Heroine Samyukta Menon interview about Hero Sai Darmatej’s ‘Virupaksha’ Movie

భీమ్లా నాయక్‌ సినిమాలో రానాకు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంయుక్త మీనన్ ఆ తర్వాత బింబిసార మరియు సార్ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగులో ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో లక్కీ బ్యూటీ అంటూ ఈమెకు పేరు దక్కింది. ఈ సమయంలో ఈమె మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ తో కలిసి ఇప్పుడు ‘విరూపాక్ష’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ

‘‘ఇదొక మిస్టికల్ థ్రిల్లర్. ఆంధ్రప్రదేశ్‌లోని రుద్రవరం అనే గ్రామంలో జరిగే కథ. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. నా పాత్ర పేరు నందిని. పల్లెటూరిలో పెరిగిన నందినికి పొగరు, పట్టుదల ఎక్కువ. ఆమె మాట్లాడే విధానం, నడిచే తీరు.. అన్నీ క్యారెక్టరైజేషన్‌ను బట్టి బయటపడతాయి. ఈ సినిమాలో నేను పోషించిన నందిని పాత్రకు.. నా రియల్ లైఫ్‌ క్యారెక్టర్ కు అస్సలు సంబంధం లేదు. నేను నందినికి పూర్తి విభిన్నంగా ఉంటాను. అయితే నందిలో ఉండే ఎనర్జీ మాత్రం నాకు ఉంటుంది. అంతకు మించి నందిని పాత్ర తో నా రియల్‌ లైఫ్ కి పోలిక లేదు. అయితే కమర్షియల్‌ అంశాలతో కూడిన హారర్‌ థ్రిల్లర్‌ కాబట్టి.. హీరోయిన్ క్యారెక్టర్ ప్లెజెంట్‌గా ఉండాలి. దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు దర్శకుడు. సినిమా కోసం వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించడం ప్లస్ అయ్యింది.

సూర్య పాత్రలో సాయి తేజ్ కనిపిస్తారు. తను సెట్‌లో చాలా సరదాగా ఉంటాడు..తనతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. చాలా ఎనర్జిటిక్ గా ఉండేవాడు. సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆయనతో కలిసి పోటీ పడేందుకు తీవ్రంగా ప్రయత్నించేదాన్ని. నాకు ఒక మంచి స్నేహితుడిగా సాయి ఉంటాడు. ప్రతి సన్నివేశానికి కూడా చాలా కష్టపడుతాడు. జీవితంలో ఒక చెడు సంఘటన తర్వాత ఇంత త్వరగా కోలుకోవడం సాయికే సాధ్యం అయింది. తేజూ సెట్‌ లో అందరితో చాలా స్నేహంగా మాట్లాడుతూ ఉంటాడు.

అలాగే కార్తీక్ కూడా ఒక విజన్ ఉన్న డైరెక్టర్. ప్రతి విషయంలో డీటెయిలింగ్‌గా చూసుకుంటాడు. సుకుమార్ గారి స్ర్కీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది. భారీ ప్రాజెక్టులు నిర్మించిన ఎస్వీసీసీ బ్యానర్‌‌లో నటించడం ఆనందంగా ఉంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం.

నాకు శోభన గారు అంటే చాలా ఇష్టం. ఆమె నటించిన కొన్ని సినిమాలు చాలా ఇష్టం. ఆమె నటించిన ఆ పాత్రలను చేయాలని కోరిక.. కామెడీ పాత్రలు చేయాలని కూడా ఉంది.ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో ‘డెవిల్’ చిత్రంలో నటిస్తున్నా. ఇటీవల షూటింగ్ పూర్తయింది.ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here