Hero Gopi Chand’s love, Revenge Drama ‘Pakka Comarcial’ Review

Cinemarangam.com
రివ్యూ రేటింగ్..3/5
సినిమా : “పక్కా కమర్సియల్”
స‌మ‌ర్ప‌ణ – అల్లు అరవింద్
బ్యాన‌ర్ – జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ – బ‌న్నీ వాస్
ద‌ర్శ‌కుడు – మారుతి
నటీనటులు : గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – ర‌వీంద‌ర్
మ్యూజిక్ – జ‌కేస్ బీజాయ్
స‌హ నిర్మాత – ఎస్ కే ఎన్
లైన్ ప్రొడ్యూసర్ – బాబు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ – సత్య గమిడి
ఎడిటింగ్ – ఎన్ పి ఉద్భ‌వ్
సినిమాటోగ్ర‌ఫి – క‌ర‌మ్ చావ్ల‌
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్

ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ పతకాలపై గోపీచంద్, రాశి ఖన్నా జంటగా విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో బ‌న్నీ వాస్ నిర్మాత‌గా చేస్తున్న “పక్కా కమర్షియల్” సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా జులై 1 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండీ

 

కథ
లక్కీ (గోపీచంద్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి సూర్య నారాయణ(సత్య ప్రకాశ్) కుమారుడు. అతడు పక్కా కమర్షియల్ లాయర్. కాసులకోసం ఎలాంటి కేసునైనా టేకప్ చేసుకొని తప్పును ఒప్పు చేసే నేర్పరి. అదేసమయంలో పారిశ్రామిక వేత్త ఆయిన వివేక్ అలియాస్ వీరయ్య(రావు రమేష్) చేయని అక్రమాలు వుండవు. తనకున్న డబ్బు, పరపతితో న్యాయస్థానంలో సైతం తన మీద ఈగ వాలకుండా చూసుకునే వివేక్… ఓ కేసు విషయంలో లక్కీని సహాయం అడుగుతాడు. అయితే బాధితుల తరఫున లక్కీ తండ్రి వాదించడానికి రెడీ అవుతాడు. దాంతో లక్కీకి ఈ కేసు విషయంలో తండ్రితోనే న్యాయస్థానంలో పోటీ పడాల్సి వస్తుంది. మరి ఆ కేసు ఏంటి? ఇందులో ఎవరు గెలిచారు? న్యాయ మూర్తి అయిన సూర్య నారాయణ… న్యాయ వాదిగా ఎందుకు మారాడు? వివేక్ తో అతనికి వున్న వైరం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినీమా చూడాల్సిందే.


నటీ నటుల పనితీరు
మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో గోపి చంద్ మునుపటి లాగే యంగ్ యానార్జటిక్ గా కనిపిస్తూ కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా చాలా స్టైలిష్ గా కనిపించారు రాశి ఖన్నా చాలా బాగా చేసింది. ఎంతో కొంత కామిడీ పండింది అంటే అది రాశి ఖన్నా పాత్రకే. రావు రమేష్ ఎప్పటిలాగే చెలరేగి పోయి… ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు.ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో నిజాయితీ గల తండ్రి పాత్రలో సత్య రాజు పాత్ర చాలా చక్కగా నటించాడు.వైవా హర్ష,. స్టార్ కమెడియన్ సప్తగిరి, సియా గౌతం లు అజయ్ ఘోష్, కమెడియన్ సుదర్శన్ లు వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
రొటీన్ రివేంజ్ డ్రామా స్టోరీని ఎంచుకుని కాస్త డిఫరెంట్ స్క్రీన్ ప్లేను రాసుకున్నాడు దర్శకుడు మారుతి. సిన్సియర్ గా పనిచేసే తండ్రి… అతన్ని ఫ్లాష్ బ్యాక్ లో విలన్ ఇబ్బంది పెట్టడం… దాన్ని చిన్నతనంలో చూసిన అబ్బాయి పెరిగి పెద్దవాడై విలన్ మీద పగ తీర్చుకోవడం. వంటి స్టోరీస్ వెండితెర మీద వచ్చినా కూడా రొటీన్ కు భిన్నమైన కథను యువ దర్శకుడు మారుతి ఎంచుకొని తెరకెక్కించాడు. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు.ఫస్ట్ హాఫ్ రాశీఖన్నా సీరియల్ షూటింగ్స్ ఎపిసోడ్స్ తో కాస్త ఎంటర్టైనింగ్ చేసింది . కోర్టు సీన్స్ ఇక సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జ‌కేస్ బీజాయ్ సంగీతం చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.. క‌ర‌మ్ చావ్ల‌ సినిమాటోగ్రఫీ, ఎన్ పి ఉద్భ‌వ్ ఎడిటింగ్ బాగుంది.. ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ
భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మాస్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే..ఈ సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “పక్కా కమర్షియల్” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.

Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here