Allu arjun Paid Homage to Krishnamraju

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాంఘీక,పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాలలో విభిన్న పాత్రాలలో కధానాయకునిగా నటించి, సినిమా ప్రేక్షకులను రంజింప చేయటంలో అగ్రభాగాన నిలిచిన ప్రఖ్యాత నటులు ఉప్పలపాటి కృష్ణంరాజు మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే హీరో అల్లు అర్జున్ హుటాహుటిన బెంగుళూరు నుంచి బ‌య‌లుదేరి హైద‌రాబాద్ చేరుకొని, నేరుగా ఏయిర్ పోర్టు నుంచి కృష్ణం రాజుగారి నివా‌సానికి చేరుకొని ఆయ‌న పార్ధివ దేహ‌నికి నివాళులు అర్పించారు.

త‌ద‌నంత‌రం మీడియాతో మాట్లాడుతూ..శ్రీ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here