20lakhs Cheque Donated to CCC (Chiranjeevi Charitable Trust) From East West Entertainers & Tollywood Cricket Association (TCA)

చదువుకొనే స్థోమత లేక మధ్యలోనే చదువును వదిలేస్తున్న పిల్లలు, సరైన సమయానికి రక్తం, వైద్యం దొరకక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ ఇలా పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న  బాధితులకు సేవలందిస్తుంది ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సంస్థ.చిత్రపురి కాలనీ లో నివసించే ఆర్టిస్టులకు మెరుగైన వైద్య సహాయం అదించాలనే తలంపుతో చిత్రపురి కాలనీ వాసులకు హాస్పిటల్ ను కట్టడానికి మెగాస్టార్ చిరంజీవి శ్రీకారం చుట్టారు.తను చేయబోయే మహాత్కార్యానికి మా వంతు సహాయం చేస్తామని ముందుకు వచ్చిన ఈ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ లు ముందుకు రావడంతో ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ వారు అమెరికాలోని డల్లాస్ లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) తో సెప్టెంబర్ 24 న డే & నైట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని CCC (చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్) కు డొనేట్ చేయడం జరుగుతుంది.ఈ మ్యాచ్ కు సంబంధించిన వివరాలను తెలియజేయదానికి ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్ & టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) సంస్థలు శుక్రవారం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి

మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్ గారు, ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్, తమన్ ,సుధీర్ బాబు తో పాటు జట్టు సభ్యులు ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ CEO రాజీవ్ మరియు సభ్యులు, పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు కట్టబోయే హాస్పిటల్ కు TCA & East West ఎంటర్ టైనర్స్ తరుపున CCC (చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ )కు 20 లక్షల చెక్కును అందజేశారు.

మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA )జెర్సీ & ట్రో్ఫీ ని లాంచ్ చేశారు.

నటుడు ప్రకాష్ రాజ్ గారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ అను సాంగ్ ను, మరియు మెగాస్టార్ చిరంజీవి గారి ఏవి ని లాంచ్ చేశారు


సంగీత దర్శకుడు తమన్ కు నేషనల్ అవార్డ్స్ వచ్చినందుకు ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ వారు మెగాస్టార్ చేతులమీదుగా చిన్న ఫెలిస్టేషన్ ఇవ్వడం జరిగింది

చిరంజీవి బర్త్ డే సందర్బంగా TCA & East West ఎంటర్ టైనర్స్ వారు అడ్వాన్స్ గా బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా చిరంజీవి గారితో కేక్ కట్ చేసి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం

మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ..ఈ రోజు మా తమ్ముళ్లు చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. వీరు చేసే ఈ కార్యక్రమం గొప్ప విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ సినిమా ఇండస్ట్రీ లో ఎవరిపని వారు చేసుకుంటూ పోతారు. అందరూ కలసి ఆడేది తక్కువ. అయితే శ్రీకాంత్, తరుణ్ లు సరదాగా మొదలుపెట్టిన ఈ ఆట ఇప్పుడు ఎంతో మందికి ఉపయోగ పడుతున్నందుకు మా తమ్ముళ్లకు ధన్యవాదములు. ఇక్కడ నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనుకోకుండా పక్కన ఇబ్బంది పడుతున్న వారికీ సహాయం చేస్తే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. మనిషి తృప్తికి అంతులేదు. ఎక్కడైతే తృప్తి లేదో అక్కడ వారికీ శాంతి కూడా ఉండదు.హుద్ హుద్ తుఫాన్ వచ్చినపుడు, పత్తి రైతులు చనిపోయారు అన్నప్పుడు ఇలా అన్ని విధాలుగా హెల్ప్ చేశాము. ఎవరికీ ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తే ఆరోజు ప్రశాంతంగా నిద్రపోతాము. నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన వారికీ నేను ఏమి ఇవ్వగలని అని వచ్చిన ఆలోచనే బ్లడ్ బ్యాంక్. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ విజయవంతంగా రన్ అవుతుంది. మేము ఈ రోజు ఇంతస్టేజ్ కు వచ్చాము అంటే అదంతా ప్రేక్షకులదే. కాబట్టి వారికీ మనం తిరిగి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ వారు మంచి మనసున్న వారు ఇప్పటి నుండో వీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఉమెన్స్ ఏంపవర్ మెంట్, మానసిక దివ్యాంగులకు ,పేద విద్యార్థులకు వారికి ఇలా ఎంతో మందికి హెల్ప్ చేయడం కోసం TCA కూడా సపోర్ట్ చేయడం చాలా సంతోషం. సినీ వర్కర్స్ అందరికీ ఉపయోగ పడాలనే తలంపుతో చిత్రపురి లో హాస్పిటల్ ను కట్టే కార్యక్రమం మొదలు పెట్టాను.అయితే నాకు వచ్చిన మొట్ట మెదటి 20 లక్షల చెక్ TCA , ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ వారిది కావడం చాలా సంతోషం. నేను తలపెట్టిన ఈ హాస్పిటల్ ను ఈ బర్త్ డే కు మీ అందరికీ హామీ ఇస్తున్నాను,వచ్చే సంవత్సరం నా బర్త్ డే రోజున హాస్పిటల్ ను ప్రారంభించబిస్తాను. ఈ హాస్పిటల్ కు మా నాన్న గారి పేరు పెట్టబోతున్నాను.ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ అధినేత వరప్రసాద్ బొడ్డు గారికి, రమేశ్ గారికి, రాజీవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సెప్టెంబర్ 24 న డల్లాస్ లో ఆడే మ్యాచ్ విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ మంచి భావంతో మంచి చేయడానికి ముందుకు వస్తే ఎంతో మంది హెల్ప్ చేయడానికి ఇలా ముందుకు వస్తారని అన్నారు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ..ఇలాంటి కార్యక్రమాలు, ఆలోచనలు అన్నా నాకు చాలా ఇష్టం. శ్రీకాంత్, తరుణ్ లు ఎప్పుడూ ఆపదలో ఉన్న వారికి బ్రిడ్జ్ వారదిలా ఉంటారు.ఇలాంటి పని చేయడం వల్ల మనిషి ఇంకా ఉన్నాడు అనే నమ్మకాన్ని కలిగించాలి ఇలాంటి కార్యక్రమాల వల్ల.ఇవన్నీ అన్నయ్య దగ్గర నేర్చుకొన్న విషయాలే.ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదిగాడు అనే దానికన్నా అతను ఎంత మందికి చేయుతనిచ్చి ఎదిగేలా చేశాడు అనేది ముఖ్యం.ఇలాంటి మంచి పని చేయడానికి చిరంజీవి గారు ఎప్పుడూ ముందు వరసలో ఉంటాడు. ఇలాంటి కార్యక్రమానికి అన్నయ్య రావడం సమంజసం అనుకుంటున్నాను.మంచి కార్యక్రమాలు చేయడానికి ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ అనేది ఒక చారిటీ ఇన్స్టిట్యూట్ లా కాకుండా ఒక సాంసృతిక వారధిలా పనిచేస్తుంది.ఇక్కడున్న ఆర్టిస్టులను మ్యాచ్ ద్వారా వారికీ చూయించడం, వారి ప్రేమ వీరికి చూయించడం ఇలా ఉబయ కుశలోపరిగా వచ్చే డబ్బును ఇండియాలో ఎవరికీ అవసరమో వారికివ్వడం జరుగుతుంది. అలాగే ఈస్ట్ వెస్ట్ టైనర్స్ & TCA వీరిద్దరూ కలసి సినిమా ఇండస్ట్రీ కోసం హాస్పిటల్ కడుతున్న అన్నయ్య ప్రయత్నానికి ఉడత సేవ చేస్తున్న ఇలాంటి మంచి పని సక్సెస్ కావాలి. అలాగే తమన్ కు నేషనల్ అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ తెలియజేశారు.

ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ అధినేత వరప్రసాద్ బొడ్డు వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ..ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, సినిమా డిస్ట్రిబ్యూషన్,సినిమా నిర్మాణం, ఓటిటి రిలీజెస్ వంటి కార్యక్రమాలు చేస్తుంది. అయితే మేము చిరంజీవి గారు తలపెట్టిన మంచి కాజ్ కు మా వంతు సహాయం చేస్తామని ముందుకు వచ్చిన టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ( TCA ) కు సపోర్ట్ గా మా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ వారితో బాగస్వామ్య మైనందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ CEO రాజీవ్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి, ప్రకాష్ రాజ్ గారికి ధన్యవాదములు.చిరంజీవి గారు ఎప్పుడూ సోసైటీ కి ఎంతో వ్యాల్యూబుల్ సర్వీస్ అందిస్తున్నారు. అలాగే TCA గానీ ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ గానీ మిమ్మల్నే ఫాలో అవుతుంది సర్. మేము చేసే ప్రతి మ్యాచ్ కూడా చారిటీ కోసం మొదలుపెట్టాము.మేము ఎప్పుడూ రెడీ అన్నా మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్న టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ( TCA ) శ్రీకాంత్ గారు తరుణ్ గార్లకు థాంక్స్ చెపుతున్నాను. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సెప్టెంబర్ 23 న మ్యూజికల్ నైట్ ఉంటుంది. సెప్టెంబర్ 24 న డల్లాస్ లో డే & నైట్ క్రికెట్ మ్యాచ్ తో ఎంటర్టైన్మెంట్ చేయడానికి మళ్లీ మీ ముందుకు వస్తున్నాము. మంచి పని కోసం చేస్తున్న మా పనిని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ టీం కెప్టెన్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమాలకు ముందే చిరంజీవి అన్నయ్య రావడం చాలా సంతోషంగా ఉంది.తెలుగులో ఫస్ట్ మీ ద్వారానే ఫండ్ రేజ్ అయ్యింది. మీరు హీరో బాలకృష్ణ, వెంకటేష్ ల కెప్టెన్సీ లో మీరందరూ మూడు మ్యాచ్ ఆడారు. మీరే మాకు స్ఫూర్తి. క్రికెట్ అంటే మా అందరికీ ఎంతో ఇంట్రెస్ట్. మేము సరదాగా 2006 లో నేను, తరుణ్ TCA స్టార్ట్ చేశాము.అయితే ఒకరోజు అన్నయ్య మాతో సరదాగా ఆడడం కాదు ఏదైనా మంచి పనికోసం మీ అటను ఉపయోగించండి అని చెప్పడంతో అన్నయ్య చేసే మంచి కార్యక్రమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సరదాగా స్టార్ట్ అయిన ఈ మ్యాచ్ మంచి పనికోసం హుద్ హుద్ తుఫాన్ కానీ ఇలా అనేక కార్యక్రమాల కొరకు మేము చాలాసార్లు క్రికెట్ మ్యాచ్ లు ఆడడం జరిగింది. అన్నయ్య CCC చారిటీ ని స్థాపించి 24 క్రాఫ్ట్స్ కు మీరు చేసిన సేవలు అద్భుతం. వీటిని ఎవ్వరూ ఎన్నటికీ మరచిపోలేరు.అలాగే కోవిడ్ టైమ్ లో ఆక్సిజన్ సరఫరా చేసి ఎంతోమందికి హెల్ప్ చేశారు. మీరు చేసిన సేవలు చాలా మందికి తెలియదు. తెలియనివి చాలా మేము చూశాము.ఆ ఇన్స్పిరేషన్ తోనే డల్లాస్ లో అడే మ్యాచ్ కు వచ్చే డబ్బులు CCC(చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ )కు మావంతు సహాయంగా 20 లక్షలు ఇవ్వాలను కుంటున్నాము. ఇక ముందు ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ బ్లెస్సింగ్స్ తో చేస్తాము. ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ వారు లాస్ట్ టైమ్ డల్లాస్ లో మమ్మల్ని బాగా చుసుకున్నారు. అలాగే సౌతాఫ్రికా లో రమేశ్ గారు కూడా, అలాగే స్పాన్సర్ లేకపోతే ఏ కార్యక్రమం జరగదు.ఇలాంటి మంచి కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న వారందరికీ థాంక్స్.అలాగే TCA లో 40 మెంబెర్స్ ఉన్నారు. వారంతా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ థాంక్స్ అన్నారు

టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ టీం వైస్ కెప్టెన్ తరుణ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు, ప్రకాష్ రాజ్ రావడం చాలా సంతోషం గా ఉంది. చిరంజీవి అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మేమంతా ఆయన్ను చూసి పెరిగినవాళ్ళం. మా అందరికీ నటనలో అయనే ఇన్స్పిరేషన్. అయన వాక్ ,స్టైల్ నో, డైలాగ్ డెలివరీనో మేము చెయ్యాలనుకునే వారం.అయితే చిరంజీవి గారు చేసే బ్లడ్ డొనేషన్, ఐ క్యాంప్, కోవిడ్ టైమ్ లో ఆక్సిజన్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ TCA వెళుతుంది.సెప్టెంబర్ 24 న డల్లాస్ లో మ్యాచ్ ఆడబోతున్నాము. మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను.మా టీంలో ఇక్కడ ఉన్న వారు కానీ లేని వారు కానీ అందరూ తమన్, సుదీర్, అశ్విన్, ఖయ్యుమ్, నరేష్, నిఖిల్, సాయి ధర్మతేజ్ ఇలా మా టీం వాళ్ళందరికీ డేట్స్ కుదరక పోయినా మేము సఫీల్ అవుతూ ఆడతాం కోవిడ్ వలన రెండు సంవత్సరాలు ఆడలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిసారి ఒక మంచి కోసమే(చారిటీ) ఆడతాం. ఈ సారి మొదటి సారి మా టీం అంతా అనుకొని చిరంజీవి గారు చిత్రపురిలో కట్టబోయే హాస్పిటల్ కు ఫస్ట్ ఫస్ట్ గా మా TCA తరుపు నుంచి ఒక 20 లక్షలు ఇవ్వాలను కున్నాము. అందుకు చిరంజీవి గారు కూడా ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది.అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ అధినేత వరప్రసాద్ బొడ్డు గారు, రాజీవ్ గారు , రమేశ్ గార్లు మమ్మల్ని బాగా చూసుకున్నారని అన్నారు.

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. శ్రీకాంత్, తరుణ్ లు ఎప్పుడూ ముందుండి మంచి కాజ్ కోసం క్రికెట్ మ్యాచ్ కానీ ఇలా రకరకాలుగా ఆర్గనైజ్ చేస్తూ మమ్మల్ని. ముందుకు నడిపిస్తున్నారు.అయితే మేము ఆడబోయే మ్యాచ్ కు చిరంజీవి గారు వచ్చి జెర్సీ ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ..ఇండస్ట్రీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ చిరంజీవి గారు. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ప్రకాష్ రాజ్ గారు.అలాంటి వారిద్దరూ ఈ కర్టెన్ రైజర్ రావడం చాలా హ్యాపీ గా ఉంది. మాములుగా ఒక యాక్టర్ క్రికెట్ ఆడితే దెబ్బలు తగులుతాయి అయినా వీరందరూ చాలా రిస్క్ తీసుకొని ఆడడం గ్రేట్.వీరంతా ఎంతో బిజీగా మంచి కాజ్ కోసం చేయడానికి మేము TCA తరుపున ముందుంటాము. సౌతాఫ్రికా లోని సెంచూరియన్ గ్రౌండ్ లో ఆడతామని తెలియదు. నేను సాయి ధర్మతేజ్ కలసి 100 రన్స్ హై స్కోర్ వచ్చింది అది మాకు గ్రేట్ ఫీలింగ్. ఆ 2019 నాకు వెరీ స్పెషల్ , లో డల్లాస్ లో అడాము. కోవిడ్ లేకపోతె ఎన్నో మ్యాచ్ లు ఆడి TCA కు చాలా కప్స్ వచ్చేవి..మాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ టీం కు థాంక్స్.మేము మొదటి సారి డల్లాస్ లో సెప్టెంబర్ 24 న డే & నైట్ మ్యాచ్ ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇలాంటి మంచి పని చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ వారికి  టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కు ధన్యవాదాలు తెలుపుతూ టీం అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here