‘Vadu Evadu’ first look poster & teaser released by Talasani Srinivas Yadav

రాజేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై మాధురి, పూజిత సమర్పణలో కార్తికేయ, అఖిల నాయర్ హీరో హీరోయిన్లుగా ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ ” వాడు ఎవడు ” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ … టీజర్ చూసాను బాగుంది, ఇలాంటి యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని, ఇందులో నటించిన నటీనటులకు , సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని ఈ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు.

కథ,మాటలు,స్రీన్ ప్లే రాజేశ్వరి పాణిగ్రహి మాట్లాడుతూ ... సమాజంలో జరుగుతున్న కొన్ని అసాంఘిక శక్తులను మహిళలు ఎదుర్కోలేక వాళ్ళ అందమైన జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగుస్తున్నాయి వైజాగ్ లో జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనల ను తీసుకోని దాని ఆధారంగా తీసిన సినిమా ఇది అని అన్నారు .

దర్శక నిర్మాత మాట్లాడుతూ ... ఈ చిత్రంలో మూడు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి అని తెలియ జేశారు. ప్రమోద్ కుమార్ సంగీత దర్శకత్వంలోని మూడు పాటలు వైజాగ్ పరిసర ప్రాంతాలలోని, ఒరిస్సా అందమైన లొకేషన్లలో చిత్రీకరించామని, ఈ మూవీ ద్వారా సమాజానికి ఒక మంచి మెసెజ్ ఇస్తున్నామన్నారు.

ఇంకా ఈ చిత్రంలో శివ్ యువన్ ,ఆంజనేయులు , రాజ్ కుమార్ , బాబు దేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ,మాటలు,స్రీన్ ప్లే : రాజేశ్వరి పాణిగ్రహి ,కెమెరా : విజయ్ గండ్రకోటి , సంగీతం : ప్రమోద్ కుమార్ ,బ్యాగ్రౌండ్ మ్యూజిక్ :రాజేష్ ,ఎడిటర్ : సాయి ఆకుల,నరేష్ , ఫైట్స్ : రాము , నిర్మాత, దర్శకత్వం : ఎన్.శ్రీనివాసరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here