Hero Sree Vishnu is back to his strongest forte of comedy with his latest flick Samajavaragamana directed by Ram Abbaraju of Vivaha Bhojanambu fame. Razesh Danda is producing the movie under the banner of Hasya Movies, in association with AK Entertainments. Anil Sunkara proudly presents it. Reba Monica John is the heroine opposite Sree Vishnu in the movie. The makers unveiled a fun-filled teaser of the movie today.
Sree Vishnu plays a frustrated youngster who gets irritated by simple things. He loves a girl during his college days. But she ties Rakhi to him. Since then, whenever a girl proposes to him, he makes them tie rakhi to him. He indeed develops a negative opinion about love.
Sree Vishnu’s comic timing is superb. His conversations and frustrations bring freshness. The bathroom sequence and the last sequence of his frustration over the phone call show how good an actor he is. Reba Monica John who played his ladylove looked gorgeous. Although the movie features several comedy actors, the teaser focuses mainly on Sree Vishnu’s character and the story behind his hatred of love. Overall, the teaser gives the impression that Samajavaragamana is a clean entertainer.
Ram Abbaraju yet again proves that he is too good at dealing with comedy entertainers. There is humor in almost every sequence in the teaser. Raam Reddy handled the cinematography and Gopi Sundhar’s background score uplifts the humor quotient. Chota K Prasad is the editor and Brahma Kadali is the art director. The production values looked adequate for the genre of the movie.
Bhanu Bogavarapu penned the story, while Nandu Savirigana has written the dialogues. Director Ram Abbaraju himself has written the screenplay of the movie.
Samajavaragamana will release worldwide in the summer on May 18th.
Cast: Sree Vishnu, Reba Monica John, Naresh, Sudarshan, Sreekanth Iyengar, Vennela Kishore, Raghu Babu, Rajeev Kanakala, Devi Prasad, Priya and others.
Technical Crew:
Anil Sunkara Proudly Presents
Screenplay & Direction – Ram Abbaraju
Producer – Razesh Danda
Co-Producer – Balaji Gutta
Banners- Ak Entertainments, Hasya Movies
Story – Bhanu Bogavarapu
Dialogues – Nandu Savirigana
Music Director – Gopi Sundhar
Cinematographer – Raam Reddy
Editor – Chota K Prasad
Art Director -Brahma Kadali
Costume Designer – Lakshmi Killari
PRO – Vamsi Shekar
‘సామజవరగమన’ హిలేరియస్ గా వుంటుంది. ప్రేక్షకులు నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు: ‘సామజవరగమన’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు & టీమ్

:శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్నకంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తునారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సరదాగా సాగే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.
చిన్న విషయాలుకు కూడా చిరాకుపడే యువకుడిగా కనిపించాడు శ్రీవిష్ణు. కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతనికి రాఖీ కడుతుంది. అప్పటి నుంచి అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేసినప్పుడల్లా రాఖీ కట్టించుకుంటాడు. ప్రేమ పై నెగిటివ్ అభిప్రాయాన్ని పెంచుకుంటాడు. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. అతని డైలాగ్స్, ఫ్రస్టేషన్ ఫ్రెష్ నెస్ ని తీసుకొచ్చాయి. బాత్రూమ్ సీక్వెన్స్, ఫోన్ కాల్ లో చివరి సీక్వెన్స్.. శ్రీవిష్ణు ఎంత మంచి నటుడో చూపిస్తున్నాయి. రెబా మోనికా జాన్ చాలా అందంగా కనిపించింది. ఈ చిత్రంలో పలువురు హాస్య నటులు ఉన్నప్పటికీ, టీజర్ ప్రధానంగా శ్రీవిష్ణు పాత్రపై, ప్రేమపై ద్వేషం వెనుక కథపై ఫోకస్ చేసింది. ఓవరాల్ గా టీజర్ చూస్తే సామజవరగమన క్లీన్ ఎంటర్ టైనర్ అనే భావన కలిగిస్తుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో తనకు తానే సాటి అని రామ్ అబ్బరాజు మరోసారి నిరూపించుకున్నాడు. టీజర్‌లో దాదాపు ప్రతి సీక్వెన్స్‌లోనూ హ్యుమర్ ఉంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించగా, గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హ్యుమర్ ని పెంచింది. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. నిర్మాణ విలువలు సినిమా జానర్‌కు తగ్గట్టుగా వున్నాయి.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. సామజవరగమన కంప్లీట్ ఎంటర్ టైనర్. ఇంత ఎంటర్ టైనర్ నేనూ ఎప్పుడు చేయలేదు. మెదడుకి పెద్ద పని లేకుండా హాయిగా సదరగా నవ్వుకొని, మీ అందరితో కూడా ఎంజాయ్ చేయించాలనుకొని చేసిన సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. మొదటి నుంచి చివరి వరకూ నవ్వుకుంటూనే వుంటారు. సినిమా హిలేరియస్ గా వుంటుంది. సాయి, భాను కి థాంక్స్. గోపి సుందర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆయనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. రెబా మోనికా జాన్ చాలా బాగా నటించింది. అనిల్ సుంకర గారితో అప్పట్లో ఒకడుండేవాడు సినిమా నుంచి అనుబంధం వుంది. ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయనతో చేస్తే చాలా మంచి సినిమా చేయాలని అనుకున్నాను. ఆయనతో ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. హిలేరియస్ గా వుంటుంది అదే సమయంలో కంటెంట్ కూడా వుంటుంది. ఇందులో అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ వుంది. నిర్మాత రాజేష్ దండా గారు కోవిడ్ సమయంలో ఈ కథతో వచ్చినపుదు ఆయన మారేడుమిల్లీ, భైరవ కోన తరహాలో ఉంటుందని అనుకున్నాను. కానీ ఇది సూపర్ ఫన్ సబ్జెక్టు. కథ విన్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. సామజవరగమన చాల మంచి కథ. మే 18న మీ ముందుకు వస్తోంది. రెండుగంటల పాటు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే రేపు ఏజెంట్ సినిమా వస్తోంది. అనిల్ సుంకర గారికి అందరూ బ్లాక్ బస్టర్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మేలో మా సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అన్నారు
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. సామజవరగమన కథ రామ్ చెప్పగానే బాగా నచ్చింది. ఎంటర్ టైన్ మెంట్ నా జోనర్. చాలా రోజులైయింది ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ చేసి. కథ వినగానే చేయాలని నిర్ణయించుకున్నాను. శ్రీవిష్ణు ఎంచుకునే కథలు యూనిక్ గా వుంటాయి. సామజవరగమన కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన పక్కా ఎంటర్ టైనర్. మొదటి నుంచి చివరి వరకూ నవ్వుతూనే వుంటారు. రాజేష్ కథల ఎంపిక బావుంటుంది. తను భవిష్యత్ లో మంచి నిర్మాత అవుతారు. రెబా జాన్ మంచి హీరోయిన్ అవుతుంది. రామ్ చాలా క్రమశిక్షణతో సినిమా చేశాడు. చాలా నిజాయితీ గల దర్శకుడు. యూనిట్ లో అందరూ కష్టపడ్డారు. సామజవరగమన చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీ ని కూడా తీసుకువస్తారు’’ అన్నారు.
రాజేష్ దందా మాట్లాడుతూ.. సామజవరగమన కథ చెప్పినప్పుడు నాన్ స్టాప్ గా నవ్వుకుంటూనే వున్నాను. నాకు బాగా నచ్చి అనిల్ సుంకర గారికి చెప్పాను. ఆయన కూడా చాలా నచ్చింది. దర్శకుడు ఏదైతే చెప్పాడో దాని కంటే బాగా తీశాడు. హాస్య మూవీస్ బ్యానర్ స్టార్ట్ అవ్వడానికి కారణం అనిల్ సుంకర గారు. ఆయన లేకపోతే ఈ బ్యానర్ లేదు. మే 18న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా చూడాలి’’ అన్నారు
రెబా మోనికా జాన్ మాట్లాడుతూ.. అనిల్ సుంకర గారికి, రాజేష్ గారికి కృతజ్ఞతలు. నా మొదటి తెలుగు సినిమాలో శ్రీవిష్ణు లాంటి కోస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా వుంది. దర్శకుడు రామ్ గారికి కృతజ్ఞతలు. మీ అందరికీ సామజవరగమన నచ్చుతుంది’’ అన్నారు.
రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. ఇది చిన్న టీజర్. ట్రైలర్ , సినిమా ఇంకా ఫన్ గా వుంటుంది. ఫ్యామిలీ అంత కలసి సరదా ఎంజాయ్ చేసే సినిమా సామజవరగమన. అనిల్ సుంకర గారు, రాజేష్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. శ్రీవిష్ణు గారిలో కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవల్. మనం వంద రాస్తే దాన్ని వెయ్యికి తీసుకువెళ్తారు. రెబ్బా చక్కగా నటించింది. మిగత టీం అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.
గోపిసుందర్ మాట్లాడుతూ.. సామజవరగమన చాలా మంచి ఎంటర్ టైనర్. మ్యూజిక్ చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.
భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన దైగాస్ రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు.
సామజవరగమన సమ్మర్‌లో మే 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.
సాంకేతిక విభాగం:
అనిల్ సుంకర సగర్వ సమర్పణ
స్క్రీన్ ప్లే & దర్శకత్వం – రామ్ అబ్బరాజు
నిర్మాత – రాజేష్ దండా
సహ నిర్మాత – బాలాజీ గుత్తా
బ్యానర్లు- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
కథ – భాను బోగవరపు
డైలాగ్స్ – నందు సవిరిగాన
సంగీతం – గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ – రాంరెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ -బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్ డిజైనర్ – లక్ష్మి కిల్లారి
పీఆర్వో – వంశీ శేఖర్









