Hero Allu Sirish Interview about ‘Urvasivo Rakshasivo’

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా ‘విజేత’ సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ ఎం సహనిర్మాత గా వ్యవహారించారు.నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర హీరో అల్లు శిరీష్ మీడియా పాత్రికేయ మిత్రులతో ముచ్చటించారు.

చాలా గ్యాప్ తరువాత సక్సెస్ అందుకున్నారు. ఈ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

ఈ సినిమా విడుదల అయ్యే రోజు వరకు చాలా టెన్షన్ పడ్డాను. సినిమా చూసిన అందరూ బాగుందని చెప్పడంతో నాకు చాలా రిలీఫ్ అనిపించింది.

శ్రీ కుమార్ క్యారెక్టర్ లో బాగా లీనమయ్యి నటించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

రియల్ లైఫ్ క్యారెక్టర్ ను తీసుకొని సినిమా చెయ్యాలని డైరెక్టర్ ఈ పాత్రను సెలెక్ట్ చెయ్యడం జరిగింది. ఈ క్యారెక్టర్ కొరకు నేను డైరెక్టర్ గారు చాలా రోజులు వర్క్ షాప్ లో బాడీ లాంగ్వేజ్, లుక్ ను డెవలప్ చేయడంతో నా పాత్రలో లీనమై నటించాను.

ఒక్క క్షణం తరువాత ఇంతకాలం గ్యాప్ రావడానికి కారణమేంటి?

జెర్సీ, పక్కా కమర్శియల్, గని ఈ మూడు సినిమాలు మా బ్యానర్ లో మా కన్నా ముందే స్టార్ట్ అయ్యాయి.అవి రిలీజ్ అయ్యాయి. అయితే మంచి డేట్ కోసం ఎదురు చూసి ఇప్పుడు మా సినిమా రిలీజ్ చేశాము.

మీరు ఈ రీమేక్ ను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి?

ధీరజ్ గారు వచ్చి మంచి కాంటెంపరీ స్టోరీ చూశాను చాలా టిఫికల్ గా ఉంది. ఇప్పటి యూత్ ఎలా ఉంటున్నారు అనే సబ్జెక్టు చాలా యూనిక్ గావుంది. చిన్న బడ్జెట్ లో కొత్త కుర్రాళ్ళతో చాలా బాగా తీశారని .ఈ కథ నీకైతే బాగా సూట్ అవుతుందని ఎగ్జైటింగ్ చెప్పడంతో నేను ఈ సినిమా చూశాను.దాంతో డైరెక్టర్ రాకేష్ శశి కి కూడా ఈ సినిమా నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాము.

తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా ?

పాయింట్ స్టోరీ అయితే డీవేట్ కాలేదు. కానీ తెలుగు ప్రేక్షకులు థ్రిల్లర్ అయితే చూస్తారు కానీ మిగిలిన సబ్జెక్టు లకు ఎంటర్టైన్మెంట్ డోస్ లేకుండా చెప్పలేము. అందుకే ఒరిజినల్ లో లేని కామెడీ సీన్స్ యాడ్ చేశాము, అలాగే స్క్రీన్ ప్లే, ఇలా కొన్ని మార్పులు చేశాము.

ఇలాంటి రొమాన్స్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు అలవాటు అవ్వలేదు అనుకుంటున్నారా?

అవ్వలేదు అనను. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఓటిటి సినిమాలు చూస్తున్నారు. అందులో చాలా బూతులు, స్కిన్ షో లు అంతకు మించి ఓటిటి లో చూసి ఉంటారు. అయితే మేము ఆలా చూయించ లేదు. మా సినిమా అంతా పొయేటిక్ గా ఉంటుంది.

సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉన్నా టీజర్, ట్రైలర్ లలో రొమాన్స్ ఉన్న కంటెంట్ ను ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణమేంటి?

ఆలా చూపిస్తే రెగ్యులర్ పార్టన్ లా ఉంటుంది. అయితే కొంత డిఫరెంట్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నాము. అయితే సినిమాలో బాయ్, గర్ల్ మధ్య జరిగే సీన్స్ కూడా ఎక్కువగా ఉండడం తో రివీల్ చేయలేదు.

ఇందులో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అనే నేర్వస్ నెస్ వుండిందా?

లేదు..రాకేష్ కూడా చాలా సెన్సీబుల్ పెర్సన్, షూట్ చేసిన తరువాత మానిటర్ లో చూసుకొని ఇబ్బంది ఉన్న సీన్స్ ఉంటే కరెక్షన్ చేసుకునేవాళ్ళము

ఈ సినిమాలో మీ యాక్టింగ్ లెవెల్స్ చాలా మెచూర్డ్ కనిపించాయి దీనికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు?

ఎక్సపీరియన్స్ సెల్ఫ్ అనాలసిస్, నేను నమ్మిన డైరెక్టర్స్ దగ్గరికి వెళ్లి ఏం చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అడిగి వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని చేయడం జరిగింది.

ప్రి రిలీజ్ ఫంక్షన్ లో బాలకృష్ణ గారు కూడా నీ పెళ్లి గురించి అడిగారు?ఇంట్లో మీ అమ్మ,నాన్న  కూడా పెళ్లి విషయంలో ప్రెజర్ పెట్టారా?

ఒక్కోసారి అలాంటి సీన్స్ సెట్ చేసినా సెట్ కావు కానీ ఆ రోజు బాలకృష్ణ సార్ తో ఆలా చాలాసేపు మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే పెళ్లి విషయంలో ఇంట్లో వారు అప్పుడప్పుడు ఆడగుతారు కానీ ఫోర్స్ చెయ్యరు.

సినిమా చూసిన తర్వాత మీ డాడీ ఎలా రెస్పాండ్ అయ్యారు?

మా డాడీ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో నువ్వు అచ్చం శ్రీ కుమార్ లా చాలా బాగా చేశావు. ఇంతకు ముందు నువ్వు చేసిన సినిమాలు ఆలా అనిపించలేదు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని హ్యాపీ ఫీల్ అయ్యారు.

అంతకుముందు అను ఇమ్మాన్యూల్ చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, తనకు ఈ సినిమాలో తీసుకోవడానికి కారణమేంటి?

అంతకుముందు నేను చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.ఎవరో ఒకరిని నమ్మి అవకాశం ఇవ్వాలి కదా..అయితే సిందూజ క్యారెక్టర్ కు తనను తప్ప ఎవరినీ ఉహించుకోలేము.తను అంత అద్భుతంగా నటించింది.

మీ ఇద్దరి మధ్య ఇంత కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడానికి రీజన్ ఏంటి?

ఓన్లీ వర్క్ షాప్

ఈ టైటిల్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. ఈ టైటిల్ పెట్టాలనే ఐడియా ఎవరిది?

ఇది పూర్తి గా డైరెక్టర్, మా డాడీ, దీరజ్ వీరి ముగ్గిరిదే వీరు ఈ టైటిల్ ఫైనల్ చేసి నాకు చెప్పడంతో నాకు కూడా ఈ టైటిల్ బాగుందని పించింది.

మీరు సెలెక్ట్ చేసుకునే టైమ్ లో కంటెంట్ కు ఇంపార్టెంట్ ఇస్తారా..? క్యారెక్టరైజేషన్ కు ఇంపార్టెంట్ ఇస్తారా?

తెలుగు సినిమాలు చూసి పెరిగిన వాన్ని కాబట్టి నేను ఏమైనా చెయ్యాలి అనుకుంటే అది కొత్తగా ఎగ్జైట్మెంట్ గా అనిపిస్తేనే చేస్తాను.అప్పుడు ప్రేక్షకులు కూడా చూస్తారు.అయితే అప్పుడప్పుడు అవి కొన్ని సార్లు ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు

మీకు ఎటువంటి సినిమాలు చేయాలనే ఇట్రెస్ట్ ఉంది ?

నాకు ఎక్కువగా రస్టిక్, రామ్ కామ్ కథలు వస్తున్నాయి. అయితే నాకు ఎక్కువగా సోషల్ డ్రామా సినిమాలు అంటే ఇష్టం. అలాంటి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తా..

నిన్న శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే ప్రత్యేకంగా మీ సినిమాకు అడియన్స్ రప్పించడానికి మీరెలాంటి ప్లాన్స్ చేశారు?

అడియన్స్ ఎక్కువగా మన సినిమా ప్రమోషన్ ద్వారా విడుదల చేసిన ట్రైలర్, టీజర్ నచ్చి థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు నచ్చితే వారి మౌత్ టాక్ ను బట్టే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు తప్ప సపరేట్ గా మనమేమి ప్లాన్ చేయలేము అని ముగించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here