Director and Hero Laxman Chinna interview about Enuganti film Zone’s ‘Nachinavadu’ Movie

ఏనుగంటి ఫిలిం జోన్ బ్యానర్ పై దర్శక-నిర్మాత లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో  నిర్మించిన చిత్రం నచ్చినవాడు ఈనెల అనగా సెప్టెంబర్ 22న రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు కర్ణాటకలో విడుదలవుతున్న సందర్భంగా,  దర్శకుడు లక్ష్మణ్ చిన్నా విలేకరులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు…

ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ… ఈ నచ్చినవాడు చిత్రం అందరికీ నచ్చే విధంగా ఉన్నత నిర్మాణ విలువలతో,  స్త్రీ ఆత్మ గౌరవాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, నేటి యువతరానికి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా తీర్చిదిద్దామని చెప్పారు. తమ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ అందించిన సంగీతం, యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచిందని, తన దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమాలో ప్రముఖ సింగర్స్  జావేద్  ఆలి, యాజిన్ నిజార్ , సైనోరా లాంటి  దేశంలోని ప్రముఖ సింగర్స్ చేత పాడించడం, ‘ నచ్చిన వాడు ‘ ఆల్బమ్ మ్యూజికల్ హిట్ అయ్యి, ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో ప్రేక్షకాదరణ పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. మా చిత్రంలో మనసుని తాకే మెలోడీ మ్యూజిక్ తో పాటు, సినిమాటోగ్రఫీ కి కూడా ప్రముఖ స్థానం ఇచ్చామని, కన్నడలో అవార్డ్ సినిమాటోగ్రాఫర్  అనిరుధ్ ని  డి ఓ పి గా ఎంచుకోవడం ద్వారా సినిమా మొత్తం మరింత ఆకర్షణగా వచ్చిందనీ, ప్రముఖ ఎడిటింగ్ సాఫ్టువేర్  లని ఉపయోగించి, 2k, 4k క్వాలిటీ లో డాల్బీ Atmos  సౌండ్ సిస్టమ్ తో చిత్రానికి టెక్నికల్  హంగులు అద్దామని,ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఒక చక్కటి ఫీల్ తో, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూశామనే జ్ఞాపకాలతో వెళతారని, తమ తమ జీవితాల్లో విలువైన ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 10 సంవత్సరాలు దర్శకత్వ శాఖలో పనిచేసే, ఒక మంచి కథతో దర్శకుడు గా మీ ముందుకు వచ్చానని, కొత్త తరం నటులని ప్రోత్సహించాలనే సంకల్పంతో తెలుగు, కన్నడ నటులకు అవకాశం ఇచ్చి, చిత్రంలో మేము ఎంచుకున్న స్టోరీకి అనుగుణంగా నటీ నటులను తీసుకుంటూ,కర్ణాటక పాండిచ్చేరి, గోవా లాంటి ప్లేసెస్ లో షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని చెబుతూ, ఈనెల 22న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని అభిలాష వ్యక్తం చేశారు దర్శకుడు లక్ష్మణ్ చిన్నా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here