‘Leharayi’ Pre Release Event held Grandly.. Movie Releasing on Dec 9

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంసని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు.ఈ చిత్రంలో మంచి ఫీల్ వున్న 7 పాటలు ఉండడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్,“బేబీ ఒసేయ్ బేబీ”సాంగ్,అప్సర అప్సర సాంగ్స్, చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ, ప్రేమ ఊబిలో మునిగి నిన్ను మరచి పోయా వంటి పాటలు మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకున్నాయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో కార్తికేయ “లెహరాయి” బిగ్ టికెట్ ను లాంచ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు కొండా విజయ్ కుమార్, హీరో సోహెల్, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సాయి రాజేష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

అనంతరం గెస్ట్ గా వచ్చిన హీరో కార్తికేయ మాట్లాడుతూ.. నాకు నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు చాలా రోజులుగా తెలుసు.. ఈ సినిమా ట్రైలర్ చూశాక సినిమా చాలా బ్యూటిఫుల్ గా ప్రామిసింగ్ అనిపించింది. ఇలాంటి మంచి మూవీ కి సపోర్ట్ చేసే ఛాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ మూవీలో రంజిత్, సౌమ్య చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశారు.వీరిద్దరి జోడీ చాలా క్యూట్ గా ఉంది. గగన్ గారు కూడా ఇందులో బాగా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ గారు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. డైరెక్టర్ రామకృష్ణ పరమహంస గారికి ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇంకా తను తెలుగులో పెద్ద, పెద్ద సినిమాలు చేయాలి. చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

చిత్ర నిర్మాత మద్ది రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చిన హీరోలు కార్తికేయ, సోహెల్, సత్యం రాజేష్ లకు ధన్యవాదములు. నేను గత 15 సంవత్సరాలుగా కాలేజ్ ప్రిన్సిపాల్ గా చేస్తున్నాను. మా కాలేజ్ లోనే కాకుండా ఎంతోమంది యూత్ ప్రస్తుతం లవ్ చేసుకున్న వారిలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆలా ఎందుకు ఆలా జరుగుతుంది అనేది తెలుపుతూ లవ్, సెంటిమెంట్ ను మిలితం చేస్తూ ఇంటర్నల్ గా సమాజానికి చిన్న మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది.ఇందులో తండ్రి కూతుర్ల యొక్క సెంటిమెంట్ హైలెట్ గా నిలుస్తుంది.ఇలాంటి మంచి సినిమాకు సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తను పాటల పరంగా తను చాలా కేర్ తీసుకున్నాడు.దర్శకుడు రామకృష్ణ ఈ కథ పై అహర్నిశలు కృషి చేస్తూ కథకు తగ్గట్టు నటీ నటులు నుండి చక్కటి నటనను రాబట్టు కున్నాడు.ఈ సినిమాకు అందరూ సహకరించడం తో సినిమా బాగా వచ్చింది.బెక్కం వేణుగోపాల్ గారి సపోర్ట్ తో తీసిన ఈ సినిమాలో ప్రేక్షకుల కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారికి నచ్చేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించిన ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. డిసెంబర్ 9న థియేటర్లో రిలీజ్ అవుతున్న “లెహరాయి” సినిమాను చూసి ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అన్నారు.

గెస్ట్ గా వచ్చిన దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ..ఈ సినిమా చూశాను చాలా బాగుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ మ్యూజిక్, స్క్రీన్ ప్లే,సెంటిమెంట్ ఇలా అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంది. దర్శకుడు రామకృష్ణ చాలా మంచి సినిమా తీశాడు ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో బయటకు వస్తాడు.ఆడియో రిలీజ్ అయింది ఘంటాడి గారు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు అని చెప్పవచ్చు. ఇందులో తన పాటలు అంత అద్భుతంగా ఉన్నాయి. ఇచ్చాడు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా టీమ్ అందరికీ బిగ్ హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు

గెస్ట్ గా వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నర్ దర్శకులు సాయి రాజేష్ మాట్లాడుతూ.. రంజిత్ నాకు చాలా మంచి ఫ్రెండ్ తను ఇందులో చాలా బాగా యాక్టింగ్ చేశాడు చిన్న సినిమాలకు సపోర్ట్ గా ఉండే నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.ఈ సినిమాలో పాటలు బిగ్ హిట్ అయ్యాయి. ఘంటాడి కృష్ణ గారకి ఇది రైట్ టైం కం బ్యాక్ సినిమా. ఈ సినిమా నుండి మళ్లీ ఘంటాడి కృష్ణ గారి ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను.

గెస్ట్ గా వచ్చిన సోహెల్ మాట్లాడుతూ ..ఈ మధ్య మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. అయితే ప్రేక్షకులు పెద్ద సినిమాలకు మొదటి రోజు ఎలా వెళ్తున్నారో అలాగే మంచి కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాలకు మొదటి రోజువెళ్లి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలర్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లవ్ యు అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న దర్శకులు రామకృష్ణ, నిర్మాత శ్రీనివాస్ గార్లకు ఆల్ ద బెస్ట్. అలాగే ఘంటాడి కృష్ణ గారి పాటలు అద్భుతంగా ఉన్నాయి మంచి కథతో వస్తున్న ఈ “లెహరాయు” సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకులు రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ.. మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ సినిమా విజువల్ గా ఇంత బాగా రావడానికి కారణమైన ముఖ్య వ్యక్తి నిర్మాత మా బాబాయ్ కుమార్ గారు. తను ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆ తర్వాత ఏం చేయాలో అర్థంకాని టైంలో మద్ది రెడ్డి శ్రీనివాస్ గారు మమల్ని సపోర్ట్ చేయడానికి దేవుడిలా ముందుకు వచ్చి చివరి వరకు తనే దగ్గరుండి మమ్మల్ని బాగా చూసుకున్నాడు. అలాగే నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు ఈ సినిమాను ప్రజెంట్ చేయడం వలెనే మా సినిమాకు ఈరోజు ఇంత పేరు వచ్చింది. ఘంటాడి కృష్ణ గారు అద్భుతమైన ఆరు సాంగ్స్ ఇచ్చాడు. నటీ నటులతో పాటు రావు రమేష్ గారు, నరేష్ గారు, ఆలీ గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు.ఇందులో గగన్ విహారి స్పెషల్ క్యారెక్టర్ చేశాడు.ఈ నెల 9న వస్తున్న “లెహరాయి” సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

చిత్ర హీరో రంజిత్ మాట్లాడుతూ.. మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నేను ఈ సినిమా కథ విన్న రోజు నుంచి ఈ రోజు వరకూ ఒకటే పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఇది నాకు దొరికిన అద్భుతమైన కథ, కథతో పాటు నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చూడని క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉంటుంది. ఒక పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ గార్లు తీస్తే ఎలా ఉంటుందో కచ్చితంగా ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా దేవుడు నాకు ఇంత మంచి కథను ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పటివరకు నా లైఫ్ లో ఈ సినిమాకు పై ఉన్నంత కాన్ఫిడెన్స్ ఎప్పుడూ లేదు. లాటరీ లో 100 కోట్లు గెలుచుకున్నంత ఆనందం నాకు ఈరోజు కలిగింది.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 9న వస్తున్న “లెహరాయి” సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు

నటీనటులు:
రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ,సత్యం రజెష్, జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
సమర్పకులు : బెక్కం వేణుగోపాల్
బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్
నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్
రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస
మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ)
డి.ఓ.పి : ఎం ఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
లిరిక్ రైటర్స్ : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ , శ్రీమణి
ఫైట్ మాస్టర్ : శంకర్
కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి
రైటర్ : పరుచూరి నరేష్
పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here