Cinemarangam. Com
సినిమా : “లక్కీ లక్ష్మణ్”
విడుదల : 30.12.22
రివ్యూ రేటింగ్ : 3/5
బ్యానర్: దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్,
నిర్మాత: హరిత గోగినేని,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.అభి,
నటీనటులు : సయ్యద్ సోహైల్, మోక్ష, దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని తదితరులు
మ్యూజిక్: అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ: ఐ.అండ్రూ,
ఎడిటర్: ప్రవీణ్ పూడి,
పాటలు: భాస్కరభట్ల,
కొరియోగ్రఫీ: విశాల్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్ కీత,
పి.ఆర్.ఒ: నాయుడు – ఫణి (బియాండ్ మీడియా).

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించి చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
లక్కీ లక్ష్మణ్ (సోహెల్) మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన కుర్రాడు. తనకు డబ్బు అంటే ఎంతో ఇష్టం. అయితే వీరికి ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో చిన్నప్పటి లక్కీ ఏది అడిగినా ఇవ్వకుండా డబ్బులు లేవన్న కారణం చెప్పి పెంచుతుండడంతో తండ్రి(దేవీ ప్రసాద్) పై కోపంగా ఉంటాడు. అలాగే తండ్రికి పై గౌరవం ఉండదు. ఇంజనీరింగ్ కాలేజీలో జాయినయ్యాక అక్కడ బాగా డబ్బున్న అమ్మాయి శ్రియ (మోక్ష) పరిచయమవుతుంది.ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో లక్షణ్ పరిస్థితి అర్థం చేసుకొని తనకు బట్టలు, బైక్, ఫోన్.. ఇలా అన్నీ కొనిస్తూ బాగా చూసుకుంటుంది. ఇవన్నీ ఇంట్లో వారికి చెప్పలేక ఇంటినుంచి బైటికొచ్చేసి తల్లిదండ్రులకు దూరంగా బతుకుతుంటాడు . అదే కాలేజీ లో ఉండే ఓ జూనియర్ అమ్మాయి లక్కీ కి దగ్గరవ్వాలని చూస్తుంటుంది. ఈ విషయమై లక్కీ, శ్రీయ ఇద్దరూ గొడవపడి విడిపోతారు. ఆ తర్వాత ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న లక్ష్మణ్ కు ఓ మ్యారేజీ బ్యూరో పెట్టాలని స్టార్ట్ చేస్తాడు. ఆ తరువాత తను బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా ఎదిగాడు? తనను ఎంతో ఇష్టంగా ప్రేమించిన శ్రియ ప్రేమ విలువ తెలుసుకొని దగ్గరయ్యాడా లేదా? చివరకు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, బంధాలు కంటే డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చే లక్ష్మణ్ అమ్మానాన్నల విలువ తెలుసుకున్నాడా? లేదా? అనేది తెలుసుకోవాలి అంటే “లక్కీ లక్ష్మణ్” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
లక్కీ లక్షణ్ గా సోహెల్ తన పాత్రమేరకు బానే చేశాడు. కామెడీ, ఎమోషన్, లవ్.. ఇలా అన్ని రకాలుగా సోహైల్ తనదైన నటనతో అద్భతుంగా నటించారు. హీరోయిన్ మోక్ష గ్లామర్ లుక్స్ తోపాటు నటనపరంగా ఆమె పాత్రకు అందరూ ప్రేమలో పడేలా బాగా నటించింది.తండ్రి పాత్రలో దేవీ ప్రసాద్ మరియు కాదంబరి కిరణ్ కుమార్ లు చాలా చక్కగా నటించారు. రచ్చ రవి, యాదమ్మ రాజు కామెడీ బాగుంది .. సమీర్, రాజా రవీంద్ర, షానిలతో పాటు ఇందులో నటించిన వారంతా వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
నేటి సమాజంలో తల్లిదండ్రుల ప్రేమానురాగాలు, బంధాలు కంటే డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే విషయాన్ని ఎంటర్టైన్మెంట్ రూపంలో లవ్, ఎమోషన్స్ జోడించి ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశాడు దర్శకుడు ఏ. ఆర్ అభి.కెమెరామెన్‌గా ఆండ్రూ పనితనం బాగుంది.. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. ప్రవీణ్ ఎడిటింగ్, భాస్కరభట్ల పాటలు అన్నీ అద్భుతంగా కుదిరాయి. సాధారణంగా మన లైఫ్‌లో కష్టంతో పాటు అదృష్టం కూడా కావాలి. మన చుట్టూ ఉన్న వారిలో పది మంది మాత్రమే మన మంచిని కోరుకుంటారు. అలాంటి రిలేషన్స్, మన జీవితంలో జరిగే కొన్ని విషయాలను కూడా ఇందులో చాలా చక్కగా చూయించారు. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత హరిత గోగినేని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీతో చూసేటప్పుడు ఈ సీన్ వచ్చిందేందని తల తిప్పుకునేలా ఉండదు.ఎక్కడా వల్గారిటీ లేకుండా కంప్లీట్ క్లీన్ కామెడీ మూవీ లక్కీ లక్ష్మణ్. ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఓ స్మైల్‌తో కచ్చితంగా బయటకు వస్తారు.
Cinemarangam. Com Review Rating.. 3/5









