ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ లు నిర్మించిన చిత్రం “ఆమిగోస్”. ఫిబ్రవరి 10న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా
హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. దర్శకుడు రాజేంద్ర ఈసినిమా కొత్తగా చాలా డిఫరెంట్ గా ఉండాలని ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.ఈ సినిమా కచ్చితంగా బిగ్ హిట్ అవుతుంది. ఈ సినిమా వారి తల్లి తండ్రులకు అంకితం చేస్తున్నాము.మైత్రి నా హోమ్ బ్యానర్ లాంటిది. రొటీన్ కు భిన్నంగా ఉండాలని ఈ సినిమా చేశాను.ఫిబ్రవరి 10 న రిలీజ్ అవుతున్న మా సినిమా చూసిన ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమా చూసే ప్రేక్షకులు మాత్రం ఇందులో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు.
చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ లు మాట్లాడుతూ.. యన్టీఆర్ గారు బింబిసార సినిమా చూసిన తరువాత ఈ సినిమా హిట్ అవుతుందని అన్నారు. అయన చెప్పినట్లే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా చూసి బాగుందన్నారు. ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.