‘The Indian Story’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్  : ది భీమ్ రెడ్డి క్రియేషన్స్
సినిమా : “ది ఇండియన్ స్టోరి”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 03.05.2024
ప్రొడ్యూసర్ – రాజ్ భీమ్ రెడ్డి,
కో ప్రొడ్యూసర్ – కమల్ హాసన్ పాత్రుని,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామ్ పమరాజు,
దర్శకత్వం – ఆర్ రాజశేఖర్ రెడ్డి.
నటీనటులు – రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు
సినిమాటోగ్రఫీ – నిమ్మల జైపాల్ రెడ్డి,
మ్యూజిక్ – సందీప్ కనుగుల,
ఎడిటర్ – జేపి,
స్టంట్ – శంకర్, ఆది,
పి.ఆర్.ఓ : కె. శ్రీధర్


మన సమాజంలో మత సామరస్యం ఉండాలనే మంచి సందేశంతో అన్ని కమర్షియల్ అంశాలు కలిపి తీసిన సినిమా ది ఇండియన్ స్టోరి”.ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతా కంపై రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, అనంత్ నటీ నటులుగా ఆర్ రాజశేఖర్ రెడ్డి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రాజ్ భీమ్ రెడ్డి నిర్మించిన చిత్రం “ది ఇండియన్ స్టోరి”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 3న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..


కథ
కబీర్ ఖాన్, శ్రీరామ్ క్యారెక్టర్స్ పరిచయంతో సినిమా మొదలవుతుంది.హిందూ వర్గానికి నాయకుడు శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గ లీడర్ కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్). ఈ ఇద్దరు నాయకులు ప్రజల్ని రెచ్చగొడుతూ పరస్పరం దాడులు చేసుకునేలా చేస్తుంటారు. విశాఖ నుంచి వచ్చిన రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి)కి ఓ విషయంలో ఫేకు (చమ్మక్ చంద్ర) అనే స్నేహితుడు హెల్ప్ చేస్తాడు. సాయం చేస్తానంటూ స్నేహితుడే మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. కబీర్ ఖాన్ ను శ్రీరామ్ వర్గం చేసిన హత్యాయత్నం నుంచి రెహమాన్ కాపాడతాడు. కబీర్ ఖాన్ బలవంతం మీద అతని వర్గంలో రెహమాన్ చేరతాడు. ఆప్తుడిగా మారిన రెహమాన్ ను కబీర్ ఖాన్ హత్య చేయాలని అనుకుంటాడు. ఇందుకు కారణం ఏంటి. జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాడు. అతను కబీర్ ఖాన్ వర్గంలోకి ఎందుకు చేరాడు. కబీర్ ఖాన్ కూతురిలా చూసుకునే ఆయేషాతో రెహమాన్ ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా. మతం పేరుతో ప్రజల్ని విడదీసిన ఈ ఇద్దరు నాయకుల ప్లాష్ బ్యాక్ ఏంటి. కబీర్ ఖాన్, శ్రీరామ్ పుట్టించే మత విద్వేషాల నుంచి సమాజాన్ని రెహమాన్ ఉరఫ్ రాజ్ ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.


నటీ నటుల పనితీరు
కొత్తగా హీరో అయిన వారు తాము స్టార్ అనుకుంటారు. అలాగే కమర్షియల్ గా పాటలు, పెద్ద పెద్ద ఫైట్స్ క్రియేట్ చేసుకుంటారు కానీ ఈ సినిమాలో హీరో రాజ్ భీమ్ రెడ్డి కథకు, తన పాత్రకు ఎంత కావాలో అంతే నటించాడు. ఎక్కువ హంగులకు పోలేదు. రాజ్ భీమ్ రెడ్డి ఫైట్స్ సినిమాకే హైలైట్. యాక్షన్ సీక్వెన్స్ లలో బాగా నటించాడు.ఆస్పత్రిలో నర్సుతో చమ్మక్ చంద్ర చేసే కామెడీ, హీరోకు రాజ్ భీమ్ రెడ్డికి, చమ్మక్ చంద్రకు మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్వించాయి. అలాగే హీరోయిన్ జరా ఖాన్ పర్ ఫార్మెన్స్ బాగుంది. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఫేకు గా చమ్మక్ చంద్రకు తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఉన్నంత సేపూ నవ్విస్తూనే ఉన్నాడు చమ్మక్ చంద్ర. శ్రీరామ్ గా రామరాజు, కబీర్ ఖాన్ గా ముక్తార్ ఖాన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
మతం పేరుతో మన మధ్య చిచ్చు పెట్టేవారి కుట్రలను గమనించాలని అలాగే వారి నుండి ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లకుండా వుండాలనే చక్కటి కాన్సెప్ట్ తో కేవలం తాము చెప్పదల్చుకున్న పాయింట్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఒకవైపు కామెడీగా ఉంటూనే కథలో సీరియస్ నెస్ కంటిన్యూ అయ్యేలా తెరకెక్కించడంలో నిర్మాత రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి.లు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు .ఈ సినిమాలో చెప్పినట్టుగానే రాజకీయాలు, రాజకీయ నాయకుల వ్యవహారాలు అంతు చిక్కవు. పైకి బద్ధ శత్రువుల్లా కనిపించి రోజూ మీడియా ముందు తిట్టుకునే నాయకులు ప్రైవేట్ పార్టీల్లో మాత్రం కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. వారు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి ప్రజలు అవాక్కవుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో. ఇలా రాజకీయ నాయకులు తమ స్వార్థంతో ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెడుతుంటారు జాగ్రత్త అని మంచి సందేశాన్నిచ్చింది “ది ఇండియన్ స్టోరి” సినిమా.

టెక్నికల్ గా చూస్తే ఈ సినిమాకు నిమ్మల జైపాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ, సందీప్ కనుగుల మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది .జేపి ఎడిటింగ్ పనితీరు బాగుంది.ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై ఖర్చుకు వెనుకాడకుండా రాజ్ భీమ్ రెడ్డి నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా అంటే కేవలం వినోదం కాదని సమాజానికి మంచిని చెప్పేలా ఉండాలని ప్రూవ్ చేస్తుంది. సినిమా చూసిన వారందరికీ “ది ఇండియన్ స్టోరి” సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు

Cinemarangam. Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here