Suspense Crime Thriller ‘Mayurakshi’ Movie Review

Cinemarangam.com
రివ్యూ రేటింగ్ : 3 /5
సినిమా : మయూరాక్షి
బ్యానర్: శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్
దర్శకత్వం : సైజు SS
నిర్మాత: వ‌రం జ‌యంత్ కుమార్
నటీ నటులు : ఉన్ని ముకుంద‌న్, మియా జార్జ్,డాక్టర్ అజయ్,`మ‌యూరాక్షి తదితరులు
సహనిర్మాతలు : వ‌రం యశ్వంత్ సాయి కుమార్

మెడికల్ క్రైం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ థ్రిల్లింగ్ గానే వుంటాయి. వాటికి కొంచం సస్పెన్స్ కూడా జోడిస్తే తాజాగా విడుదలైన మాయూరాక్షి లా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది.శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై జనతాగ్యారేజ్, భాగ‌మ‌తి ఫేం ఉన్ని ముకుంద‌న్, మియా జార్జ్ జంటగా రూపొందిన చిత్రం `మ‌యూరాక్షి`. యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ “మ‌యూరాక్షి” ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండీ.

కథ:
డాక్టర్ గా పనిచేసే అజయ్, సెంట్రల్ మినిస్టర్ చౌడప్ప మనుమరాలు ఝాన్సీ ఇద్దరూ ప్రేమించు కుంటారు. అయితే ఒకరోజు కేంద్రమంత్రి చౌడప్ప హెల్త్ చెక్ అప్ కోసం అజయ్ పనిచేసే ఆసుపత్రికి వెళతాడు. అక్కడ మంత్రికి బిపి ఎక్కువగా ఉండటంతో… డాక్టర్ అజయ్ ఇచ్చిన ఓ ఇంజెక్షన్ కారణంగా కేంద్ర మంత్రి గుండె పోటుతో మరణిస్తాడు. అయితే అజయ్ ఇచ్చిన ఇంజక్షన్ కారణంగానే మంత్రి మరణించాడని పోలీసులు అజయ్ పై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు.అరెస్ట్ ఐన డాక్టర్ అజయ్ ఈ కేసు నుంచి బయటపడ్డారా లేదా? లేక కేంద్ర మంత్రి అజయ్ ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగానే మరణించాడా?  డాక్టర్ అజయ్ కి… రాజీవ్ (ఉన్ని ముకుందన్)కు వున్న లింకేంటి ? రాజీవ్ అజయ్ కు ఎందుకు సహాయపడ్డారు? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించిన మయూరాక్షి (మియ జార్జి) ఎవరు?  తదితర వివరాలన్నీ తెలియాలి అంటే వెండితెరపై సినిమా చూడవలసిందే..

నటీ నటుల పనితీరు
జూనియర్ ఎన్టీర్ నటించిన జనతా గ్యారేజ్,అనుష్క లీడ్ రోల్ లో నటించిన “భాగమతి” వంటి సినిమా లలో నటించి తెలుగు ప్రేకషకులకు దగ్గరైన అయిన మలయాళ యువ హీరో ఉన్ని ముకుందన్ ఇందులో లవర్ బాయ్ గా, సి బి ఐ ఆఫీసర్ చాలా చక్కటి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. అతనికి జంటగా నటించిన మియా కూడా అడవి బిడ్డగా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించి మెప్పించింది. డాక్టర్ అజయ్, అతనికి జంటగా నటించిన ఝాన్సీ కూడా బాగా నటించారు.ఉన్ని ముకుందన్ ,మియా జార్జ్ లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఝాన్సీ అమ్మగా, సుప్రీమ్ కోర్టు లాయర్ గా నటించిన నటీమణి కూడా కోర్టు సీనుతో మెప్పించింది. కేంద్ర మంత్రిగా, అతని కుమారుని గా నటించిన ఇద్దరు నటులూ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు రాసుకున్న కథ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి.ఫస్ట్ హాఫ్ అంతా డాక్టర్ అజయ్, ఝాన్సి ల మధ్య లవ్ ట్రాక్ ను  బాగా నడిపించి ఇంటర్వల్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటర్వల్ తరవాత అసలైన కథను అనేక మలుపులతో నడిపించి ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కు గురి చేస్తాయి. అలానే మినిస్టర్ మర్డర్ మిస్టరీలో వుండే ట్విస్ట్ & టర్న్స్ తో కోర్టు సీన్ ఆకట్టుకుంటాయి.మంచి కథను సెలెక్ట్ చేసుకొని చక్కని పాయింట్ తో ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా  స్క్రీన్ ప్లే రాసుకుని.. కథ.. కథనాలతో నడిపించి సక్సెస్  సాధించాడు దర్శకుడు ఈ కథ రెగ్యూలర్‌ స్టోరీ అయినా అనుభవం ఉన్న డైరెక్టర్‌లా సినిమాను కొత్తగా ప్రజెంట్‌ చేశాడు.లవ్‌, ఎమోషనల్‌ సీన్స్ ,థ్రిల్లర్స్, కామెడీ తో పాటు కథలో ట్విస్టులు బావున్నాయి.ముఖ్యంగా సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పనితీరు బాగుంది.శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై నిర్మించిన వ‌రం జ‌యంత్ కుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది

   Cinemarangam.com Review Rating 3 /5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here