Cinemarangam.com
రివ్యూ రేటింగ్ . 3/5
సినిమా “వర్జిన్ స్టోరి”
బ్యానర్ : రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై
నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి
నటీనటులు – విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు
సంగీతం – అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్ – గ్యారీ,
సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి. అలాగే ఓ మంచి విషయాన్నీ చెప్పాలి. ఇలా మెసేజ్ ఫ్లస్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి చూపించే సినిమాలు చాలా తక్కువ. అలాంటి అరుదైన చిత్రాలు వస్తే తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాయి.అందుకే హీరోల లాంఛింగ్ కు ఈ తరహా కథలను సెలెక్ట్ చేసుకుంటారు. వీటికి తోడు ఓ మంచి విషయాన్ని యువతకు చెప్పాలనుకుంటే అది గొప్ప ప్రయత్నమే అవుతుంది. నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా “వర్జిన్ స్టోరి”. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. “వర్జిన్ స్టోరి” సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో చుద్దాం పదండి.
కథ
ఈ కథ హీరోయిన్ పియు ( సౌమిక పాండియన్) బ్రేకప్ సీన్ తో మొదలవుతుంది. సిన్సియర్ గా ప్రేమించినా తను వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొన్న విషయం తెలుసుకొని స్నేహితురాలు మింటీ(రిషికా ఖన్నా) సహాయంతో రెడ్ హ్యాండెడ్ గా లవర్ ను పట్టుకుని తనకు బ్రేకప్ చెపుతుంది.
తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనను ఎందుకు మిస్సయ్యానా అనుకునేలా ఫీల్ అవ్వాలని అతని మీద కోపంతో పబ్ లో ఒంటరిగా ఉన్న విక్రమ్ (విక్రమ్ సహదేవ్)కు దగ్గరవుతుంది. ఆ తరువాత ఇద్దరూ ఒక రాత్రంతా కలిసి ఉండాలని నిర్ణయించు కొంటారు. అయితే ఎక్కడికి వెళ్లినా ఒంటరిగా గడిపేందుకు వీలు దొరకదు. చివరకు వారికీ తెలిసిన అంకుల్ ఇంటిలో నైట్ స్పైండ్ చేయడానికి ఆ రూమ్ కు వెళతారు.. ఆతర్వాత ఏం జరిగింది..వారు అనుకున్న కోరిక నేర వేర్చుకున్నారా ?..వారికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అనేదే ఈసినిమా కథ..
నటీనటుల పనితీరు
విక్రమ్ సహిదేవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఆ తరువాత పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్నాడు. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి వర్జిన్ స్టోరీ తో వచ్చాడు అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కు పోకుండా కూల్ గా తన నటనతో ఆడియన్స్ ని అలరించాడు.కొన్ని సీన్స్ నటనతో టాప్ లో నిలబెట్టాయి. అమాయకమైన కుర్రాడి పాత్రలో స్వచ్ఛమైన ప్రేమ కోపం తపిస్తూ..తన హావ భావాలతో, నటనతో మెప్పించి సక్సెస్ అయ్యాడు.ప్రియాన్షి పాత్రలో సౌమిక చాలా క్యూట్‌గా రొమాంటిక్ గర్ల్ గా విక్రమ్ తో పోటీగానే నటించింది. తనకిది మొదటి సినిమా అయినా కన్ఫ్యూజన్ లో ఉండే టీనేజ్ యువతి పాత్రలో చాలా చక్కగా, చలాకీగా నటించింది. రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు అంతా తమికిచ్చిన పాత్రలలో నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి యూత్ ఫుల్ అంశాలను ఎంచుకుని కథ… కథనాలను వర్జిన్ స్టోరి లో బాగా ఎగ్జిక్యూట్ చేస్తూ. ఎక్కడా బోరింగ్ లేకుండా… ఎంతో గ్రిప్పింగ్ గా చూపించారు. ఎక్కడా వల్గారిటీ లేకుండా సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. హీరో హీరోయిన్స్ ఇద్దరూ సరదాగా గడిపేందుకు చేసే ప్రయత్నాలు అక్కడ వారికి ఎదురయ్యే పరిస్థితులు అన్నీ నవ్వు తెప్పిస్తాయి..అలాగే ఒకరిపై ఒకరు తీర్చుకొనే రివేంజ్ లూ బాగున్నాయి. సినిమా మొత్తం ఒక పాజిటివ్ థాట్ తోనే ప్రేక్షకులు చూసేలా తెరకెక్కించాడు. , అచు రాజమణి, సంగీతం హైలెట్. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. ఆకట్టుకునే డైలాగ్స్,అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.గ్యారీ ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. ఇవన్నీ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించిన నిర్మాణ విలువలు క్వాలిటీ గా.. రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఒక కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా పప్రేక్షకుల ముందుకు వచ్చిన “వర్జిన్ స్టోరి” సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది
Cinemarangam.com Review Rating.. 3/5









