నందమూరి కల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఎంత మంచివాడవురా`. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.జాతీయ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీత సారథ్యం వహిస్తోన్నఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, శ్రోతల నుండి విశేషమైన స్పందనను అందుకోవడం జరిగింది. ఇకపోతే ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ని కాసేపటి క్రితం సినిమా యూనిట్ విడుదల చేసింది.ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వారు తమ ప్రకటనలో తెలిపారు
Young Tiger @tarak9999 will grace the pre-release event of #EnthaManchivaadavuraa
Date: January 8th, JRC Convention Hyd, 7pm onwards.