Palle Films, Lion Team Credits ‘Screen Play’ Movie Title logo launch Grandly

పల్లె ఫిల్మ్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బ్యానర్లపై హరికృష్ణ జినుకల సమర్పణలో అంకుర్ కసగోని దర్శకత్వంలో పల్లె అనిల్ నిర్మిస్తున్న చిత్రం ‘‘స్క్రీన్ ప్లే’’. ఈ సినిమా టైటిల్ లోగోను ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ సినిమాను తీస్తున్నట్లు నిర్మాత తెలిపారు. భారతీయ సినిమా రంగానికి ఆస్కార్ అందించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం పొందింది. ఈ తరుణంలో ఒక వినూత్న యూనివర్సల్ కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు దర్శకులు తెలిపారు. ఈ నెల చివరి వారంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించి ఏప్రిల్ చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఇండియా బుల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఉమామహేష్ కప్పల, కవితాలయ స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ & రీరికార్డింగ్ DSR, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ జాకీ, అసిస్టెంట్ DOP శ్రావణ్ కుమార్, ఎడిటర్ సంపత్ కుమార్ ఐలపురం, PRO రమేష్ చందు, ఆర్ట్ డైరెక్టర్ నరేష్ చిరుమామిళ్ల, కొరియోగ్రఫీ నందు జెన్న, థ్రిల్స్ ఆశోక్ రాజ్ సాంకేతిక సహకారం అందిస్తున్నారు. టైటిల్ లోగో లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here