Nandamuri Kalyan Ram, Mythri Movie Makers ‘Yeka Yeka..Lyrical Song Release from Action Thriller ‘Amigos’ Movie

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన క్రేజ్‌, ఇమేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. శాండిల్ వుడ్ బ్యూటీ  ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె తొలి తెలుగు సినిమా ఇది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్న  ఈ హై స్టైలిష్ యాక్షన్ మూవీ నుంచి శుక్ర‌వారం చిత్ర యూనిట్ ‘యెక యెక..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. 
‘యెక యెక..’ పాటను గమనిస్తే ఇది ఒకేలా  ఒకరికొకరు సంబంధం లేని ముగ్గురు వ్య‌క్తులు మంజునాథ్, సిద్ధార్థ్, మైకేల్ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ మూడు పాత్ర‌లను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పోషించారు. అలాంటి ముగ్గురు అమిగోస్ (అమిగోస్ అంటే స్నేహితుడిని పిలిచే స్పానిష్ ప‌దం) ఎంత సంతోషంగా ఉన్నారు, బీచ్‌లో ఎలా ఆడి పాడార‌నే విష‌యాల‌ను పాట‌లో ఎలివేట్ చేశారు.
జిబ్రాన్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసిన అమిగోస్ సినిమాలోని ‘యెక యెక..’ అనే పాటను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాయగా అంతే గొప్పగా అనురాగ్ కులకర్ణి పాడారు. ప్రపంచవ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here