విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఆది సాయికుమార్ హీరోగా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన హీరో సుదీర్ బాబు ,హీరో అడవి శేషు, హీరో సిద్దు జొన్నలగడ్డ పాల్గొన్నారు. ఈ సందర్బంగా
డైలాగ్ కింగ్ ఆది సాయికుమార్ మాట్లాడుతూ…ఆదిని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరోలు సుధీర్ బాబు కు ,మేజర్ అడవి శేష్ కు ,డి. జె. టిల్లు సిద్దు కు చాలా థాంక్స్. 1972 లో సీనియర్ యన్టీఆర్ ఆశీర్వాదాంతో మొదలైన నా నట ప్రస్థానం ఆ తరువాత అందరి సూపర్ స్టార్స్ తో యాక్ట్ చేశాను. ఇప్పుడు యాక్టర్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నాను. అలాగే నాకు ఆగష్టు 19 అంటే విపరీతమైన మదర్ సెంటిమెంట్. కన్నడ లో “పోలీస్ స్టోరీ” 1996 ఆగష్టు 16 రిలీజ్ అయితే తెలుగు లో డిసెంబర్ 19 న రిలీజ్ అయ్యింది.అంటే ఇప్పటికి 26 ఇయర్స్ అయ్యింది.ఆరోజు నేను అగ్ని గా ఎంత టెన్షన్ పడ్డానో ఇప్పుడు తీస్ మార్ ఖాన్ కు అదే టెన్షన్ పడుతున్నాను.ఇంత మంచి మనుషులు,అభిమానులు, ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ప్రేమ కావాలి అంటూ వచ్చిన ఆదిని మీరందరూ ఆదరించి అభిమానించడం జరుగుతున్న ఈ ప్రయాణంలో కళ్యాణ్ గారు ఇచ్చిన మంచి స్క్రిప్ట్ ను తిరుపతి రెడ్డి గారు తెరకీక్కించడం చాలా సంతోషంగా ఉంది.సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.ఈ సినిమాకు పని చేసిన నటీ నటులకు, టెక్నిషియన్స్ కు అందరికీ థాంక్స్ చెపుతూ ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని అన్నారు.
చిత్ర నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. కళ్యాణ్ చెప్పిన కథ నచ్చడంతో సింగిల్ టేక్ లో ఓకే చేశాను. ఆ తరువాత ఆది గారికి కూడా నచ్చడంతో షూట్ మొదలుపెట్టాము. నేను బిజినెస్ లో బిజీగా ఉంటాను. కాబట్టి మొదటి రోజైనా షూటింగ్ కు వెళ్లి వద్దామని వెళ్ళాను. ఆది తో నాకు మంచి ర్యాపో ఏర్పడింది. ఆ తరువాత ఆది ప్రతి రోజు నన్ను వదలకుండా 45 డేస్ షూటింగ్ కు రప్పించుకున్నాడు. చాలా మంచి మనసున్న వ్యక్తి ఆది. తనతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది.కళ్యాణ్, సాయి కార్తీక్ లు ఫుల్ సపోర్ట్ చేశారు. సాయి గారు తన పాటలతో ప్రాణం పోయడమే కాకుండా అన్నా నువ్వు చేస్తున్న ఈ సినిమా మరో పటాస్, రాజా ది గ్రేట్ లా ఉంటుంది అన్నారు. నేను సినిమా చూసిన తరువాత “తీస్ మార్ ఖాన్” మా అందరికీ మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది. ఈ నెల 19 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు
గెస్ట్ గా వచ్చిన హీరో సుదీర్ బాబు మాట్లాడుతూ.. “తీస్ మార్ ఖాన్” ట్రైలర్ టీజర్, చాలా బాగున్నాయి. ఈ సినిమాకు ఇది పర్ఫెక్ట్ టైటిల్. ఇందులో మంచి ఎమోషన్ కూడా ఉంది. ఇంతకు ముందు నేను ఆది కలసి “శమంతకమణి” సినిమాలో కలసి చేసినప్పుడు చూశాను తను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో ఇది వారి తండ్రి నుండి వచ్చిన హార్డ్ వర్క్ అనుకుంటాను. చిత్ర దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకున్నాడు. సాయి కార్తీక్ గారు ప్రతి సినిమాకు ఫుల్ ఎఫర్ట్ పెట్టి మంచి మ్యూజిక్ ఇస్తాడు. నిర్మాతలో మంచి నటుడు ఉన్నాడు.ఇలాగే నటిస్తూ ఇక ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలెన్నో తియ్యాలని కోరుకుంటున్నాను.అలాగే పాయల్ ఇండస్ట్రీకి మంచి వేవ్ తో వచ్చారు. తనకు, ఆదికి మరియు ఇందులో వర్క్ చేసిన వారందరికీ ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు
గెస్ట్ గా వచ్చిన హీరో అడవి శేషు మాట్లాడుతూ.. ఆది మంచి ట్యాలెండెడ్ యాక్టర్. ట్రైలర్ చూస్తుంటే .టీం అంతా ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లలో ఆది అద్భుతంగా చేశాడు. ఆగష్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రిలీజ్ రోజే మా అమ్మ బర్త్ డే. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అయితే అదే మా అమ్మ కు పెద్ద గిఫ్ట్. దర్శక, నిర్మాతలకు ఆదికి, టోటల్ టీం అందరికీ ఈ సినిమా మంచిపేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
గెస్ట్ గా వచ్చిన హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను చూసిన ఆది సినిమాలు ఆన్నిటిలో కంటే కూడా ఈ సినిమాలో చాలా చాలా..ఫ్రెష్ గా ఎక్సెంట్రిక్ గా, ఏరాటిక్ గా క్రేజీ గా ఉన్నాడు క్యారెక్టర్ వైజ్ చూస్తే.. అలాగే కళ్యాణ్ గారు ఫ్రెష్ గా ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీశారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. తను ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే ఈ నెల 19 న వస్తున్న ఈ సినిమా తిరుపతి రెడ్డి గారికి టోటల్ టీం కు అందరికీ మంచి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సుధీర్ బాబు, అడవి శేష్ , సిద్దు లకు ధన్యవాదములు.ఆగష్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కొరకు చాలా ఎగ్జయిట్ మెంట్ తో టెన్షన్ కూడా ఉంది. ఇలాంటి అవుట్ & అవుట్ పక్కా కమర్సియల్ సినిమా చేసి చాలా రోజులయ్యింది.ఈ మధ్య కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాను. అలాంటి టైమ్ లో విన్న ఈ కథ నాకెంతో నచ్చింది.ఈ సినిమా అయితే ఇది కమర్సియల్ సినిమా అయినా రెగ్యులర్ ఫార్మాట్ లా ఉండకుండా కొత్తగా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. మంచి ఎమోషన్ ఉంటుంది. అలాగే మంచి టీం తో పనిచేశాను. పాయల్ వెరీ వెరీ స్వీట్ కో స్టార్. అలాగే ఇందులో పూర్ణ గారు, సునీల్ అన్న, శ్రీకాంత్ అయ్యాంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఇలా అందరూ చాలా బాగా చేశారు.. కళ్యాణ్ నన్ను చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో కొత్త ఆదిని చూస్తారు అనుకుంటున్నాను. మంచి స్పాన్ ఉన్న ఈ కథకు ఎక్కువ ఖర్చు అవుతుందను కున్నాను.కానీ మా నిర్మాత డా..నాగం తిరుపతి రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వెనుకడకుండా నిర్మించారు.అలాగే సాయి కార్తీక్ తో నాది థర్డ్ కాంబినేషన్.అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తనకు థాంక్స్ చెప్పుకోవాలి..ఆగష్టు 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను. మీకు నచ్చితే పది మందికి చెప్పండి అని అన్నారు.
చిత్ర దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ..నేను వెళ్లి ఈ కథ చెప్పగానే నన్ను నా కథను నమ్మి ఇంత పెద్ద కాస్టింగ్ ఇచ్చారు. 100% బాగా తీశాను అనుకుంటున్నాను. నా డైరెక్షన్ టీం చాలా కష్టపడ్డారు. సాయి కార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ తో పాటు సాలీడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. పాయల్ కు 15 మినిట్స్ మాత్రమే కథ చెప్పినా కథను నమ్మి చేశారు.డిఓపి నాకు మంచి విజువల్స్ ఇచ్చాడు. వెన్నెల కంటి గారి అబ్బాయి రాకేంద్ మౌలి మంచి లిరిక్స్ ఇచ్చాడు తనే నాలుగు పాటలు రాశాడు, భాస్కరపట్ల ఒక పాట రాశాడు. అలాగే ఎప్పుడూ చూడని సునీల్ గారిని ఈ సినిమాలో చూస్తారు. సోలో తీస్ మార్ ఖాన్ ఎవరంటే పూర్ణ గారు అందంతా మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగే శ్రీకాంత్ అయ్యాంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఇలా ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ థాంక్స్. నిర్మాత తిరుపతి రెడ్డి గారి గట్స్ కు మెచ్చుకోవాలి.ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.ఈ నెల 19 న వచ్చే ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఈ సినిమా పెద్ద విజయవంతం అయ్యేలా చెయ్యాలని అన్నారు
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ..ఇటీవలే విడుదలైన మా సినిమా టీజర్ కు ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అలాగే నేనేమి స్టార్ యాక్టర్ కూతురిని కాదు, నా వెనుక సపోర్ట్ కూడా ఎవరూ లేకపోయినా నన్ను అదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ మూవీ నాకు చాలా వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే మూడు సంవత్సరాల తరువాత నా సినిమా థియేటర్స్ లలో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. “తీస్ మార్ ఖాన్” సినిమా ఫుల్ పవర్ ప్యాక్డ్ సినిమా ఆది గారు యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశాడు. సాయి కార్తీక్ గారు మంచి బి. జి.యం ఇచ్చారు. కళ్యాణ్ గారు చెప్పిన స్క్రిప్ట్, కథ నచ్చింది. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. నాకిలాంటి మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ఈ నెల 19 న వస్తున్న ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తీసుకురావడమే కాకుండా నిర్మాతకు కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ..ఆది మొదటి సారి అవుట్ & అవుట్ పక్కా కమర్సియల్ సినిమా చేశాడు.ఆది పోలీస్ అయ్యాక ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా. పోలీస్ అయిన తరువాత కథ వేరే లెవెల్ కు వెళ్ళిపోతుంది.దర్శకుడు కళ్యాణ్ కు ఈ సినిమాతో పెద్ద కమర్సియల్ హిట్ వస్తుందని నమ్ముతున్నాను. ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తిరుపతి రెడ్డి అన్నకు పెద్ద హిట్ అయ్యి ఎక్కువ డబ్బులు వచ్చి ఇంకా పెద్ద సినిమాలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
నటీ నటులు
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్,సునీల్, శ్రీకాంత్ అయ్యాంగార్ అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : యాళ్ల తిర్మల్ రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు









