1996వ బ్యాచ్ కి చెందిన సి.ఐ.కట్టా హరిప్రసాద్ గారు కరీంనగర్ జిల్లాలోని ప్రధాన పోలీస్ స్టేషన్లలో పనిచేసి అనేక ఉత్తమ సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు.ఆయన గత రెండేళ్లుగా నగరంలో పనిచేస్తూ గుర్తింపు పొందారు. పోలీస్ విభాగంలో విశిష్ఠ సేవలను అందిస్తున్న తను విధి నిర్వహణలో వున్నపుడు చూపిన ప్రతిభను గుర్తించి… తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పతకం ‘పురస్కారం ఇచ్చి సత్కరించి అభినందించారు . అంతే కాకుండా కట్టా హరిప్రసాద్ ని హైదరాబాద్ మహానరంలోని ఇంటెలిజన్స్ విభాగం (వెస్ట్ జోన్) కు సి.ఐ.గా నియమించారు.