Romantic Action Entertainer ‘Dheera’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “‘ధీర”
విడుదల తేదీ : 2nd Feb 2024
రివ్యూ రేటింగ్ : 3/5
సమర్పణ: చదలవాడ బ్రదర్స్ 
బ్యానర్స్ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర 
నిర్మాత :  పద్మావతి  చదలవాడ
రచన మరియు దర్శకత్వం : విక్రాంత్ శ్రీనివాస్
నటీనటులు: లక్ష్ చదలవాడ, నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి  తదితరులు
సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ
సంగీతం:  సాయి కార్తీక్
ఎడిటింగ్ : వినయ్ రామస్వామి
ఫైట్ మాస్టర్: జాషువ, వింగ్ చున్ అంజి
పి ఆర్.ఓ : సాయి సతీష్, రాంబాబు

ప్రస్తుతం యంగ్ హీరోలు సిల్వర్ స్క్రీన్ మీద వండర్లు క్రియేట్ చేస్తున్నారు. న్యూ ఏజ్ కంటెంట్‌తో వచ్చి హిట్లు కొడుతున్నారు. అలా టాలీవుడ్ యంగ్ హీరోల్లో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. \వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు  ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న“‘ధీర” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవిలో ఉన్న హంసలేఖ దేవి(హిమజ)..కొన ఊపిరితో ఉన్న రాజ్ గురును వైజాగ్ లోని ఒక బంగ్లా లో సీక్రెట్ గా ట్రీట్మెంట్ చేయిస్తుంటుంది. అయితే హైదరాబాద్ లోని హాస్పిటల్ కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందిస్తే బతుకుతాదని డాక్టర్స్ చెపుతారు. అయితే ఒక కిల్లింగ్ గ్యాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాజ్ గురును చంపడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంటుంది.మరో వైపు అదే వైజాగ్ లో ఉండే హీరో రణధీర్(లక్ష్) కు డబ్బు పిచ్చి ఎక్కువ.ఏ పనీ ఫ్రీ గా చెయ్యడు.డబ్బు ఇస్తే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు . అయితే రాజ్ గురును హైదరాబాద్ తీసుకెళ్తే పాతిక లక్షలరూపాయలు  ఇస్తామని చెప్పడంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు సిద్ధమవుతాడు..అంబులెన్స్ డ్రైవర్ గా వెళ్లిన రణధీర్ కి ఆ అంబులెన్స్ లో డాక్టర్ గా వచ్చేది తన మాజీ ప్రేయస్ అమృత(నేహా పఠాన్) అని తెలుస్తుంది. లోపల ఉన్న పేషెంట్ ని చంపేందుకు కొన్ని గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉండటంతో చాకచక్యంగా ఆ పేషెంట్ ని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తాడు రణధీర్. హాస్పిటల్ లో జాయిన్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక తల్లి బిడ్డ తాను డ్రైవ్ చేస్తున్న వాహనంలో ఉన్న విషయాన్ని తెలుసుకుంటాడు.  అయితే రణధీర్ తీసుకెళ్లిన పేషెంట్ ఎవరు..? రణధీర్ ను తన బిడ్డను కాపాడమని ప్రాధేయపడిన మహిళ ఎవరు..? చిన్న పాప కోసం కొన్ని గ్యాంగ్ లు ఎందుకు వెంటపడుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “ధీర” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే ఓ కుర్రాడు పాత్రలో హీరో  లక్ష్  చాలా బాగా నటించారు.గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో వచ్చే ఛేజింగ్ సీన్స్,  యాక్షన్స్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ లలో, చాలా బాగా నటించాడు  అలాగే హీరోయిన్ నేహా పఠాన్ డాక్టర్ అమృతగా తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది.సోనియా బన్సాల్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఉన్నంతలో తన మార్క్ ను చాటుకునే ప్రయత్నం చేసింది
మిర్చి కిరణ్ కొన్ని కామెడీ సీన్స్ తో నవ్వు తెప్పించాడు. 
హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితర తారాగణం మొత్తం వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
‘డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే ఒక వ్యక్తిగా ధీర క్యారెక్టర్ కాస్త భిన్నంగా రాసుకొని తెరకెక్కించాడు. దర్శకుడు  విక్రాంత్ శ్రీనివాస్. అయితే ఏ పని ఫ్రీ గా చెయ్యని దీర కు 2500 కోట్ల ఇస్తామని వచ్చిన ఆఫర్ ను వదిలేసి పాపను కాపాడడానికి ముందుకు రావడం అనే సీన్ ప్రేక్షకులకు కన్వీన్స్ గా అనిపించదు.. నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని నాకు కారెక్టర్ లేదు’,  ‘నేను యుద్దం చేయడం ఏంట్రా.. యుద్దమే మిమ్మల్ని వెంటాడుతూ వేటాడుతూ వస్తోంది.‘రాజ్‌ గురుని మన అటాక్ నుంచి కాపాడాలంటే.. రథం నడిపే కృష్ణుడితో పాటు.. యుద్దం చేసే రాముడు రావాలి.. ఎవడైనా ఉంటాడా?’  ‘అంబులెన్స్ వెనకొస్తే సైడ్ ఇవ్వాలి.. నాలాంటోడు ఎదురొస్తే సైడ్ అవ్వాలి.. కాదని గెలికితే.. ఒక్కొక్క నా కొడుక్కి ఇచ్చి పడేస్త’  అనే డైలాగ్స్‌   హైలెట్‌గా నిలిచాయి, సాయి కార్తీక్ సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్  కన్నా పీసీ అందించిన కెమెరా పనితీరు బాగుంది..వినయ్ రామస్వామి ఎడిటింగ్ పనితీరు బాగుంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించిన చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి   మాత్రం “‘ధీర’ ” కచ్చితంగా నచ్చుతుందని చెప్పచ్చు.

Cinemarangam.Com Review Rating 3./5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here