హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘కింగ్ ఆఫ్ కోత’ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎక్సయిమెంట్ కలిగింది. దుల్కర్ ఒక యాక్షన్ సినిమా చేయడం ఈ ఎక్సయిట్మెంట్ కి కారణం. మా యాక్టింగ్ స్కూల్ దుల్కర్ నా జూనియర్. అక్కడి నుంచి తను పరిచయం. తను చాలా పద్దతైన వ్యక్తి. మృదు స్వభావి. తను ఇలాంటి యాక్షన్ సినిమా చేయడం చాలా ఎక్సయిటెడ్ గా వుంది. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద ఘన విజయం సాధించాలి’ కోరారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. దుల్కర్ తన తెలుగు కెరీర్ స్టార్ట్ చేసినదాంట్లో నా వాయిస్ (‘ఓకే బంగారం )కూడా వుంది. తెలుగులో తన కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళుతున్న ఈ తరుణంలో నేను ఈ వేడుకలో వుండటం చాలా ఆనందంగా వుంది. తన జర్నీలో నేను ఒక భాగం అనే ఫీలింగ్ వుంది. దుల్కర్ చేస్తున్న చిత్రాలని చూస్తుంటే చాలా గర్వంగా వుంది. పాన్ ఇండియా అనే మాట నాకు పెద్దగా నచ్చదు కానీ నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దుల్కర్ మాత్రమే.హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం దర్శకులు దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్టర్ అనే మాటకు ఇది నిజమైన నిర్వచనమని భావిస్తున్నాను. కింగ్ ఆఫ్ కోత’ చాలా ప్రామెసింగ్ గా కనిపిస్తోంది . ట్రైలర్ , విజువల్స్, మ్యూజిక్.. చాలా ఎనర్జిటిక్ గా వున్నాయి. ఐశ్వర్య గారి సినిమాలకి నేను ఫ్యాన్ ని. దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. సీతారామంతో దుల్కర్ మనందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ సినిమాతో అది నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను. కింగ్ ఆఫ్ కోత’ పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించి, సినిమాలో భాగమైన అందరికీ స్పెషల్ ఫిల్మ్ గా నిలవాలని కోరుకుంటున్నాను.
ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. దుల్కర్, నేచురల్ స్టార్ నాని, రానా గారు లాంటి ఇండియన్ సినిమా గేమ్ చేంజర్స్ తో కలసి ఈ వేదిక పంచుకోవడం అనందంగా వుంది. ప్రేక్షకులకు, అభిమానులు వారికి పంచిన ప్రేమలో నాకు కూడా కొంచెం ఇవ్వాని కోరుకుంటున్నాను( నవ్వుతూ). కింగ్ ఆఫ్ కోత మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్స్ లో కలుద్దాం” అన్నారు. ఈ వేడుకలో నిర్మాత శ్రవంతి రవి కిషోర్, నిమ్మకాయల ప్రసాద్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.