Family Message Oriented ‘Lots of Love’ Movie Review

Cinemarangam.com
సినిమా పేరు: ‘లాట్స్ ఆఫ్ లవ్’
విడుదల తేదీ: 30-09-2022
రివ్యూ రేటింగ్ : 3/5
సమర్పణ : శ్రీమతి అనిత, ప్రఖ్యాత్
బ్యానర్ : ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్, ప్రణవి పిక్చర్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. బి.కె. కిరణ్ కుమార్
కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం: డా. విశ్వానంద్ పటార్
నటీనటులు: డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన తదితరులు
సంగీతం: విశ్వ
ఎడిటర్స్: శ్రీనివాస్, నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: మురళీ, నగేష్, కుమార్
పి. ఆర్. ఓ : వీరబాబు

ప్రేమపై ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అనంతమైనది ప్రేమ. ప్రేమ అంటే కేవలం ఇద్దరి ప్రేమికుల మధ్య ఉన్నదే కాదు ప్రేమ అనేది అనేక రకాలుగా ఉంటుందని ప్రేక్షకులకు తెలియజేయడానికి సరికొత్త కోణంతో వచ్చిన చిత్రమే “లాట్స్ ఆఫ్ లవ్”. ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30 న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన “లాట్స్ ఆఫ్ లవ్” ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ:
నాలుగైదు కథల మిళితమే ఈ “లాట్స్ ఆఫ్ లవ్”.అవి ప్రొఫెషనల్ లవ్ (జాబ్ ని ప్రేమించడం) , ఫ్యామిలీ లవ్ (ఫ్యామిలీ ని ప్రేమించడం), డివైన్ లవ్ (అందరినీ ప్రేమించడం), రొమాంటిక్ లవ్ (ఇద్దరి ప్రేమికుల లవ్) , సెల్ఫ్ లవ్ (మనల్ని మనం ప్రేమించు కోవడం) ఇలా అయిదు రకాల డిఫ్రెంట్ లవ్ స్టోరీస్ ఇందులో ఉంటాయి.కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, మందులు దొరకక జనాలు అల్లాడిపోతుంటే చూసి తట్టుకోలేక వారి కోసం ఏమైనా చేయాలని తపించే డాక్టర్.. మనోహర్ (విశ్వానంద్ పటార్). కానీ తను అనుకున్న పనిని చేయడానికి ఆయన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. నామమాత్రపు ఫీజుతో చికిత్స చేస్తూ.. జనాలకు సేవ చేసే మనోహర్ అప్పులలో కూరుకుపోతాడు. మరి అతని తపన ఎలా తీరింది? అతనికి, స్కూల్ టీచర్ సరిత (ఆద్య)కు మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్లింది?.

ఒక అనాథ అయిన రాజు (రాజేష్) ఎంతో కష్టపడి.. పెద్ద పేరున్న కంపెనీలో ఉద్యోగం పొందుతాడు. అతని సక్సెస్‌కు కారణమైన రజిని (భావన)ను ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ రజినీ ఫ్యామిలీ రాజు అనాథ అని పెళ్లికి ఒప్పుకోరు. మరి వారి పెళ్లి ఎలా జరిగింది? అసలతను అనాథ ఎలా అయ్యాడు?

ప్రస్తుత ప్రపంచ తీరు గురించి, దేవుడి గురించి తత్వం బోధించే స్వామిజీ (కిరణ్)కి, ఎవరు కష్టంలో ఉన్నా.. నేనున్నానంటూ చేయూతనందించే ఎన్‌జిఓ సంయుక్త (మాధవి)కి ఉన్న సంబంధం ఏమిటి?

కాలేజ్‌కు బస్సులో వెళుతున్న రాకేష్ (నిహాంత్).. అదే బస్సులో నిలబడి ఉన్న మనోజ(దివ్య)కు సీటిచ్చి.. ఆ అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. కానీ వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరు. అందుకు కారణం ఏమిటి?

పైన చెప్పుకున్న నాలుగు కథలకు.. డబ్బుతో, రౌడీయిజంతో.. పిల్లికి కూడా బిచ్చం పెట్టని పొగరబోతు జమీందారు (తెనాలి పంతులు), అతని కొడుకులకు ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘లాట్స్ ఆఫ్ లవ్’ స్టోరీ.

నటీ నటుల పనితీరు
ఈ సినిమాలో నటించిన విశ్వానంద్ పటార్ కరోనా రోగులకు సేవ చేయాలనే తపన కలిగిన డాక్టర్‌గా, తల్లి కోరికను తీర్చాలనుకునే కొడుకుగా, ప్రేమికుడిగా.. ఇలా వైవిధ్యభరితంగా ఉండే మనోహర్ పాత్రలలో నటించి మెప్పించాడు. ఆయన ప్రియురాలిగా చేసిన సరిత.. కాలేజ్ స్టూడెంట్స్‌గా చేసిన నిహాంత్, దివ్య.. అనాథగా చేసిన రాజేష్, అతనికి సపోర్ట్‌గా చేసిన భావన వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. వీరితో పాటు యన్. జీ. ఓ గా చేసిన మాధవి, స్వామిజీ పాత్రలో కిరణ్ హుందాగా కనిపించారు. ఇక విలన్‌గా జమీందార్ పాత్రలో చేసిన తెనాలి పంతులు, ఆయన కొడుకులుగా చేసిన ప్రవీణ్, శ్రీను, రాఘవేంద్రలు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.. ఇంకా ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు డా. విశ్వానంద్ పటార్ ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు, నిర్మాతగా, కథ, మాటలు, మ్యూజిక్ వంటి బాధ్యతలన్నింటినీ ఒక్కడే నిర్వర్తించడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయమే. భారీ క్యాస్టింగ్‌ తో పాటు నాలుగైదు కథలను మిక్స్ చేసిన తీరు కూడా అందరినీ మెప్పిస్తుంది. అయితే ఈ కథలో జమీందారు ఫ్యామిలీకి పై కథలను లింక్ చేసిన విధానం, చివరికి ఆ జమీందార్ మారిపోయిన విధానంతో ఒక మంచి మెసేజ్‌ను కూడా ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వాస్తవానికి అది నేటి ప్రపంచంలో జరుగుతున్నదే. సాటి వారికి సాయం చేయని వాడు, దేవుడిని కూడా లెక్క చేయకుండా ధూషించేవాడు.. చివరికి అన్నీ పోగొట్టుకుంటాడనే మెసేజ్.. డబ్బున్న ధనవంతులకు ఇచ్చినట్లుగా ఉంది. స్వామిజీతో చెప్పించిన ‘పైకి ఎన్ని కారణాలు ఉన్నా.. చివరికి గమ్యస్థానం చేరుకోవడమే ముఖ్యం. మన జీవితంలో ఎప్పుడూ మన గమ్యాన్ని, గమ్యస్థానాన్ని గుర్తించుకుంటూనే ఉండాలి’, ‘వృత్తి ధర్మంతో పాటు స్వధర్మం కూడా పాటించాలి’, ‘యవ్వనం వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండి.. వారి అభిప్రాయాల్సి మన్నించాలి. అప్పుడే పిల్లలు గౌరవిస్తారు. వారిని లాలించాలి తప్ప.. శాసించకూడదు’ వంటి డైలాగులు ఆలోచనను రేకెత్తిస్తాయి. అలాగే డాక్టర్‌గా మనోహర్ ‘విద్య, వైద్యం సరైన దిశలో అందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకు టీచర్, డాక్టర్ మార్గదర్శనం చేయాలి’ అంటూ సమాజం బాగుండాలంటే ఏం చేయాలో చెప్పిన తీరు.. ‘సెల్ఫ్ లవ్, ఫ్యామిలీ లవ్, రొమాంటిక్ లవ్, ఫ్రెండ్షిప్ లవ్, డివైన్ లవ్, ప్రొఫెషనల్ లవ్’ అంటూ.. వాటి అర్థాన్ని వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా మెడికల్ మాఫియా బయట ఎలా ఉందో కూడా ఈ సినిమాలో చూపించారు. ఇంకా జమీందార్ యాదగిరి మారిన తీరు కూడా ఒక గుణపాఠంలా అనిపిస్తుంది. సినిమాకు తగినట్లుగా సంగీతం, ఎడిటింగ్, కెమెరా వర్క్ ఉంది. డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. కథకు తగ్గట్టు ఇందులో ఐదు డిఫ్రెంట్ పాటలు ఉన్నా .ప్రతి పాట అందరి మనసును టచ్ చేసే విధంగా ఉన్నాయి.శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్, డా. బి.కె. కిరణ్ కుమార్ నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలను భిన్నంగా వచ్చిన “లాట్స్ ఆఫ్ లవ్” చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉందని చెప్పవచ్చు.

Cinemarangam.com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here