Youthful love Entertainer ‘O Saathiya’… Movie Review

Cinemarangam. Com
Movie Name : O Saathiya
Review Rating : 3/5
Release Date : 07.07.2023
Banner: Thanvika Jashwika Creations
Producers: Chandana Katta, Subhash Katta
Director: Divya Bhavana
Story: Aryan & Deepu
Line Producer: Vamshi Krishna Juluru
Executive Producers: Chandra Tiwari Avula, Keshav Sai Krishna Goud 
Cast: Aryan Gowra, Mishti Chakravarty, Annapurnamma, Sivannarayana, Chaitanya Garikapati, Crazy Khanna, Bullet Bhaskar, Ambarish Appaji, Devi Prasad, Kalpalatha, Pramodini etc..
Music Director: Vinnu
Dop: EJ Venu
Lyricists: Bhaskarabhatla, Ananth Sriram, Rambabu Gosala
Editor: Carthic Cuts
Choreographers: Raghu Master, Baba Bhaskar Master, Anee Master 
PRO: Sai Satish

తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్యన్‌ గౌరా, మిస్టీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా దివ్య భావనను దర్శకురాలుగా పరిచయం చేస్తూ చందన కట్టా, సుభాష్‌ కట్టా లు నిర్మించిన చిత్రం “ఓ సాధియా..”
ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని UFO మూవీస్ సంస్థ ద్వారా ఈ నెల 7 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “ఓ సాధియా”.. సినిమా ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
వైజాగ్ లో బిటెక్ చేస్తూ సరదాగా గడిపేసే అర్జున్‌ (ఆర్యన్‌ గౌరా)..కు అదే కాలేజీలో చదువుతున్న  కీర్తి (మిస్తీ చక్రవర్తి) ని చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే అర్జున్ క్లాస్మేట్స్ రెండు వర్గాలుగా చీలీ  కొట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఈ రెండో వర్గం వారు కూడా కీర్తీని చూసి ప్రేమలో పడతారు. రెండు వర్గాల వారు కీర్తి నాదంటే నాది అని కొట్టుకుంటూ ఉంటున్న తరుణంలో అర్జున్ కీర్తికి ఒక సలహా ఇస్తాడు. వాళ్లు నీ వెంట పడకుండా ఉండాలంటే.. నీకో లవర్ ఉన్నాడు అది నేనే అని చెప్పమంటే.. సమస్య తొలగిపోతే చాలు అనుకున్న కీర్తి కూడా అర్జున్ సలహా మేరకు చెప్పటంతో అర్జున్- కీర్తిల మధ్య మంచి స్నేహం మొదలవుతుంది. ఆ స్నేహంలోనే కీర్తితో ప్రేమలో పడ్డ అర్జున్.. ఒక మంచి రోజు చూసి తన ప్రేమ గురించి కీర్తి కి చెపుదాం అనుకునే సమయంలో అకస్మాత్తుగా కనపడకుండా పోతుంది. కీర్తి ఎక్కడకి వెళ్ళింది.. ? ఏం జరిగింది.. ? ఎలా మిస్ అయింది..? అర్జున్ ఏ స్థితిలో కలుస్తాడు.. ? కీర్తి – అర్జున్ ప్రేమను ఓకే చేస్తుందా..? అనే  అనే విషయాలు తెలుసుకోవాలి అంటే “ఓ సాధియా..” సినిమా తప్పక చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు
అర్జున్ పాత్రలో నటించిన ఆర్యన్‌ గౌరా తన హావ భావాలతో పాటు, మాటలు,పాటలు, ఫైట్స్, ఏమోషన్స్ ఇలా అన్ని షేడ్స్ లో చాలా చక్కగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. కీర్తి పాత్రలో హీరోయిన్ గా నటించిన మిస్తీ చక్రవర్తి తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది.హీరోకు ఫ్రెండ్స్ గా నటించిన చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, , బుల్లెట్‌ భాస్కర్, అంబరీష్‌ అప్పాజి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని వంటివారు తమ పరిదిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు

సాంకేతిక నిపుణుల పనితీరు
ఈ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి తొలి ప్రేమ అనుభవం అనేది ఉండే ఉంటుంది. ఆ రోజుల్లోని మధుర జ్ఞాపకాలు హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయి. అప్పట్లో చేసిన అల్లరి, చిలిపి పనులు.. ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి. ప్రేమ గుర్తులు అనేవి మరపురాని మధుర స్మృతులు. సరిగ్గా అదే పాయింట్ తీసుకొని తొలి ప్రేమ అనుభవం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ప్రేమ కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ.. డిఫరెంట్ యాంగిల్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆసక్తికర సన్నివేశాలతో చాలా చక్కగా తెరకెక్కించింది దర్శకురాలు దివ్యభావన.తన మొదటి సినిమాతోనే చిన్న ప్రేమ కథను ఎంత అందంగా తీయొచ్చో తీసి చూపించారు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు విన్ను అందించిన మ్యూజిక్ బాగుంది.పాటలు వినసొంపుగా ఉన్నాయి . కెమెరామెన్‌ వేణు తన పనితనాన్ని చక్కగా చూపించాడు. కొన్నిచోట్ల వచ్చే డైలాగ్స్‌ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాతలు సుభాశ్‌ కట్టా, చందన కట్టా లు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన ఈ సినిమా ప్రతి ప్రేమికుడిలో కూడా ఒక కొత్త అనుభూతి కలుగిస్తూ యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంటుంది. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునే లా తీసిన ఈ సినిమాను కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఆ నాటి తొలి ప్రేమ జ్ఞాపకాల్లోకి వెళ్లాలి అంటే “ఓ సాథియా” సినిమా చూడడానికి కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లాల్సిందే

Cinemarangam.com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here