“Dappukotti Cheppukona” Lyrical Song Released from Siva Kandukuri’s “Bhootaddham Bhaskar Narayana’

విభిన్నమైన మంచి చిత్రాల్లో న‌టిస్తూ నటుడుగా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “భూతద్ధం భాస్కర్‌ నారాయణ”. ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు.

ఇదివరకే రిలీజైన మోషన్ పోస్టర్ తో అంచనాలను పెంచింది ఈ చిత్రం. అలానే ఈ చిత్ర టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో శివ కందుకూరి డిటెక్టీవ్ గా కనిపించనున్నాడు. మంచి కథతో పాటు అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే బాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ ను ప్రెజెంట్ చేసారు మేకర్స్.

తాజాగా ఈ చిత్రం నుండి “డప్పుకొట్టి చెప్పుకొనా” అనే సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.భాస్కర భట్ల రచించిన ఈ పాటను, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అందరికి అర్ధమయ్యే పదాలతో భాస్కర్ భట్ల ఈ పాటను అద్భుతంగా రచించారు.
“అందాల ఓ వెన్నెల నువ్వు నా కళ్ళ ముందుండగా
ఏనాడూ ఏ చీకటి ఇక రాదంట నా వైపుగా”
డప్పుకొట్టి చెప్పుకొనా
ఊరంతా నేను డప్పుకొట్టి చెప్పుకొనా
గుప్పెడంత గుండెలోన ఆనందమంతా డప్పుకొట్టి చెప్పుకొనా”
లాంటి లిరిక్స్ ఖచ్చితంగా యూత్ ను ఆకట్టుకుంటాయి.

ఇదివరకే ఈ చిత్రం గురించి మేకర్స్ ప్రస్తావిస్తూ ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి ఎడ్జ్‌ ఆఫ్‌ద సీట్‌గా వుంటుంది. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్ని ప్రేక్షకులు ముందుగా ఊహించడం చాలా కష్టం’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాంగ్ క్రెడిట్స్:
మ్యూజిక్: విజయ్‌ బుల్గానిన్‌
సాహిత్యం: భాస్కర భట్ల రవికుమార్
గానం: అనురాగ్ కులకర్ణి

నటీనటులు:
శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌, దేవీప్రసాద్‌, వర్షిణి, శివకుమార్‌, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్‌ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరులు

రచన-దర్శకత్వం: పురుషోత్తం రాజ్‌
నిర్మాతలు: స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: గౌతమ్‌ జి
ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌
ప్రొడక్షన్‌ డిజైనర్: రోషన్‌ కుమార్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌: అశ్వంత్‌, ప్రతిభ
స్టంట్స్‌: వింగ్ చున్ అంజి
పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్‌
డిజిటల్‌: హౌస్‌ఫుల్‌ డిజిటల్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here