‘Merina’ Movie Grand Releasing on December 17th

తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు వాళ్లకు దగ్గరైన కథానాయకుడిగా శివకార్తికేయన్ కు గుర్తింపు ఉంది. ఆయన నటించిన “మెరీనా” చిత్రం తెలుగులో విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇందులో శివకార్తికేయన్ సరసన ఒవియా నాయికగా నటించింది. పలు హిట్ సినిమాలను రూపొందించిన పాండిరాజ్ దర్శకత్వం వహించగా, ఎస్.వి .ఆర్ మీడియా (ప్రై ) లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్రీమతి సి.జె.శోభ ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో

నిర్మాత సి.జె.శోభ మాట్లాడుతూ, ఈ నెల 17న సినిమాను విడుదల చేయబోతున్నాం. చక్కటి కామెడీ డ్రామాతో ఆద్యంతం అలరింపజేసే ఈ సినిమాలో హీరోహీరోయిన్లు తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. తమిళంలో రెండు స్టేట్ ఫిలిం అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులను పొందింది. కనువిందుచేసే ఛాయాగ్రహణం ఒక హైలైట్ అయితే సంగీతం మరో హైలైట్. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేట్ కు ఎక్కువ డబ్బు పెట్టి కొన్నాం. థియేట్రికల్ రిలీజ్ విషయంపై మంచి పట్టున్న నట్టి కుమార్ వారి డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాను విడుదల చేస్తున్నారు” అని అన్నారు.

తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను పంపిణీ చేస్తున్న నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ, “అనేక అద్భుత చిత్రాల సృష్టికర్త పాండిరాజ్ దీనిని మలచిన విధానం జనాన్ని థియేటర్లకు రప్పిస్తుంది. తప్పకుండా మా అంచనాలను నిలబెడుతుంది. ట్రైలర్ ను విడుదల చేస్తున్నాం. పాటలను కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆవిష్కరించబోతున్నాం” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here