Out and Out Hilarious Entertainer “Bedurulanka 2012” Movie Review

Cinemarangam.Com
సినిమా : “ బెదురులంక 2012”
విడుదల తేదీ : ఆగష్టు 25, 2023
రివ్యూ రేటింగ్ : 3 /5
సమర్పణ : సి. యువరాజ్,
బ్యానర్ : లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని,
రచన – దర్శకత్వం : క్లాక్స్.
సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల,
సంగీతం: మణిశర్మ,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా,
నటీ నటులు : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ
పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ,
ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం,
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య,
యాక్షన్: అంజి, పృథ్వీ
కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల,
ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల,కూరపాటి,
కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్

సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరో హీరోయిన్లు గా క్లాక్స్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన సినిమా ‘బెదురులంక 2012’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టు 25 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బెదురులంక 2012 సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.


కథ
డిసెంబర్ 2012 లో జరిగే కథ ఇది.సిటీ లో గ్రాఫిక్ ఇంజినీర్ అయిన శివ శంకర వరప్రసాద్ (కార్తికేయ ) ఓ స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు.ఎవ్వరినీ లెక్క చేయడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. తన పని తాను చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు.  అటువంటి శివకు ఆఫీస్ లో ఒక చిన్న ఇష్యూ వలన తన గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి సిటీ కి దూరంగా నాగరికతకు నోచుకుండా గోదారి నది మధ్య ఉన్న తన సొంత పల్లె బెదురులంకకు బయలుదేరి వస్తాడు. శివతో ప్రేమలో ఉన్న ఆ ఊరి ప్రెసిడెంట్(గోపరాజు రమణ ) కూతురు చిత్ర (డి.జె.టిల్లు ఫెమ్ నేహాశెట్టి)ను కలుస్తాడు. వీరిద్దరూ చిన్నప్పటి ప్రేమించుకుంటున్నా..బెదురులంక ప్రపంచం మాత్రమే తెలిసిన చిత్ర మాత్రం శివకు ఐలవ్యూ  చెప్పడానికి భయపడుతుంటుంది.

మరో వైపు టీవీలో పదే పదే .త్వరలో యుగాంతం వస్తుందనే వార్తలు వింటున్న పల్లె జనాలు బెంబేలెత్తి పోతుంటారు. ఈ .ప్రచారాన్ని నిజమే అని చెప్పి నమ్మించాలని ఆ ఉరి ప్రెసిడెంట్ మంచి తనాన్ని ఆసరాగా చేసుకొని మతాలు, దేవుళ్లను అడ్డం పెట్టుకొని అమాయకులైన ఊరి జనాల దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని దోచుకోవాలని భూషణం (అజయ్ ఘోష్). బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డానియల్ (జబర్దస్త్ రాంప్రసాద్)లు ప్లాన్ వేస్తారు.. వీరి ప్లాన్ లో భాగంగా దొంగ బాబా గా బ్రహ్మం, డూప్లికేట్ ఫాదర్ గా దానియేల్, వీరికి సపోర్ట్ చేసే పెద్దగా భూషణం లు కలసి ఒకటి రెండు రోజుల్లో చచ్చిపోతాం అని ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మిస్తారు.అలాగే వారందరి దగ్గర ఉన్న బంగారాన్ని ఇస్తే దాన్ని కరిగించి శివలింగం,శిలువ తయారు చేసి యుగాంతం రాకుండా ఆపుతామని చెప్తారు. వారు చెప్పిన మూఢ నమ్మకాలను నిజమే అని నమ్మిన ప్రజలను వెర్రి గొర్రెలను చేసి మోసం చేస్తున్న వీరికి అడ్డుపడతాడు శివ.అందుకు శివ అడ్డు తొలగించుకొంటేనే ప్రజలు మా మాట వింటారనే ఆలోచనతో శివను ప్రేమిస్తున్న చిత్రను తనకు కాకుండా చేసి శివను ఈ ఉరి నుండి వేలేయాలనే తలంపుతో ప్రెసిడెంట్ ను కలసి మన ఊరికి యుగాంతం రాకూడదని మనం చేస్తున్న మంచి ప్రయత్నానికి శివ అడ్డు పడుతున్నాడని ప్రెసిడెంట్ కు లేని పోని మాటలు చెప్పి తన కూతురు చిత్రను కసిరాజు కు ఇప్పించాలనే కుట్ర పన్నుతారు భూషణం గ్యాంగ్. దాంతో ప్రెసిడెంట్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తరువాత శివ ను ఊరి నుండి వెలేస్తారు. అయితే మన ఊరు గోదావరిలో కొట్టుకుపోకుండా చేస్తామని చెప్పిన ఆ కన్నింగ్ గ్యాంగ్ యుగాంతం రాకుండా ఆపారా ? వారి బారినుండి ఊరిని, ఊరి ప్రజలను శివ కాపాడాడా ? చిన్నప్పటి నుండి ప్రేమించిన చిత్రను దక్కించుకున్నాడా లేదా? అనేది తెలుసుకోవాలి అంటే “బెదురులంక 2012” సినిమా కచ్చితంగా చూడాల్సిందే..

    నటీ నటుల పనితీరు
సిటీ నుంచి ఊరికి వచ్చిన ఆధునిక యువకుడి క్యారెక్టర్ లో శివ తన లుక్స్ & మ్యానరిజమ్స్, డ్యాన్స్ తో అద్భుతంగా నటించాడు..చిత్ర పాత్రలో పల్లెటూరు అమ్మాయిగా నటించిన నేహా శెట్టి తన గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించింది. వీరి మధ్య వచ్చే సీన్స్ అన్ని క్యూట్ గా ఉన్నాయి. అలాగే వీరిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందని చెప్పచ్చు. భూషణం అనే పాత్రలో నటించిన అజయ్ ఘోష్. తన నటన, హావభావాలతో సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. .బ్రహ్మంగా శ్రీకాంత్ అయ్యంగార్ హిలేరియస్ గా నవ్వించాడు. అతడి పంచ్ డైలాగులు బాగా పేలాయి. జబర్దస్త్ రాంప్రసాద్ కూడా అదే స్థాయిలో అలరించాడు. ప్రెసిడెంట్ పాత్రలో నటించిన గోపరాజు రమణ చక్కని హావ భావాలు పలికించాడు. భూషణం కొడుకు గా కసిరాజు పాత్రలో నటించిన రాజ్ కుమార్ కసిరెడ్డి నటన, డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. న్యూస్ రీడర్ పాత్రలో నటించిన వెన్నెల కిషోర్,మరియు సత్య పాత్రలు చిన్నవే అయినా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్థాయి..ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.


 సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు క్లాక్స్ గోదావరి రూరల్ బ్యాక్ డ్రాప్ లోఒక సింపుల్ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని మనుషుల్లో బలహీనతలు, స్వార్థం, దిగజారుడు తనం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఆయన స్టైల్ లో అంతర్లీనంగా చక్కని మెసేజ్ ఉన్న సెన్సిబుల్ జానర్ ను క్యారీ చేస్తూ రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడంలో దర్శకుడిగా, కథకుడిగా, రచయితగా క్లాక్స్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. వెన్నెల్లో ఆడపిల్లా,సొల్లుడే శివ, దొంగోడే దొరగాడే అనే పాట ద్వారా ఓ మతం, ఓ ఆచారం, ఓ సంప్రదాయం అని కాదు… ప్రతి ఊరిలో, ప్రతి చోట మతం పేరుతో మనుషుల్ని దోచుకునే మోసగాళ్లు ఉన్నారని తెలుపుతూ ప్రేక్షకులకు వినోదం అందించడంతో పాటు వారిలో ఓ ఆలోచన రేకెత్తించే పాటతో కిట్టూ విస్సాప్రగడ రాసిన ఈ పాట బాగుంది.. ఇంకా ఇందులో ఉన్న సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్స్ సాయిప్రకాష్ & సన్నీలు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు.విప్లవ్ న్యాసదం ఎడిటింగ్ పనితీరు బాగుంది. సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. పంచ్ టు పంచ్ డైలాగులా కాకుండా సిట్యువేషన్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ ఎక్కువ ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. “బెదురులంక 2012” సినిమాకు వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్అవ్వడమే కాకుండా రెండున్నర గంటలు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.థియేటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు.

Cinemarangam.Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here