Love & Family Entertainer ‘Seetharama puram lo oka prema janta’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “సీతారామపురంలో ఒక ప్రేమజంట’
రివ్యూ రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్,: 18/11/22
బ్యానర్ : శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌
నిర్మాత : బీసు చందర్‌ గౌడ్‌
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఎం. వినయ్‌ బాబు.
నటీనటులు : రణధీర్‌, నందినీ, సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ, నిట్టల్‌, మిర్చి మాధవి, సంధ్య సన్‌ షైన్‌, సుష్మా గోపాల్‌, భాషా, చంద్రకాంత్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌, లేట్‌ శివ శంకర్‌ మాస్టర్‌, సురేష్‌.. తదితరులు
డిఓపి: విజయ్‌ కుమార్‌ ఎ.
ఎడిటింగ్‌: నందమూరి హరి, ఎన్టీఆర్‌,
సంగీతం: ఎస్‌.ఎస్‌.నివాస్‌,
ఫైట్స్‌: రామ్‌ సుంకర,
కొరియోగ్రఫీ: అజయ్‌ శివ శంకర్‌, గణేష్‌, మహేష్‌,
పిఆర్‌ఓ: చందు రమేష్‌,

శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా ఎం. వినయ్‌ బాబు దర్శకత్వంలో బీసు చందర్‌ గౌడ్‌ నిర్మించిన భారీ బడ్జెట్‌ ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 18న అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
సీతారామ పురానికి సర్పంచ్ అయిన ప‌టేల్ (సుమ‌న్‌) నందు ( నందిని) అనే అంద‌మైన కూతురు ఉంటుంది. అదే ఊరిలో మాజీ సర్పంచ్ అయిన న‌ర్సింహ గౌడ్ (సూర్య‌) కొడుకు శివ (ర‌ణ‌ధీర్‌) ఇద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి తిరగడంతో వారిద్దరూ ప్రేమలో పడ తారు .అయితే నందు మేన‌బావ ( అమిత్‌)కిచ్చి పెళ్లి చేయాల‌ను కుంటాడు. ఇంతలో వీరిద్దరి ప్రేమ విష‌యం పెద్ద‌ల‌కు తెలుస్తుంది.ఇద్దరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. దాంతో వారిద్దరూ ఊరినుండి పారిపోతారు పటేల్, నర్సింహా గౌడ్ లు ఇద్దరూ ఒక్కటై వీరిని వెత‌కడం ప్రారంభిస్తారు. కానీ అప్ప‌టికే నందుతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమిత్ కి అది న‌చ్చ‌దు .నందును పెళ్లి చేసుకుని ప‌టేల్ ఆస్తి కొట్టేయాల‌ని తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో .అమిత్ రౌడీల‌ను తీసుకొని హీరో హీరోయిన్ల‌ను వెతికి ప‌ట్టుకుంటాడు. ఆ త‌ర్వాత ఏమైంది? హీరో హీరోయిన్ల‌ను అమిత్ ఏం చేసాడు? ఎంతో గాఢంగా ప్రేమించిన హీరో శివ కోసం హీరోయిన్ నందు ఏం చేసింది? అనేది తెలుసు కోవాలంటే సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
హీరో రణధీర్‌ కొత్త వాడైనా ఎంతో అనుభవం ఉన్న హీరోలా
ఒక ప‌ల్లెటూరి కుర్రాడిగా, ల‌వ‌ర్ బాయ్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందేలా చాలా బాగా నటించాడు. హీరోయిన్‌ నందిని కూడా ప‌ల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి పోయింది. హీరోయిన్ తండ్రిగా సర్పంచ్ గా పటేల్ పాత్రలో సుమన్, హీరో తండ్రి గా న‌ర్సింహ గౌడ్ పాత్రలో సూర్య‌, మరియు మిర్చి మాధ‌వి లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మరదలు నందిని పెళ్లి చేసుకొని మామ ఆస్తి కాజెయ్యాలను కునే పాత్రలో విలన్ గా నటించిన అమిత్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు నటించాడు. హీరో హీరోయిన్స్ ఫ్రెండ్స్ పాత్ర‌లు కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయి .ఇంకా ఈ సినిమాలో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు

ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా మంచి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథను సెలెక్ట్ చేసుకొని అద్బుతమైన ట్విస్ట్‌ & టర్న్స్ లతో చూస్తున్న ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్‌ కలిగేలా దర్శకుడు వినయ్‌బాబు అద్భుతంగా తెరకెక్కించాడు. ఎస్‌.ఎస్‌.నివాస్‌ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కుమార్‌ చక్కటి విజువల్స్ అందించారు.నందమూరి హరి ఎడిటింగ్ పని తీరు బాగుంది. ఆనందంగా ఉండాలంటే ఆస్తులు కాదు…ప్రేమ ఉండాలి“ పెద్ద‌లు ప‌ట్టింపుల‌కు పోకుండా పిల్ల‌ల మ‌న‌సులు అర్థం చేసుకోని వారి ప్రేమ‌ను అంగీరించాలి. బ‌తిక‌నంత కాలం క‌లిసిమెలిసి బ‌త‌కాలి అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సినిమా కచ్చితంగా ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తోంది. చాలా కాలం త‌ర్వాత స్వ‌చ్ఛ‌మైన , అచ్చ‌మైన ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ కలిగిన సినిమా చూశామనే ఫీల్ కలుగుతుంది .కాబట్టి ఈ ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…” సినిమాను నమ్మి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని ఏ మాత్రం డిజప్పాయింట్‌ చేయదు.

Cinemarangam com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here