Cinemarangam.Com
బ్యానర్ : మైక్ మూవీస్
సినిమా : “స్లమ్ డాగ్ హజ్బెండ్”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 29.07.2023
నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.
నటీ నటులు : సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ,ఆలీ,సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు
సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి
బిజినెస్ హెడ్ : రాజేంద్ర కొండ
సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్ – వైష్ణవ్ వాసు,
సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి
పీఆర్వో – జీఎస్కే మీడియా

జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ లాంటి కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ నుండి వస్తున్న మరో ఫీల్ గుడ్ మూవీ “స్లమ్ డాగ్ హజ్బెండ్”.సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
లచ్చి అలియాస్ లక్ష్మణ్ (సంజయ్ రావ్) పార్సిగుట్టలో నివసించే కుర్రాడు. మౌనిక (ప్రణవి మానుకొండ)తో ప్రేమలో ఉంటాడు. వీరిద్దరూ రాత్రి పూట ఫోన్ లలో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు.ఇది చూసిన సంజయ్ తల్లి రాత్రి పూట ఫోన్ లో మాట్లాడవద్దు అని తిడుతుంది. దాంతో వీరిద్దరూ పార్క్ లో రొమాన్స్ చేసుకుందామని అక్కడికి వెళితే పోలీసులు వచ్చి వీరిద్దరినీ అరెస్ట్ చేస్తామంటారు. దాంతో ఇద్దరు లవర్స్ పార్క్ లో మాట్లాడరాదా.. ఎన్నో జంటలు ఈ పార్క్ లో ఉంటే మేమే కనిపించామా.. అరెస్ట్ వారెంట్ ఉందా.. ఇంట్లో అమ్మ తిడుతుంది, పార్క్ కొస్తే మీరు ఏంటి సార్ మాకు ఈ బాధలు అని యస్.ఐ పై ఫైర్ అవుతాడు లచ్చి.దాంతో ఆ యస్. ఐ బస్ డిపోలో ఎన్నో బస్ లు ఖాళీ ఉన్నాయి అక్కడ ఎవరూ ఉండరు. మీరు ఎంతసేపైనా రొమాన్స్ చేసుకోవచ్చు అని సలహా ఇవ్వడంతో మరుసటి రోజు వీరిద్దరూ బస్ డిపోకు వెళ్లి అక్కడ ఖాళీ గా ఉన్న ఒక బస్ లో రొమాన్స్ చేసుకుంటుండగా మళ్ళీ ఆ యస్. ఐ వచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీ లో మీరు చేస్తున్న ఇలాంటి పనికి అరెస్ట్ వారెంట్ అవసరం లేదని లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి జైల్లో చితక బాదుతారు. దాంతో ప్రేమలో ఉండే ఇబ్బందులు పడలేక వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే జాతకరీత్యా లక్ష్మణ్ ముందుగా ఓ కుక్కతో వివాహం చేసుకోవాలని లేకపోతే ఎవరైనా మరణించవచ్చు కాబట్టి కుక్కతో పెళ్ళైన వారానికి నిజమైన పెళ్లి చేసుకోవచ్చని పంతులు చెబుతాడు. అయన చెప్పిన విధంగా అంగరంగ వైభవంగా కుక్కని(బేబీ )పెళ్లి చేసుకుంటాడు. ఇక తర్వాత వారం దూమ్ దాం గా మౌనిక మెడలో తాళి కడుతున్న సమయంలో మొదటి పెళ్లి చేసుకున్న బేబీ. (కుక్క) కు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు చట్టరీత్యా నిన్ను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు వచ్చి లక్ష్మణ్ ను జైలుకు తీసుకెళతారు. ఇదంతా కుక్క ఓనర్ పని అన్ని తెలిసి ఆయన్ను అడగగా తను చెప్పిన మాటలకు లచ్చిగాడికి షాక్ తగులుతుంది. ఆ పరిస్థితులలో వారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. బేబీ కు విడాకులు ఇచ్చి ప్రాణంగా ప్రేమించిన మౌనిక ను పెళ్లి చేసుకున్నడా..లేదా? అనేదే తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “స్లమ్ డాగ్ హజ్బెండ్” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
లచ్చి గాడు అలియాస్ లక్ష్మణ్ పాత్రలో నటించిన సంజయ్రావు నటన బాగుంది. ఇంతకుముందు సినిమాలు, సీరియళ్లలో నటించిన ప్రణవి ఈసారి భిన్నంగా కనిపించింది. గ్లామర్ పెద్దగా చూపించక పోయినా పక్కింటి అమ్మాయిలా బాగా నటించింది. తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది, కొన్ని సీన్స్ లో మసాలా డోస్ పెంచి అందరిని అలరించింది. ఈ సినిమాలో యాదమ్మ రాజు కామెడీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. కుక్క యజమానిగా వేణు పొలసాని కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు.సంజయ్ కు తల్లిగా, ప్రణవి తండ్రి గా నటించిన మురళీధర్ గౌడ్, జడ్జ్ గా నటించిన ఫిష్ వెంకట్, లాయర్స్ గా నటించిన సప్తగిరి, బ్రహ్మాజీ, మరియు రఘు కారుమంచి లు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. ఇంకా ఇందులో నటించిన వారంతా తమ పాత్ర పరిధిమేరకు బాగా ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
కుక్కను పెళ్లి చేసుకోవడం వల్ల హీరోకు ఎదురయ్యే ఇబ్బందులు, దాని నుండి బయటపడేందుకు హీరో ఏం చేస్తాడు, అతని జీవితం ఎంత గందరగోళానికి గురైందనే సన్నివేశాలను హాస్యభరితంగా తీర్చిదిద్దడంలో నూతన దర్శకుడు ఏఆర్ శ్రీధర్ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.
ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మంచి మాస్, మెలోడీ పాటలతో అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చాడు .ఈ సినిమాకు మ్యూజిక్ పెద్ద అసెట్.కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి లు రాసిన పాటలు బాగున్నాయి. పెళ్లితో వచ్చే ఫ్రస్టేషన్ సాంగ్, . “లచ్చి గాని పెళ్లి”, అలాగే రెట్రో సాంగ్ ప్రేక్షకులకు మంచి ఊపు తెప్పిస్తాయి .నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది.. శ్రీనివాస్ జె రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది . వైష్ణవ్ వాసు ఎడిటింగ్ పనితీరు బాగుంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి లు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “స్లమ్ డాగ్ హజ్బెండ్” సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది
Cinemarangam.Com Review Rating. 3/5









