Adharana… Song launched by byreddy siddharth reddy from ‘Jaitra’ Movie

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై మంచి రెస్పాన్స్ లభించింది. 
రాయలసీమ స్లాంగ్ , నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది.
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ (అధర నా గుండెలధర) ను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతూ…రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్  సినిమాలు చూశాం. మొదటిసారి ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో రాబోతున్న సినిమా జైత్ర. ఈ మూవీ సాంగ్స్ టీజర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.
నటీనటులు:
సన్నీ, నవీన్, రోహిణి రాచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్.
కెమెరా:  మోహ‌న్ చారి
పాట‌లు :  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌
సంగీతం : ఫ‌ణిక‌ళ్యాన్‌
ఎడిటర్: విప్లవ్ నైషదం
ద‌ర్శ‌క‌త్వం : తోట మ‌ల్లిఖార్జున్
నిర్మాత‌: అల్లం సుభాష్‌.
పిఆర్ఒ: నివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here