Cinemarangam.Com
బ్యానర్స్ : స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్
సినిమా : “కంగువ”
రివ్యూ రేటింగ్ : 3.5/5
విడుదల తేదీ : 14.11.2024
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ
నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కంగువ’ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
‘వెయ్యేళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాటం నేపథ్యంగా, ఓటమి ఎరుగని ధీరుడైన నాయకుడు కంగువను ఒకవైపు, ప్రస్తుత కాలంలోని స్టైలిష్ హీరోను మరోవైపు ఇలా రెండు టైమ్ ఫ్రేమ్స్ లో సాగే సినిమాయే “కంగువ”. 2024లో రష్యన్ ల్యాబ్ లో మనుషులపై ప్రయోగాలు చేసే సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది.ఆ ల్యాబ్ నుంచి జెటా అనే అబ్బాయి తప్పించుకొని ట్రైన్ లో వస్తే అది గోవాకు చేరుకుంటుంది. గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్ గా పనిచేస్తూ ఉంటాడు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్ ని పట్టుకొని భౌంటీ (డబ్బులు ) తీసుకుంటూ ఉంటారు.అలాగే మరో బౌంటీ గా చేస్తున్న ఏంజలీనా (దిశాపటాని) ని ప్రేమిస్తాడు. ఎంతో గాడంగా ప్రేమించుకున్న వీరు ఒక గొడవ కారణంగా విడిపోయి ఉంటారు. వీరిద్దరికి యోగిబాబు సాయం చేస్తూ ఉంటారు.గోవా లో ఫ్రాన్సిస్ ఒక క్రిమినల్ ను చంపుతున్నపుడు చూసిన ఒకే ఒక సాక్షి జెటా. దాంతో కంగారుపడి జెటాని కలుస్తాడు.అప్పుడు తనకి నాకు ఏదో బంధం ఉందని ఫీల్ అవుతాడు. ఇంతలో రష్యన్ ల్యాబ్ మనుషులు జెటా తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. వారి నుండి బాబు ను రక్షించే క్రమంలో తమ మధ్య ఉన్న బంధం ఇప్పటిది కాదు గత జన్మదని తెలుసుకుంటాడు. దీంతో కథ 1000 సంవత్సరాల క్రితంకి వెళ్తుంది. కంగువకు రుద్రనేత్ర (బాబి డియోల్) కు మధ్య వైరం ఏర్పడానికి కారణం ఏమిటి ? ప్రణవాది తెగను విదేశీయులకు అప్పగించాలని రుద్రనేత్ర ఎందుకు అనుకున్నాడు, పంచ ద్వీప సమూహంలోని ప్రణవాది, కపాలతో పాటు మరో మూడు తెగల మధ్య రొమేనియన్లు ఎలాంటి విద్వేషాలు సృష్టించారు. వెయ్యేళ్ల కిందట “కంగువ” చేసిన ప్రతిజ్ఞ ఏంటి ? మాట ఇస్తే నిలబెట్టుకునేందుకు ఎంతటి సాహసం చేశాడు? ఆ వీరుడు పునర్జన్మ ఎత్తాడా ? అతను నిలబెట్టిన గౌరవం ఎలాంటిది ? ఆ మాటను ఈనాటి కథానాయకుడు ఎలా నిలబెట్టాడు అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి ‘కంగువ‘ సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
వెయ్యేళ్ల కిందట వీరుడి పాత్రలో సూర్య కంగువ గా, మోడరన్ క్యారెక్టర్ లో ఫ్రాన్సిస్ గా ఇలా రెండు పాత్రల్లో సూర్య తన నట విశ్వరూపంతో అద్భుతంగా నటించాడు. ఫ్రాన్సిస్ కంటే కంగువ పాత్ర కోసమే సూర్య ఎక్కువగా కష్టపడ్డాడు. లుక్ యాక్టింగ్ తో మెప్పించాడు. విలన్ పాత్రలో రుద్ర గా నటించిన (బాబీ డియోల్) తన నటనతో మెప్పించాడు. ఇది తన కెరీర్ లో చేసిన డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి . ఏంజెలీనా క్యారెక్టర్ లో దిశా పటానీ చేసిన పాత్రతో ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది. జెటా, పులావ పాత్రలు పోషించిన బాలుడి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రొమేనియన్ సామ్రాజ్యం నుంచి వచ్చిన వారి పాత్రలో కనిపించిన విదేశీ నటులతో పాటు ఇందులో నటించిన వారంతా వారి పరిధి నేరకు చాలా చక్కగా నటించారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఒక ఆటవిక తెగలకు నేటి కాలాన్ని ముడిపెడుతూ కంగువ కథను రాసుకున్నాడు.ఆనాటి కాలంలో ఆధిపత్యం కోసం జాతులు, వర్గాల మధ్య పోరాటం ఎలా సాగేది వర్గ పోరాటాన్ని ఆసరగా తీసుకొని మన దేశాన్ని అస్తగతం చేసుకోవడానికి విదేశీయులు ఎలాంటి కుట్రలు పన్నారు. విదేశీయులను కుట్రలను పోరాట యోధుడు కంగువ ఎలా ఎదుర్కొన్నాడు అనే యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అంశాలతో.. వెయ్యేళ్ల కిందటి కంగువ ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశారో, అంతే అల్ట్రా మోడరన్ గా నేటి కథనాయకుడి ప్రపంచాన్ని విజువల్ వండర్ గా ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించడంలో దర్శకుడుగా శివ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. ఎంత పెద్ద కథైనా రాసుకోవడం సులువు. కానీ టెక్నికల్ గా తెరకెక్కించడం కష్టం. ఇవాళ్టి ట్రెండ్ లో ప్రేక్షకులు స్క్రీన్ మీద కొత్త ప్రపంచాన్ని నేపథ్యాన్ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి మూవీస్ కు ఆదరణ దక్కుతోంది. ఈ కంగువ అనే కలను నిజం చేసుకోవడానికి దర్శకుడు శివ రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. శివ కన్న కలను నిజం చేయడానికి సూర్య లాంటి స్టార్ హీరో సూర్య కూడా చాలా కష్టపడ్డాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ క్యారెక్టర్ డిజైన్స్ చేసుకున్న తీరు బాగున్నాయి. హీరోకు తగ్గట్టుగా విలన్ పాత్ర ఉంటే బాగుండేది .అడవిలో వచ్చే సూర్య వర్సెస్ ఆర్మీ వార్ సీన్, మొసలితో వేటాడే సీన్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంగువ కు గొప్ప సౌండింగ్ ఇచ్చారు ఆయన ఇచ్చిన సాంగ్స్, బీజీఎం ఈ మూవీకి ఎంతో ఆకర్షణ తీసుకురవడమే కాకుండా సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాడు. తను కంపోజ్ చేసిన ‘ధీర ధీర కదన విహార..ధీర.’ నాయక, మన్నింపు ,కంగా కంగా సాంగ్స్ బాగున్నాయి .సినిమాటోగ్రఫర్ వెట్రి పళనిస్వామి ఈ మూవీకి అద్బుతమైన విజువల్స్ ఇచ్చారు..ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ మరో మెట్టుకు తీసుకెళ్లాయి. నిశాద్ యూసుఫ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ వందలకోట ఖర్చు పెట్టి నిర్మించిన చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా కంగువ సినిమా గురించి చెప్పాలంటే వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ రా అండ్ రస్టిక్ తో ఇదొక విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ లు ఇష్ట పడేవారికి కంగువ తప్పకుండా ఒక గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని కచ్చితంగా చెప్పచ్చు.
Cinemarangam.Com Review Rating 3.5/5









