సుమ మాట్లాడుతూ.. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా మాట్లాడటం ఆనందంగా వుంది. ఇలాంటి కమర్షియల్ సబ్జెక్ట్, ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. శౌర్య మొదటి సినిమా నుంచి ఎంతో కష్టపడుతున్నారు. సుధాకర్ గారు సినిమా అంటే ప్యాషన్ వున్న ప్రొడ్యుసర్. పవన్ గారికి అభినందనలు. సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. జులై 7 థియేటర్ థియేటర్ లో కలుద్దాం” అన్నారు.
దర్శకుడు పవన్ బాసంశెట్టి మాట్లాడుతూ.. ఈ వేదికపై ఉండటానికి కారణం శౌర్య అన్న, సుధాకర్ గారు. ఈ సినిమాలో శౌర్య హీరోయిజం, ఎమోషన్ కొత్తగా చూస్తారు. నిర్మాత ఎక్కడ రాజీపడకుండా తీశారు. వంశీ, దివాకర్ మణి గారు బ్రిలియంట్ వర్క్ చేశారు. యుక్తి చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో నటించిన అందరికీ థాంక్స్. పవన్ సిహెచ్ మంచి పాటలు ఇచ్చారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి ట్యాలెంటెడ్ టీంతో పని చేశాం. చాలా మంది కొత్త దర్శకులు పరిశ్రమలోకి వస్తున్నారు. వారికి కూడా ఇలాంటి మంచి హీరో, నిర్మాత దొరకాలని కోరుకుంటున్నాను. అంతా ఈ సినిమా మొదటి రోజు చూడండి. కొత్త దర్శకుల సినిమాని నేను కూడా ఫస్ట్ డే చూస్తాను. అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.
యుక్తి తరేజ మాట్లాడుతూ..దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. శౌర్య గారి తో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ టీంతో కలిసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. జులై 7న అందరూ సినిమాని థియేటర్ లో చూడండి” అన్నారు
కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా మన వూరిని గుర్తు తెచ్చి ఆకట్టుకునే సినిమాలా అనిపిస్తుంది. సొంత ఊరు చాలా ప్రత్యేకం. నిజానికి నా పేరు కిషోర్. తిరుమల అనేది మా ఊరు పేరు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు
శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. శౌర్య, సుధాకర్ గారికి ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ కి అభినందనలు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి” అన్నారు. ఈ వేడుకలో రాజ్ కుమార్ కేసిరెడ్డి, నోయల్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.









