Cinemarangam.Com
సమర్పణ: మహర్షి కూండ్ల,
బ్యానర్ : మహా మూవీస్
సినిమా : ‘శబరి’
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 03.05.2024
ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల,
కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అనిల్ కాట్జ్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల,
నటీనటులు : వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు
సంగీతం: గోపి సుందర్,
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి ,
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల,
రచనా సహకారం: సన్నీ నాగబాబు,
పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్,
కో- డైరెక్టర్: వంశీ,
ఫైట్స్: నందు – నూర్,
కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ – రాజ్ కృష్ణ,
పి. ఆర్. ఓ : పులగం చిన్నారాయణ

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’.మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 3న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ “శబరి” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
ఓ సాధారణ అమ్మాయి అయిన సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) తాను ప్రేమించి పెళ్లిచేసుకున్న అరవింద్ (గణేష్ వెంకట్రామన్) తో కొన్ని సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తె రియా (బేబీ నివేక్ష) తో బయటకు వచ్చేస్తుంది. తన కాలేజ్ ఫ్రెండ్ అయిన లాయర్ రాహుల్ (శశాంక్) హెల్ప్ తీసుకుంటుంది . మరో వైపు క్రిమినల్ అయిన సూర్య (మైమ్ గోపీ)సంజన కూతురు రియా కోసం అందరినీ చంపుతుంటాడు.రియా తన కూతురని తనకు ఇచ్చేయమని సంజనను బెదిరిస్తుంటాడు. అయితే అనూహ్యంగా జరిగిన ఒక యాక్సిడెంట్ లో సూర్య చనిపోతాడు. కానీ నా కూతురును కిడ్నాప్ చేయడానికి సూర్య ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు చెపుతుంది. సూర్య అనే వాడు లేడని, యాక్సిడెంట్ లో చనిపోయాడని లాయర్ రాహుల్, పోలీసులు చెబుతారు. అసలు సంజన, అరవింద్‌లు ఎందుకు విడిపోతారు? సంజన గతం ఏంటి? ఈ కథలో రాహుల్ పాత్ర ఏంటి? చనిపోయిన సూర్య ఎలా బ్రతికి వచ్చాడు?చివరకు కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి సంజన ఏం చేసింది? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా శబరి’ సినిమాను తెరపై చూడాల్సిందే

నటీ నటుల పనితీరు
ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ లో సంజనగా పాత్రలో తల్లిగా ఆమె నటించిన తీరు, కుమార్తె రియా (బేబీ నివేక్ష,) కోసం పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. వారి మధ్య వచ్చే సన్నివేశాలు, ఎమోషన్స్, అందర్నీ ఆకట్టుకుంటాయి. చైల్డ్ ఆర్టిస్ట్ రియాగా బేబీ నివేక్ష చాలా చక్కగా నటించింది. అలాగే అరవింద్‌గా గణేష్, రాహుల్‌గా శశాంక్, సూర్య పాత్రలో విలన్ గా మైమ్ గోపీ, ఏసీపీగా మధుసూధన్ చక్కగా నటించారు. సునయన, అర్చన, కృతిక, రాజా శ్రీ, భద్రం, ఆశ్రిత ఇలా మిగిలిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.ఒక తల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తుందని, ఎంత దూరమైనా వెళ్తుందనే పాయింట్‌ను సెలెక్ట్ చేసుకొని దానికి ఎంటర్టైన్మెంట్తో పాటుగా ఎమోషన్‌ను జోడించి ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా మదర్ అండ్ డాటర్ రిలేషన్, ఎమోషన్‌ను చక్కగా చూపించడంలో దర్శకుడు అనిల్ కాట్జ్ సక్సెస్ అయ్యాదని చేప్పచ్చు . కొడైకెనాల్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేసిన నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా…మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా…అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది .ఈ పాటను అమృతా సురేష్ పాడారు.కథలో కీలకమైన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. గోపీ సుందర్ మ్యూజిక్ బాగుంది. ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంటుంది. రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి లు ఇచ్చిన కెమెరా విజువల్స్ బాగున్నాయి, ధర్మేంద్ర కాకరాల ఇచ్చిన ఎడిటింగ్ పనితీరు బాగుంది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ “శబరి” సినిమాకు చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కచ్చితంగా చెప్పొచ్చు.
Cinemarangam. Com Review Rating 3/5









