Cinemarangam.Com
సినిమా : “ముఖ చిత్రం”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 9,12,2022
సమర్పణ : ఎస్ కేఎన్,
నిర్మాతలు – ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల,
కథ స్క్రీన్ ప్లే మాటలు – సందీప్ రాజ్,
దర్శకత్వం – గంగాధర్
నటీనటులు – వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ తదితరులు
సినిమాటోగ్రాఫర్ – శ్రీనివాస్ బెజుగం
సంగీతం – కాల భైరవ,
ఎడిటింగ్ – పవన్ కళ్యాణ్,
మన రియల్ లైఫ్ లో చాలాసార్లు విన్నదే, చూసిందే కానీ ఇప్పటిదాకా తెరపై ఇలాంటి పాయింట్ ను ఎవరూ తెరకెక్కించలేదు.ప్లాస్టిక్ సర్జరీ అనే కాన్సెప్ట్ తో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన విభిన్నమైన ఫ్యామిలీ థ్రిల్లర్ “ముఖచిత్రం”.ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ నటీ నటులుగా గంగాధర్ దర్శకత్వంలో ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. . ఈనెల 9న గ్రాండ్ గా విడుదలైన “ముఖచిత్రం” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
రాజ్‌కుమార్ (వికాస్ వశిష్ట) సిటీ లో పేరు మోసిన ప్లాస్టిక్ సర్జన్.తను ఎంతో ఇన్నోసెంట్ గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మ్యాచెస్ చూస్తుంటాడు. అయితే విజయవాడకు చెందిన ఓ చిన్న టౌన్ లో చిన్న పిల్లలకు 6 వ తరగతి వరకు ట్యూషన్స్ చెప్పుకునే అమాయకురాలు మహతి (ప్రియా వడ్లమాని) ఫోటో రాజ్ కుమార్ వాట్సాప్ కు వస్తుంది.ఫొటోలో చూసిన తొలి చూపులనే మహతిని ఇష్టపడతాడు.దాంతో రెండు రోజులు ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసి సిటీ లైఫ్ అంటే ఆమెకు తెలియదని కన్ఫర్మ్ చేసుకొని వారి ఇంటికి పెళ్లి చూపులకు వెళతాడు.ఆ తరువాత పెద్దలను ఒప్పించి మహతిని పెళ్లి చేసుకుంటాడు. మరో వైపు రాజ్‌కుమార్ చిన్ననాటి స్నేహితురాలు మాయ ఫెర్నాండేజ్ (అయేషాఖాన్) స్కూల్ డేస్ నుండి ఇష్ట పడుతుంటుంది.రాజ్ నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ మాయ ప్రేమను కాదని మహతిని పెళ్లి చేసుకొని తన తో కొత్త జీవితం మొదలుపెడతాడు రాజ్. రాజ్ తనకు దక్కకుండా పోయాడే అనే డిప్రెషన్ తో బైక్ నడుపుతున్న మాయకు అనుకోకుండా యాక్సిడెంట్ లో తలకు పెద్ద దెబ్బ తగిలి తీవ్రంగా గాయపడుతుంది.అనూహ్యంగా ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న మహతి అదే రోజు ఓ ప్రమాదంలో చనిపోతుంది. దాంతో తన ప్రియురాలి మాయ ముఖానికి చనిపోయిన తన భార్య మహతి ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అమర్చుతాడు రాజ్. మహతి చనిపోలేదని ఆమె బతికేవుందని తల్లిదండ్రులకే కాకుండా ప్రపంచాన్ని నమ్మిస్తాడు.అయితే రాజ్ ఆ పని ఎందుకు చేశాడు? మహతి చావుకు కారణం ఎవరు? ప్లాస్టిక్ సర్జరీ కారణంగా మహతి ఫేస్‌ను మాయకు అమర్చడం ఆ తర్వాత మహతి జీవితంలో జరిగిన విషాదాన్ని, ఆమె మరణం వెనకున్న నిజాలను మాయ ఎలా తెలుసుకుంది? రాజ్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి ఏ విధంగా చాటిచెప్పింది? మాయ పోరాటంలో ఆమెకు అండగా నిలబడిన విశ్వామిత్ర (విశ్వక్సేన్) ఎవరనే విషయాలను తెలుసుకోవాలంటే “ముఖచిత్రం” సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పని తీరు
ఈ చిత్రంలో ప్రియ వడ్ల మాని రెండు విభిన్న పాత్రల్లో చాలా చక్కగా నటించింది. విజయవాడకు చెందిన ఓ చిన్న టౌన్ లో ఉండే చాలా అమాయకమైన అమ్మాయిగా, పెళ్ళైన తరువాత సిటీ కి అలవాటు పడిన ఆధునిక యువతిగా రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ చూపిస్తూ చాలా చక్కటి నటనను కనబరిచింది.ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన ప్రియా వడ్లమానికి ఈ సినిమాలో ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ దొరికింది. సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ ఆధునిక యువతి గా లైఫ్ లో ఎలా ఉండాలనే విషయంలో కంప్లీట్ గా అవేర్ నెస్ ఉన్న అమ్మాయిగా, దేనికీ కాంప్రమైజ్ కాకుండా, తను అనుకున్న పని చేసుకుంటూ పోయే అన్ కాంప్రమైజ్డ్ గర్ల్ పాత్రలో తన అందం అభినయంతో చాలా బాగా నటించింది . రాజ్‌కుమార్‌గా వికాస్ వశిష్ట పాజిటివ్ యాంగిల్లో కనిపించే నెగెటివ్ రోల్లో ఒదిగిపోయాడు. అతడి డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. హీరో ఫ్రెండ్‌గా చైతన్యరావ్‌కు మంచి క్యారెక్టర్ దక్కింది.ఈ సినిమాలో లాస్ట్ ఇరవై నిమిషాలు అదిరిపోతుంది. విశ్వక్ సేన్ లాయర్ గా చేసిన పదినిమిషాల క్లైమాక్స్ కోర్ట్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది.విశ్వక్సేన్ కోర్ట్ లో చక్కని ఎమోషన్ ను పండిస్తూ చాలా బాగా నటించాడు. ఇంకా ఇందులో నటించిన వారంతా తమ కిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఈ “ముఖచిత్రం” సినిమా ప్రతి మహిళ కోసం తీసిన సినిమా ఇది. ఈ కథలో చెప్పిన ఘటనలు ఏ మహిళ జీవితంలో నైనా జరగి ఉండవచ్చు. సెక్సువల్ రిలేషన్స్ విషయంలో సమాజంలో ఉన్న అపోహలు, భార్యలను బానిసలుగా చూసే భర్తల కారణంగా సమాజంలో ఎంతో మంది మహిళలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనే విషయాలను చర్చిస్తూ సెన్సిటివ్ ఈష్యూను ఎమోషన్స్, థ్రిల్ కలగలుపుతూ ట్విస్ట్, టర్న్ లతో కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ అందించిన కథను దర్శకుడు గంగాధర్ అద్భుతంగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు కాలభైరవ. ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ బెజుగం కెమెరా పనితనం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది.ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన ఒక కొత్త తరహా క్రైమ్ థిల్లర్. కథను నిర్మాతలు ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల లు నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ అనే కాన్సెప్ట్ తో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం “ముఖ చిత్రం”. ”విభిన్నమైన ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి “ముఖ చిత్రం ” సినిమా కచ్చితంగా నచ్చుతుంది చెప్పొచ్చు.
Cinemarangam.Com Review Rating.. 3/5









