రాధ క్యూబ్ పతాకంపై దిక్షిత్ , మనోరా చోప్రా, జాస్మిన్, ఛాయ, ప్రణాళి, త్రిప్తి, త్రిష, జబర్దస్త్ అవినాష్, జబర్దస్త్ సన్నీ, సమీర్ నటీ నటులుగా నృత్యదర్శకుడి నుంచి `రణం` చిత్రంతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం `హైయ్ ఫైవ్` ఫన్ ఎండ్ గన్ అనేది ట్యాగ్ లైన్. రాధా రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 22 న థియేటర్స్ లలో విడుదలకు సిద్దమైన సందర్బంగా హైదరాబాద్ లోని దస్ బల్లా హోటల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శక, నిర్మాత జీవితా రాజశేఖర్, ఏ యస్ రవికుమార్ చౌదరి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నటుడు శివారెడ్డి తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా
గెస్ట్ గా వచ్చిన జీవితరాజశేఖర్ మాట్లాడుతూ.. మా వెడ్డింగ్ యానివర్సరీ కి విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు.ఏ వ్యక్తి అయితే అమ్మా,నాన్నలను గౌరవించి ప్రేమిస్తారో అలాగే వారి కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారో వాళ్ళంత ధనవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరని నేను అనుకుంటాను. అటువంటి మంచితనం అమ్మ రాజశేఖర్ దగ్గర ఉంది .ఈ సక్సెస్ అనేది నా ఒక్కరితోనే ఆగిపోకూడదు నా తర్వాత వారు కూడా సక్సెస్ అవ్వాలని అందరినీ ఎంకరేజ్ చేసే టటువంటి మంచి గుణం ఉన్న వ్యక్తి అమ్మ రాజశేఖర్. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.ఈ రోజు నేను కేవలం అమ్మ రాజశేఖర్ కోసమే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ రావడం జరిగింది. హార్ట్ లో ప్యూర్ గా ఉండి ఎదుటి వారికి మంచి చేయాలనే ప్రతి ఒక్కరూ ఈ రోజు కాకపోతే రేపైనా చాలా బాగా ఉంటారు. ఈ సినిమా కోసం ఫ్యామిలీ అంతా ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్ కు రావడమే మానేశారు. అయితే చిన్న సినిమాలకు ఓటిటి ఒక మంచి సపోర్ట్ గా నిలుస్తుంది. ఈనెల 22న ప్రేక్షకుల ముందుక వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు
చిత్ర దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..మా ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. ఈ ఫంక్షన్ కి హీరో నితిన్ వస్తానని చెప్పడంతో తనకు ఈ ఫంక్షన్ లో ది బెస్ట్ ఏ.వి ఇవ్వాలని మంచి ఏ. వి.చేయడం జరిగింది.అయితే నితిన్ గురువు అనే కృతజ్ఞత భావం లేకుండా తను ఇంట్లో ఉండికూడా రాలేదు. చివరికి బైట్ అడిగినా కూడా ఇవ్వలేదు. నితిన్ కు డ్యాన్స్ రాకపోయినా నేను డాన్స్ నేర్పించాను. ఈ బ్యానర్ లో మేము చేస్తున్న మొదటి సినిమాకు నితిన్ వస్తారని బిలీవ్ చేశాను.అయితే ఈ రోజు నితిన్ ఈ ఫంక్షన్ కు రాకుండా నన్ను ఇన్సల్ట్ చేశారు. అది నన్నెంతో బాధించింది. మన ఎదుగుదలకు కారణమైన గురువులను మరిచిపోయిన వారు ఎప్పటికీ స్టార్స్ కాలేరు. లైఫ్ లో ఎంత ఎత్తుకు ఎదిగినా దానికి కారణమైన వారిని మాత్రం మర్చిపోకూడదు. నేను ఎంతో మంది డాన్స్ మాస్టర్స్ కు ,డైరెక్టర్స్ కు, ప్రొడ్యూసర్స్ కు ఇలా చాలా మందికి లైఫ్ ఇచ్చాను. అలాగే ఈ సినిమాకు మేము ఎంతో కష్టపడ్డాము. ఈ సినిమాకు అద్భుతమైన టెక్నిషియన్స్ దొరికారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. ఎస్. తమన్ అద్భుతమైన సంగీతం అందించారు.అలాగే నటీ నటులు అందరూ ఎంతో డెడికేటెడ్ వర్క్ చేసినందున సినిమా చాలా బాగా వచ్చింది. నేను చేయబోయే నా నెక్స్ట్ ప్రాజెక్టు లో నా కొడుకు ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాను. దీనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.ఈ నెల 22 న వస్తున్న మా “హైయ్ ఫైవ్” సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర నిర్మాత రాధా రాజశేఖర్ మాట్లాడుతూ.. నా మొదటి ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.అమ్మ రాజశేఖర్ గురించి చెప్పాలంటే తను లైట్ బాయ్, వాటర్ బాయ్ నుంచి అన్ని పనులు తనే చూసుకుంటాడు.నిజంగా డైరెక్షన్ అనేది ఆయనను చూసే నేర్చుకోవాలి. మేము చేస్తున్న ఈ సినిమాకు ఎన్నో కష్టాలు పడ్డాము. అలాంటి టైమ్ లో మాకు చాలా మంది మాకు సపోర్ట్ గా నిలిచారు వారందరికీ నా ధన్యవాదాలు.అలాగే సంతోషం సురేష్ గారు మా ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ చేశారు వారికి కూడా మా ధన్యవాదాలు ఈ నెల 22 న రిలీజ్ అవుతున్న మా సినిమా చూసిన వారందరినీ కూడా మా “హైయ్ ఫైవ్” సినిమా నిరాశ పరచదని నమ్ముతున్నాను. కాబట్టి మీరందరూ థియేటర్ కి వెళ్లి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ, అమ్మ రాజశేఖర్ నాకు డాన్సర్ నుంచి తెలుసు. ఒక్కో మెట్టు ఎక్కుతూ డాన్స్ డైరెక్టర్‌గా మారాడు. ఆ తర్వాత చిత్ర దర్శకుడుకూడా అయ్యాడు. మా ఇద్దరి కెరీర్ ఒకేలా వుంది. 2004లో నేను యజ్ఞం సినిమాకు దర్శకత్వం చేస్తే, అదే బేనర్‌లో రణం చిత్రానికి తను దర్శకుడు అయ్యాడు. ఇద్దరం మోతీ నగర్‌లోనే వుంటాం. అమ్మ రాజశేఖర్ కష్టజీవి. నేను అమ్మదొంగ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు అమ్మ రాజశేఖర్ డాన్స్ చేసేవాడు. నేను దర్శకుడిగా సినిమా చేసినప్పుడు తను డాన్స్ డైరెక్టర్‌గా నా సినిమాకు పనిచేశాడు. తను ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఇందులో పనిచేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.
మరో దర్శకుడు సూర్య కిరణ్ మాట్లాడుతూ, అందరినీ హైయ్ ఫైవ్ చేసే వ్యక్తి అమ్మ రాజశేఖర్. తను చాలా ఎనర్జీగా వుంటాడు. అందుకే టైటిల్ కూడా అలానే పెట్టాడు. హైస్కూల్‌లో నాకు సీనియర్. స్టేజీ ప్లేకూడా చేశాం. నేను ఓసారి ఆసుపత్రిలో వుంటే అమ్మ రాజశేఖర్ వచ్చాడు. మనం బాధగా వున్నప్పుడు పక్కనున్నవాడే మంచి ఫ్రెండ్. నాకు అలాంటిఫ్రెండ్ దొరికాడు. నేను తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. షూటింగ్ ఖమ్మంలో వుంది. అమ్మ రాజశేఖర్ ఫంక్షన్ కోసం వర్షం అయినా రావాలనిపించింది. అమ్మ రాజశేఖర్‌కు సురేష్ కొండేటి అండగా వున్నాడు. నేను తెలుగులో కొత్త సినిమా చేస్తున్నా. అందులో సురేష్ కొండేటి ఓ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ హైయ్ ఫైవ్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు శివారెడ్డి మాట్లాడుతూ.. అమ్మ రాజశేఖర్ గారు, రాధా రాజశేఖర్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. వీరిద్దరూ ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. మంచివాళ్ళకు ఫలితాలు లేటుగా వచ్చినా అది స్థిరంగా నిలిచి పోతుంది. ఈ నెల 22న వస్తున్న సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు
చిత్ర హీరో దీక్షిత్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న “హైయ్ ఫైవ్” లాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటుడు విశ్వ మాట్లాడుతూ, అందరినీ అమ్మ రాజశేఖర్ కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. నేను మాస్టర్‌తో కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాకు డబ్బులు రావాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.
బిగ్ బాస్ ఫెమ్ హీరోయిన్ దీవి మాట్లాడుతూ.. ఈ చిత్రానికి అమ్మ రాజశేఖర్ గారు, రాధా రాజశేఖర్ గార్లు ఎంతో వర్క్ తో వారు హార్ట్ అండ్ సోల్ పెట్టి నిర్మించారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత రామసత్యనారాయణ తో పాటు పాల్గొన్న వారందరూ ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.. ఈ వేడుకకు యాంకర్లుగా అవినాష్. అరియానా వ్యవహరించి సందడి చేశారు
నటీ నటులు
దీక్షిత్ , మనోరా చోప్రా, జాస్మిన్, ఛాయ, ప్రణాళి, త్రిప్తి, త్రిష, జబర్దస్త్ అవినాష్, జబర్దస్త్ సన్నీ, సమీర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాత : రాధా రాజశేఖర్
దర్శకత్వం : అమ్మ రాజాశేఖర్
సంగీతం : ఎస్ ఎస్. తమన్,
కెమెరామెన్ : ఎస్. ఎస్. ముజీర్
ఎడిటర్ : హరి ఎన్ టీ ఆర్
పాటలు : భాషశ్రీ
విజువల్ ఎఫెక్ట్ : చందు ఆది అండ్ టీం
పబ్లిసిటీ డిజైన్స్ : ఎమ్ కే ఎస్ మనోజ్
పి. ఆర్ ఓ : సురేష్ కొండేటి









