Cinemarangam.Com
Review Rating..3/5
సినిమా : “జైత్ర”
విడుదల తేదీ : 26.05.2023
సమర్పణ : అల్లం శ్రీతన్మయి
బ్యానర్ : ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్
నిర్మాత: అల్లం సుభాష్.
దర్శకత్వం : తోట మల్లిఖార్జున్
నటీనటులు: సన్నీ నవీన్, రోహిణి రేచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్ తదితరులు
కెమెరా: మోహన్ చారి
పాటలు : కిట్టు విస్సా ప్రగడ
సంగీతం : ఫణికళ్యాణ్
ఎడిటర్: విప్లవ్ నైషదం
పిఆర్ఒ: శ్రీధర్
రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా తప్పకుండా ఫ్యాక్షన్ సినిమా అనుకుంటాడు. కానీ అందుకు భిన్నంగా మట్టితో చుట్టరికం చేసే రాయలసీమ రైతు యొక్క కథ, కథనాలతో అందంగా తెరకెక్కించిన సినిమానే “జైత్ర”. అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర`. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత. ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్స్, టీజర్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ట్రైలర్ కు కూడా మంచి ఆదరణ లబించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 26న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

కథ:
నిత్యం కరువుని ఎదుర్కొంటూ వ్యవసాయాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రాయలసీమ ప్రాంతంలోని కడపజిల్లా రైతు కథ నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది..(సన్నీ నవీన్ )జైత్ర ఒక రైతు.అయితే అగ్రికల్చర్ సైంటిస్ట్ అయిన హీరోయిన్ రోహిణి రేచల్ (దాక్షాయిని)రీసెర్చ్ పనిమీద రాయలసీమ వ్యవసాయ పరిస్థితి గురించి తెలుసుకునేందుకు హీరో దగ్గరకి వస్తుంది.ఆ తరువాత వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.ఇలా సాగుతున్న వీరికి ఒక చిన్న కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని వీరు ఎలా ఎదుర్కోన్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు
జైత్ర గా రైతు పాత్రలో నటించిన సన్నీ నవీన్, దాక్షాయిని గా అగ్రికల్చర్ సైంటిస్ట్ పాత్రలో నటించిన రోహిణి రేచల్ లు ఇద్దరూ పోటీ పడి చాలా చక్కగా నటించారు.భూమి, పశువులు పై ప్రేమ చూపించే హీరో పై హీరోయిన్ కి ప్రేమ కలగడం వంటి సీన్స్,హీరో, హీరోయిన్ ల మధ్య జరిగే పరిచయం, సన్నివేశాలు ఫీల్ గుడ్ గా అనిపించడమే కాకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.వంశీ నెక్కంటి, సునీత మనోహర్ తదితరులు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు

సాంకేతిక నిపుణుల పనితీరు
రాయలసీమ ప్రాంతంలో అందరూ కక్షలు కార్బన్యాలతో ఉంటారు అనే భావన నుంచి రాయలసీమలో మట్టిని ఎంతలా ప్రేమిస్తారు వ్యవసాయం అనేది ఒక పండుగ వ్యవసాయం చేయడం ఎంతో గర్వంగా ఎలా ఫీలవుతారు.వారి బాష, మరియు మనుషులు ప్రవర్తన కొంచెం కటువుగా ఉన్నా వారిలో ఎటువంటి కల్మషం లేకుండా ఎదుటివారిని స్వచ్చంగా ప్రేమిస్తారు. రాయలసీమ అంటే కొడవళ్ళతో తలలు నరికే వంటి సన్నివేశాలు కాకుండా.. ఆ ప్రాంత పల్లెలో ముస్లిమ్స్ మరియు హిందువులు మామా మామా అని ఆప్యాయంగా పిలుచుకునే విషయాలు దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంతో నేటివిటీని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. కడపజిల్లా సంస్కృతి, యాస, సంప్రదాయాలు, రైతు కష్టాలు,కన్నీళ్లను ఎక్కడా బోర్ కొట్టకుండా కమర్షియల్ గా తెరకెక్కించారు.అలాగే రాయలసీమ ప్రాంతంలో భూమిని ప్రేమించే రైతులు ఎలా ఉంటారు? వారి ఇబ్బందులు ఎలా ఉంటాయి? అనే విషయాన్ని డైరెక్టర్ తోట మల్లికార్జున జైత్ర మూవీలో చాలా చక్కగా వివరించారు .ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ చక్కని సంగీతం అందించాడు. కిట్టు విస్సా ప్రగడ అందించిన పాటలు బాగున్నాయి.మోహన్ చారి అందించిన కెమెరా పనితనం అద్భుతం అని చెప్పవచ్చు. విప్లవ్ నైషదం ఎడిటింగ్ పనితీరు బాగుంది.అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రాయలసీమ స్లాంగ్ ,నేటివిటీతో రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథతో అల్లం సుభాష్ నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం చేసే ప్రతి మనిషి తనను తాను చూసుకుంటున్నట్టు మనదే కదా మనవే డైలాగులు అనే లాగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని, చేరువయ్యే చక్కటి సినిమా “జైత్ర” అని కచ్చితంగా చెప్పవచ్చు. చూసిన వారందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
Cinemarangam.com Review Rating..3/5









