Nara – Nandamuri fans special pooja in Tirumala to celebrate Nara Chandrababu Naidu’s birthday

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుగారి పుట్టినరోజు సందర్బంగా నందమూరి – నారా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి – నారా కుటుంబంలో ఎవరి పుట్టినరోజు అయినా ఇరు కుటుంబాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం అనవాయితీగా వస్తోంది.

అందులో భాగంగానే ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన ఎన్టీఆర్‌ రాజు (టీటీడీ ఎక్స్‌ బోర్డ్‌ మెంబర్‌) కుటుంబ సభ్యులు, తెదేపా రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, నందమూరి – నారా అభిమానులు, టీడీపీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఉన్న అఖిలాండం దగ్గర 774 కొబ్బరికాయలు కొట్టి, 7 కేజీల 40 గ్రాముల కర్పూరాన్ని వెలిగించి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సుపరిపాలన అందించే అవకాశాన్ని ప్రసాదించాలని శ్రీనివాసుడిని వేడుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా చంద్రబాబునాయుడు పై ఉండాలని ఎన్టీఆర్‌ రాజు, శ్రీధర్‌ వర్మ, భాస్కర్‌ వర్మ తదితరులు స్వామిని ప్రార్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here