విదేశాలలో చదువుకోవడం ద్వారా తమ విద్యను కొనసాగించడానికి ఇష్టపడే విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసే దేశాలలో మన భారతదేశం ఒకటి. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ విద్యార్థులు తదుపరి చదువుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలను ఆశ్రయించే వారు సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. అయితే కోవిడ్ -19 ప్రభావం తర్వాత విదేశాలలో చదువుకోవడానికి సరైన విశ్వవిద్యాలయాన్ని కనుగొనడం వారికి చాలా పెద్ద పనిగా మారింది. సంఖ్యలు తగ్గాయి మరియు నకిలీ కన్సల్టెన్సీల పెరుగుదల వేగంగా ఉంది. విదేశీ విద్య యొక్క పర్యావరణ వ్యవస్థ చాలా స్టింగ్‌గా మారింది. విద్యార్థులు తమ విద్యను పూర్తి చేయడానికి సరైన కన్సల్టెన్సీని లేదా విశ్వవిద్యాలయాన్ని ఎన్నుకోవడంలో కష్టాలను ఎదుర్కొంటున్నారు.విద్యార్థుల కష్టాలను అధిగమించడానికి బ్లూ రిబ్బన్ సంస్థ ఒక ఎడ్యుకేషనల్ ఫెయిర్‌ను నిర్వహించేందుకు చొరవ తీసుకుంది, ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు మరియు విచారించవచ్చు మరియు పరిశోధన చేయవచ్చు మరియు విదేశాలలో మీ అధ్యయనాన్ని కొనసాగించడానికి మీకు ఇష్టమైన విశ్వవిద్యాలయాన్ని కూడా ఎంచుకోవచ్చు.

“బ్లూ రిబ్బన్” మీకు మంచి స్కాలర్‌షిప్‌లను పొందచేయటం తో పాటు పబ్లిక్ రీసెర్చ్ విశ్వవిద్యాలయాలతో పాటు టాప్ 40 నేషనల్ ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాలను అందజేస్తుంది మరియు స్కాలర్‌షిప్‌లపై మీ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపేందుకు అవకాశం అందిస్తుంది. “బ్లూ రిబ్బన్ కన్సల్టెన్సీ’ మీరు అడ్మిషన్‌లను పొందేలా చేస్తుంది. మీ విలువైన సమయం లో ఏ జాప్యాలు ఉండకుండా మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి ‘బ్లూ రిబ్బన్’ కాన్సల్టెన్సీ సి.ఈ.ఓ . పి.సంతోష్ కుమార్, “బ్లూరిబ్బన్’ డైరెక్టర్ రణవీర్, ప్రియాంక, సరస్వతి,స్వర్ణలత, లు ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 11:00 గంటలకు కత్రియా హోటల్‌లో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దుబ్బాక ఎం ఎల్.ఏ.రఘునందన్ , సినీ యక్ట్రెస్ శేర్రి అగర్వాల్, ప్రియాంక శర్మ, అవికా గోర్, తదితరులు పాల్గొని ఎడుకేషనల్ ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ ..ఈరోజు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విశ్వ విద్యాలయాలను పిలిచి గత 15 సంవత్సరాలుగా విశ్వ వ్యాప్తంగా ఉన్నటు వంటి విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నటువంటి బ్లూ రిబ్బన్ సంస్థ హైదరాబాదు లో ఈ రోజు ఇంత గొప్ప సంస్థలన్నింటినీ ఒక చోటికి తీసుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ మిత్రులను అభినందిస్తున్నాను
భారతీయ విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అనేక అవకాశాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అనేక యూనివర్సిటీలలో జాయిన్ అయి భారతదేశం యొక్క కీర్తిప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెపుతున్న విద్యార్థులను కూడా ఈరోజు నేను అభినందిస్తున్నాను. ఈరోజు ఏ కొత్త కంపెనీ, ఏ పెద్ద కంపెనీ ,మల్టీ నేషనల్ కంపెనీ చూసిన దానికి సీఈఓగా భారతీయులు ఎదిగినారు అంటే భారతీయ విద్యార్థుల్లో పొటెన్షియాల్టీని వారిలో శక్తిని ఆ యూనివర్సిటీలు సాన బట్టి వారికి గొప్ప అవకాశాలు కల్పించినటువంటి అధ్యాపకులకు కూడా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని భాగ్యనగరంలో గత 15 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కంపెనీ మిత్రులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ.. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లోకి భారత దేశ విద్యార్థులు పోవడమనేది ఒక మంచి సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ విద్యార్థులు అందరూ కూడా తమ విద్యను తమ పనితీరును మరింత మెరుగు పరుచుకుని విశ్వవ్యాప్తంగా జరిగే పోటీల్లో చురుకుగా పాల్గొని భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

బ్లూరిబ్బన్ కాన్సల్టెన్సీ సి.ఇ.ఓ పి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ… సౌత్ ఇంఫైల్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ఏర్పాటు చేశాము. అన్ని దేశాల నుంచి 43 యూనివర్సిటీస్ యుఎస్ఏ, యుకె,కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ మొదలగు అన్ని దేశాల యూనివర్సిటీస్ నుంచి వారి రిప్రజెంటేర్స్ ను రప్పించడం జరిగింది.చాలామందికి ఏ కంట్రీ వెళ్లాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి అటువంటి వారు ఇక్కడకు వస్తే ఎటువంటి అప్లికేషన్ ఫీజు ,ప్రాసెస్ ఫీజ్ ఏమీ తీసుకోకుండా స్టూడెంట్ డౌట్స్ ను క్లియర్ చేస్తాము.వచ్చిన స్టూడెంట్స్ వారి డాక్యుమెంట్స్ ను వాలిడేషన్ చూసుకొని మీకు నచ్చిన కంట్రీ ,నచ్చిన యూనివర్సిటీ తో డిస్కస్ చేసి అడ్మిషన్ కన్ఫర్మేషన్ , స్కాలర్షిప్ కన్ఫర్మేషన్, డిసైడ్ అవుతుంది దీనికి ఎలాంటి ఛార్జి తీసుకోరు . కరోనా ప్యాండమిక్ తరువాత ప్రతి స్టూడెంట్ కూడా ఏ కంట్రీ వెళ్ళాలి అనేది మీ ఛాయిస్. ఏ కంట్రీ ఏం సర్వీస్ ఇస్తున్నాయి.ఏ కాలేజ్ ఏ బెనిఫిట్స్ ఇస్తాయి.UG and PG కోర్సులకు స్కాలర్ షిప్ లభిస్తాయా.. సెటిల్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, వర్క్ పర్మిట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా..ఇలా అన్ని యూనివర్సిటీల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. యూకే గాని యూరప్ లో గాని కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్డబుల్ బడ్జెట్లో ఉన్నాయి. దుబాయ్ లో 1 ఇయర్ కోర్సు తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని డిఫరెంట్ కేటగిరీలో కావాలి అనేది అన్ని ఇలాంటి చార్జెస్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. .అలాగే బ్లూ రిబ్బన్ గ్లోబల్ టెక్నాలజీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం.ఇప్పటి వరకు ఎవరికీ లేని .ఫస్ట్ తెలుగు కన్సల్టెంట్ బ్రాంచ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 85 వఫ్లోర్లో ఉంది.”బ్లూ రిబ్బన్ సంస్థ” గత 15 సంవత్సరాలుగా రన్ చేస్తూ ఇప్పటివరకు 12 వేల పై చిలుక వీసాలు ,340 యూనివర్సిటీస్ టైఅప్ అయి ఉన్నాము.మా ఉద్దేశం ఒక్కటే మంచి ఉద్దేశంతో స్టూడెంట్ వెళ్తారు. మేము అదే ఉద్దేశంతోనే ఎయిర్ పోర్ట్ పికప్ కానీ,జాబ్ కానీ పార్ట్ టైం జాబ్ అసస్ కానీ అలాంటిది ఇదే కంపెనీ బ్లూ రిబ్బన్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అబ్రాడ్ లో గానీ యుకె గానే కెనడాలో, జాంబీ లో సేమ్ సపోర్ట్ స్టూడెంట్స్ కు ఉంటుంది. మేము స్టూడెంట్ కు వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్తాము అన్నారు.

‘బ్లూ రిబ్బన్’ డైరెక్టర్ రణవీర్ మాట్లాడుతూ.. ఇవాళ 40 టాప్ యూనివర్సిటీలను ఒక ప్లాట్ ఫామ్ మీద తీసుకొచ్చి స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ 40 యూనివర్సిటీలు యు.కె, యూఎస్ఏ, కెనడా, యూరప్ ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలా వివిధ దేశాల నుంబ్చి వివిధ కాలేజీల నుంచి యూనివర్సిటీల రిప్రజెంటర్స్ ఇక్కడికి రావడం జరిగింది.కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు.
శేర్రీ అగర్వాల్ మాట్లాడుతూ .. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టైం బిగ్గేస్ట్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ ని బ్లూ రిబ్బన్ కన్సల్టెంటు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం హైదరాబాదులోనా ఇంత పెద్ద ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి బెస్ట్ స్టడీ కోసం బెస్ట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి అన్నారు.









