19న విడుదల

సంగ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై కిషోర్ కుమార్, శ్రీ నయోనీక హీరో హీరోయిన్ గా సంగ కుమార్ స్వయ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా “నేనే నక్షత్ర”. చిన్న చిన్న అపార్ధాల వాళ్ళ లవర్స్ సూసైడ్ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తర్వాత ఆత్మలు గా చాలా బాధ పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో చిత్రీకరించిన కథ. సినిమా అంత గోవా అందాలతో కలర్ ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ కాపీ రైట్ గా ఉంది. ఈ యూత్ ఫుల్ యాక్షన్ హారర్ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నాము. ఈ సందర్భంగా

దర్శక నిర్మాత సాంగ కుమార్ మాట్లాడుతూ “నేనే నక్షత్ర మంచి క్యూట్ లవ్ స్టోరీ. యూత్ కి బాగా నచ్చుతుంది. ప్రేమ ఎంత గొప్పదో చెప్పాము, చిన్న చిన్న అపార్ధాల వాళ్ళ లవర్స్ సూసైడ్ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, ప్రేమను ఎలా గెలవాలి అని  చేపము. మంచి కథ, కథనం, సాంగ్స్ చాలా బాగున్నాయి. గోవా లోని మంచి లొకేషన్స్ లో షూట్ చేసాము. మా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

హీరో కిషోర్ కుమార్ మాట్లాడుతూ “హీరో గా నాకు అవకాశం ఇచ్చిన సంగ కుమార్ గారికి నా ధన్యవాదాలు. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. ప్రేమను ఎలా గలవాలి అనే కథ తో అందమైన పాటలతో సూపర్ యాక్షన్ ఫైట్స్ తో ఫిబ్రవరి 19న మీ ముందుకు వస్తునామ్ము.  సినిమా చాలా బాగా వచ్చింది. అందరు చూడండి ” అని తెలిపారు.

హీరోయిన్ శ్రీ నయోనీక మాట్లాడుతూ “హీరోయిన్  గా నాకు అవకాశం ఇచ్చిన సంగ కుమార్ గారికి నా ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. యూత్ అందరికి బాగా నచ్చుతుంది.  ఫిబ్రవరి 19న విడుదల అవుతుంది” అని తెలిపారు.

మూవీ పేరు : నేనే నక్షత్ర

బ్యానర్ : సంగ ఆర్ట్స్ క్రియేషన్స్

నటి నటులు : కిషోర్ కుమార్, శ్రీ నయోనీక, పవన్ సుధీర్ నాయక్, క్రిష్, కౌసల్య, తదితరులు

కథ : రమణ మూర్తి

కెమెరా మాన్ : సుబ్బి శ్రీనివాస్

సంగీతం : జాన్ పోట్ల

నిర్మాత, దర్శకత్వం : సంగ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here