Powerstar Pawan Kalyan launched trailer of Kiran Abbavaram’s ‘Nenu Meeku Baga kavalsinavadini’

కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యంగ్‌ సెన్సేషన్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సిద్దార్థ్ద్‌ మీనన్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌, సోను ఠాగూర్‌, భరత్‌ రొంగలి నటీనటులుగా యస్‌.ఆర్‌ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత కోడి దివ్య దీప్తి మాట్లాడుతూ... పవన్‌ కల్యాణ్‌ గారు ట్రైలర్‌ లాంచ్‌ చేసి, మా అందరికీ బ్లెస్సింగ్స్‌ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఔట్‌పుట్‌ విషయంలో యూనిట్‌ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇన్నిరోజుల మా కష్టానికి ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుందనే అందరం హోప్‌తో ఉన్నాం. 16న విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ మీడియా మాకు ఎంతో సపోర్ట్‌ చేసింది. ఇకపై కూడా మరింత సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాం. బిజినెస్‌ కూడా చాలా బాగా జరిగింది. ప్రేక్షకుల ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు.

హీరో కిరణ్‌ అబ్బవరపు మాట్లాడుతూ… ఇక్కడకు వచ్చిన మీడియా సోదరులు అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమా బిగినింగ్‌ నుంచి మీడియా మాకు ఎంతో సపోర్ట్‌ చేస్తోంది. అన్ని చోట్ల నుంచి ట్రైలర్‌ చాలా బాగుంది అనే టాక్‌ వస్తోంది. పవన్‌ సార్‌ను ఇంతకు ముందు కలిసే అవకాశం వచ్చినప్పటికీ, ఏదైనా మంచి పెద్ద విషయం ఉంటే కలవాలని ఆగాము. ఇప్పుడు మా ట్రైలర్‌ను ఆయనతో విడుదల చేయించడానికి ఆయన్ను కలిశాము. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌. చిన్నప్పుడు ఆయన సినిమాలకు చొక్కాలు చించుకుని థియేటర్స్‌లో సందడి చేశా. ఇవాళ ఆయన నేను నటించిన సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడం అంటే ఇట్స్‌ ఎ వెరీ స్పెషల్‌ డే టు మి. ఇప్పటి వరకూ విడుదలైన పాటలు అన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాగే మొన్న టీజర్‌, ఈరోజు ట్రైలర్‌ కూడా ప్రేక్షకులకు నచ్చడం మా సక్సెస్‌లో తొలి మెట్టుగా భావిస్తున్నాం. మేం కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాం.. ఈసారి మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాం. ఇది కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అలాగే అండర్‌ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం విత్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో. తప్పకుండా అందరూ కుటుంబంతో సహా థియేటర్స్‌లో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చూడండి అన్నారు.

దర్శకుడు శ్రీధర్‌ గాదె మాట్లాడుతూ… పవన్‌ కల్యాణ్‌గారి సినిమాలకు థియేటర్స్‌లో అల్లరి చేసిన వ్యక్తులం మేము. అలాంటిది మేము చేసిన సినిమా ట్రైలర్‌ పవన్‌ గారి చేతుల మీద విడుదలవ్వడం రియల్లీ ఎగ్టైటింగ్‌గా, ఆనందంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌. ట్రైలర్‌లో చూపించిన దానికంటే మరింత అద్భుతంగా ఉంటుంది సినిమా 16వ తేదీన విడుదలౌతోంది అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని దీవించండి అన్నారు.

హీరోయిన్‌ సంజన ఆనంద్‌ మాట్లాడుతూ… మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్‌. నా తొలి సినిమా ట్రైలర్‌ పవన్‌ కల్యాణ్‌ గారు విడుదల చేయడం ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. ఆయన బ్లెస్సింగ్స్‌తో కెరీర్‌ స్టార్ట్‌ చేయడం నాకు చాలా పెద్ద విషయం. అలాగే మీ అందరికీ ట్రైలర్‌ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. పక్కా మాస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ రాజ్‌ కె. నల్లి మాట్లాడుతూ... ఒక మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల కోసం రెడీ చేశాం. మీ అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాం. అందరం చాలా కష్టపడ్డాం. ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది విడుదలకు. మీ అందరి సపోర్ట్‌ దొరుకుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు మేం చెపుతున్న దానికంటే 100 రెట్లు మంచి కంటెంట్‌ సినిమాలో ఉంది. 16వ తేదీన ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి వస్తున్నాం అన్నారు.

నటీనటులు : కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌, సోనూ ఠాకూర్‌, సిధ్ధార్ద్‌ మీనన్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌, సమీర్‌, సంగీత, నిహరిక, ప్రమోదిని, భరత్‌ రొంగలి తదితరులు

టెక్నికల్‌ టీమ్‌:
సమర్పణ: కోడి రామకృష్ణ
బ్యానర్‌: కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌
లిరిక్స్‌: భాస్కర్‌ భట్ల
ఎడిటర్‌: ప్రవీన్‌ పూడి
ఆర్ట్‌ డైరక్టర్‌: ఉపేంద్ర రెడ్డి
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భరత్‌ రొంగలి
పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్‌
సినిమాటోగ్రఫి: రాజ్‌ నల్లి
సంగీతం: మణిశర్మ
కో-ప్రొడ్యూసర్‌: నరేష్‌ రెడ్ది మూలే
ప్రొడ్యూసర్‌: కోడి దివ్య దీప్తి.
డైరక్టర్‌: శ్రీధర్‌ గాదె (ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం ఫేమ్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here