“KA” Movie Review

Cinemarangam.Com
సమర్పణ : శ్రీమతి చింతా వరలక్ష్మి
బ్యానర్ : శ్రీ చక్రాన్ ఎంటర్టైన్మెంట్స్
సినిమా : ‘క ’
రివ్యూ రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : 31.10.2024
నిర్మాత – చింతా గోపాలకృష్ణ రెడ్డి,
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్
నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం, మ్యూజిక్ – సామ్ సీఎస్,
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్,


యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపా‌వళి పండుగ సందర్భంగా ఈ నెల 31న గ్రాండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన “క” సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే ముందు “క” సినిమా కథలోకి వెళ్దాం..

కథ
తల్లి తండ్రులు లేని ఒక అనాధ అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం).నా అనే వారు లేరనే భావన తన చిన్నతనం నుండి ఉంటుంది. తల్లి లేక పొతే నేను పుట్టను కదా తనకు ఒక తల్లి, ఫ్యామిలీ ఎక్కడో ఉంటుందనే ఆలోచనతో తన వాళ్ల కోసం తపిస్తుంటాడు వాసుదేవ్. అయితే ఒకరోజు పోస్ట్ మాన్ తనుండే అనాధ ఆశ్రమ మాస్టారు కు ఉత్తరాన్ని ఇచ్చి వెళ్ళేక్రమంలో ఒక ఉత్తరం కిందపడుతుంది.ఇద్దామనేలోపు తను వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఉత్తరాన్ని చదవడం మొదలు పెడతాడు.అది ఒక అమ్మ తన కొడుకుకు రాసిన ఉత్తరం. అది చదివి ఎమోషనల్ అవుతాడు. అప్పటినుండి కుటుంబ బంధాలు ఎలా ఉంటాయో, ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు  ఇతరులకు వచ్చే ఉత్తరాలను దొంగతనంగా చదువుతుంటాడు. ఇలా మాష్టారు కు వచ్చిన ఉత్తరం చదివాడని మాస్టారు వాసుదేవ్ ను కొడతాడు. ఆశ్రమం నుంచి పారిపోయిన వాసుదేవ్ నేనే పోస్టు మ్యాన్ అయితే చాలా ఉత్తరాలు చదవచ్చు అనుకొంటాడు. కొన్నాళ్లకు కృష్ణగిరి అనే ఊరికి వచ్చి పోస్ట్ మ్యాన్ గా ఉద్యోగంలో చేరతాడు. పోస్ట్ మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన్ సారిక) ను చూసి ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఈ కృష్ణగిరిలో అమ్మాయిలు మిస్ కావడం ఉత్కంఠను కలిగిస్తుంది. దీంతో కిడ్నాప్ లు చేస్తున్నది ఎవరనేది తెలుసుకునే క్రమంలో అనూహ్యంగా వాసుదేవ్, రాధ లు కిడ్నాప్ కు గురవుతారు. అయితే ఉత్తరాలను చదివే అలవాటు వల్ల తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అందమైన కృష్ణగిరి ఊరిలో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నది ఎవరు, వాసుదేవ్, రాధ కిడ్నాప్ నుంచి బయటపడ్డారా లేదా? చివరికి తను ప్రేమించిన సత్యభామ ను పెళ్లిచేసుకొన్నాడా? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి “క” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు 
అభినయ వాసుదేవ్ గా కిరణ్ అబ్బవరం ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ చేశారు. తన కెరీర్ లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుంది. డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సులు కిరణ్ బాగా చేయగలడని క ప్రూవ్ చేసింది. రాధగా తన్వీరామ్ రోల్ చాలా కీలకంగా సాగుతుంది. తన లుక్స్ , మేకోవర్ తో సత్యభామగా నయన్ సారిక ఆకట్టుకుంది. ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలతో నటించి మెప్పించారాని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
కృష్ణగిరి అనే ఊరు నేపథ్యంగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కర్మ సిద్ధాంతం అనే సరికొత్త థ్రిల్లర్ మూవీని స్క్రీన్ మీద మెస్మరైజ్ చేస్తూ చాలా చక్కగా ప్రెజెంట్ చేయడమే కాకుండా యంగ్ డైరెక్టర్స్ సుజీత్, సందీప్ లు అద్భుతంగా ప్రేక్షకులను కట్టి పడేశారని చెప్పచ్చు. అక్కడ అక్కడ కొంత స్లో అనిపించిన ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఆడియన్ సినిమా కి కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ తరువాత నుండి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాయి.అక్కడక్కడ వచ్చే ట్విస్ట్ లు చాలా బాగున్నాయి ఈ సినిమాకు పీరియాడిక్ ఆర్ట్ వర్క్ ఒక హైలైట్ గా చెప్పుకోవాలి. అలాగే సామ్ సీఎస్
సంగీతం పెద్ద ఎసెట్. విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం ల కెమెరా వర్క్ అద్భుతంగా వుంది. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు మనకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. పీరియాడిక్ థ్రిల్లర్  సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం “క ” సినిమా కచ్చితంగా నచ్చుతుంది

Cinemarangam.Com Review Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here