‘JATHARA’ Movie Review (Fantasy action thriller)

Cinemarangam.Com
సినిమా : ‘జాతర ’
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 08.11.2024
సమర్పణ : గల్లా మంజునాథ్
బ్యానర్ : రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ
నిర్మాత : ద్వారంపూడి రాధాకృష్ణారెడ్డి
సహ నిర్మాత : శివశంకర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మధు వనిత బోయపాటి,
కథ మాటలు దర్శకత్వం : సతీష్ బాబు రాటకొండ
దర్శకత్వం పర్యవేక్షణ :నంది కె రెడ్డి,
నటీ నటులు : సతీష్ బాబు రాటకొండ, దీయా రాజ్, ఆర్కే నాయుడు, తదితరులు
కెమెరామెన్ : కె వి ప్రసాద్,
సంగీతం : శ్రీజిత్ యడవానా
ఎడిటర్ : మహేంద్ర నాథ్ బి,
ఫైట్స్ : రాజేష్ లంక,
విఎఫ్ఎక్స్ అండ్ పబ్లిసిటీ : మూవీ టేక్,
పి. ఆర్. ఓ : సాయి సతీష్

చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో  తెరకెక్కిన  సినిమా ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమాలో దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది .ఈ చిత్రాన్ని రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతర’  సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్దాం..  

కథ
చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో “జాతర” నేపథ్యంలో  జరిగే కథ . గ్రామదేవత గంగావతి అమ్మ వారికి తరతరాలుగా ఆలయ పూజారి పాలేటి వంశమే పూజలు చేస్తుంటుంది. పాలేటి ఏకైక కుమారుడు చలపతి(సతీష్ బాబు రాటకొండ) కు తండ్రి లా భక్తి భావాలు లేని నాస్తికుడు. అదే ఊర్లో ఉంటున్న వెంకటలక్ష్మి (దీయా రాజ్) చలపతి పై ప్రేమను పెంచుకుంటుంది.. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరి గ్రామదేవత గంగావతిదేవి పాలేటికి కలలో వచ్చి ఈ గ్రామంలో జరిగే దూరాచారాలను రక్షించమని కోరుతుంది. దాంతో అమ్మవారి మాటను నెరవేర్చాలని పూజలు చేయడం మొదలు పెడతాడు. అయితే అనూహ్యంగా ఒకరోజు పాలేటితో పాటు గంగావతి అమ్మవారు ఊరు నుంచి మాయం అవుతారు. పాలేటి చేసిన చెడు పూజల వల్లే అమ్మవారు ఊరివిడిసి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతుంది. దాంతో ఆ ఊరి ప్రజలు పాలిటి ఫ్యామిలీని శత్రువులుగా చూడటం మొదలు పెడతారు. ఆ తర్వాత చలపతి జీవితం అస్తవ్యస్తంగా సాగుతున్న సమయంలో ఊరి పెద్దగా ఉన్న గంగిరెడ్డి చలపతి జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. మరో వైపు తన తండ్రి అదృశ్యం వెనుక కారణమేంటని తెలుసునే పని పడతాడు. ఈ క్రమంలో గంగిరెడ్డి చేస్తున్న మోసపూరితమైన పనులకు అడ్డుపడుతాడు. దాంతో తనకు అడ్డు వస్తున్న చలపతిని మట్టు పెట్టాలనుకుంటాడు. అసలు పాలేటి , గంగిరెడ్డి కుటుంబాల మధ్య ఉన్న గొడవల ఏంటి. గంగిరెడ్డి, చలపతిని ఎందుకు చంపాలని అనుకుంటాడు. ఆ ఊర్లో గంగిరెడ్డి చేస్తున్న పనులేంటి? అసలు ఊరి గ్రామ దేవత ఎందుకు అదృష్యమైంది? ఎటువంటి భక్తి బావాలు లేకుండా నాస్తికుడిగా ఉన్న చలపతి తన తండ్రితో పాటు అదృష్యమైన గ్రామ దేవత మిస్టరీ ని చేదించాడా? లేదా అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లి “జాతర” సినిమా చూడాల్సిందే..


 నటీనటుల పనితీరు 
చలపతి పాత్రలో హీరోగా నటించిన సతీష్ రాటకొండ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు . మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా చాలా అద్భుతంగా నటించాడు. వెంకటలక్ష్మి  పాత్రలో  హీరోయిన్ గా  దీయా రాజ్  తన పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. అలాగే  విలన్ గా కనిపించిన ఆర్కే నాయుడు కూడా గంగిరెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు. తదితరుల  నటీనటులు అందరూ వారికిచ్చిన పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
తన భక్తులను అమ్మవారు కాపాడడం అనే పాయింట్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో దేవుడిపై భక్తి లేని ఒక నాస్తికుడైన యువకుడు దేవుడినే ఎందుకు కాపాడాల్సి వచ్చింది. అమ్మవారి అండతో ఎలా దుష్టసంహారాన్ని గావించాడు, అనే కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో లవ్ స్టోరీ , మాస్ ఎలిఫెంట్ తో పాటు అన్ని రకాల అంశాలను జోడిస్తూ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొనేలా తెరకెక్కించడంలో దర్శకుడుగా సతీష్ బాబు రాటకొండ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. టెక్నికల్‌ గా చూస్తే శ్రీజిత్ యడవానా మ్యూజిక్ బాగుంది. కెమెరామెన్ ప్రసాద్ ఇచ్చిన విజువల్స్, ఫ్రేమింగ్స్  అద్భుతంగా ఉన్నాయి. పల్లెటూరు అందాలను, దేవత సన్ని వేశాలను చాలా చక్కగా చూయించాడు. మహేంద్ర నాథ్ బి ఎడిటింగ్ పనితీరు బాగుంది. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై  రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి లు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే కొత్త కంటెంట్ ఇంటెన్స్ డ్రామా సస్పెన్స్, లవ్, ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ‘జాతర’ తప్పకుండా నచ్చుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here