Cinemarangam.Com
బ్యానర్ : దత్తాత్రేయ మీడియా
సినిమా : “ఫియర్”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 14.12.2024
నిర్మాత – డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని
నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
మ్యూజిక్ – అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
డిజిటల్ మీడియా – హౌస్ ఫుల్, మాయాబజార్

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందించారు . అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఫియర్” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
సింధు (వేదిక), ఇందు (వేదిక) కవల పిల్లలు. సింధుకు తన అక్క ఇందు అంటే ఎంతో ఇష్టం. అయితే సిందుకు భయం ఎక్కువ, ఎప్పుడూ తనను ఎవరో బూచోడు వెంబడిస్తున్నరని, ఎత్తుకు పోతారేమో అని అనుమాన పడుతుంటుంది. స్కూల్ కు వెళ్లినా ఒంటరిగా వున్నప్పుడు సడన్ గా ఎవరైనా ఎదురొచ్చినా చేతికి దొరికిన దానితో కొడుతూ ఉంటుంది. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ సింధు పేరెంట్స్ ను పిలిపించి టీ. సి ఇచ్చి పంపుతారు.కానీ సింధు అక్క ఇందుకు మాత్రం ఎలాంటి భయాలు ఉండవు. సిందుకు స్కూల్ లేనందున ట్యూషన్ కు పంపుతారు.అక్కడ సంపత్ (అరవింద్ కృష్ణ) పరిచయం అవుతాడు.ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో సంపంత్ తో ఎవరు మాట్లాడినా సహించేది కాదు. సంపత్ తనతో మాత్రమే మాట్లాడాలని, తనకే సొంతం కావాలనేది. చివరికి తన అక్క ఇందు కూడా సంపత్ తో మాట్లాడినా ఒప్పుకోదు. అయితే ఒకరోజు ఇందు సంపత్ తో మాట్లాడుతుంటే అక్క అని కూడా చూడకుండా తోసివేస్తుంది.ఇలా రోజు రోజుకు తన ప్రవర్తన లో మార్పు వస్తుందడంతో సింధు తల్లి తండ్రులు ఒక పీస్ మెంటల్ అసైలమ్ (మానసిక చికిత్సాలయం)లో చేర్పించి చికిత్స ఇప్పిస్తుంటారు. అక్కడి వైద్యులను, సిబ్బందిని సంపత్ ను చూశావా, సంపత్ ఎక్కడ అని కనపడిన వారందరినీ సింధు అడుగుతుంటుంది.ఇదిలా ఉండగా సింధు ప్రేమించిన సంపత్ ఆఫీస్ వర్క్ ఉందని వెళ్లిన వాడు ఎంతకీ తిరిగిరాడు. తనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే తన అక్క కూడా కనిపించకుండా పోతుంది. అసలు సంపత్ ఎక్కడికి వెళ్ళాడు? అక్క ఎందుకు కనిపించడం లేదు? సింధును వెంటాడుతున్న ఆ బూచోడు ఎవరు..అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “ఫియర్” సినిమా చూడాల్సిందే

నటీ నటుల పనితీరు
రెండు విభిన్న పాత్రల్లో ఎంతో ఈజ్ గా నటించిన వేదిక అద్భుతంగా నటించింది సింధు, ఇందు క్యారెక్టర్స్ లో ఒదిగిపోయింది అని చెప్పచ్చు .ఈ కథకు వేదిక పర్పెక్ట్ గా సెట్ అయ్యింది .హ్యాపీ, సాడ్, గ్లామర్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ను పండించింది అరవింద్ కృష్ణ పాత్ర చిన్నదే అయినా తన పాత్ర ఈ సిమిమాకు ఎంతో ఇంపార్టెంట్. జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి..ఇలా ఈ చిత్రంలో నటించిన వారంతా తమ పరిధి మేర చాలా చక్కగా నటించి మెప్పించారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
మాములుగా మొదటి సినిమా చేసే లేడీ డైరెక్టర్స్ లవ్ లేక ఫ్యామిలీ కథను సెలెక్ట్ చేసుకొని సినిమా చేస్తారు. కానీ దానికి భిన్నంగా హారర్ కథను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకులకు సరికొత్త ఫియర్ ను పరిచయం చేసింది డా.. హరిత గోగినేని. ఈ సినిమాలో వేదిక పాత్రను ఆస్పత్రి నుంచి ఫ్లాష్ బ్యాక్ కు తీసుకెళ్తూ..సినిమా ప్రారంభం నుంచే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.వేదిక క్యారెక్టర్ ను వర్తమానానికి గతానికి ముడిపెడుతూ హీరోయిన్ జ్ఞాపకాలను రీకాల్ చేస్తూ ఇన్నోవేటివ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఫియర్ సినిమా ఆద్యంతంగా సాగేలా ఆసక్తికరంగా సినిమాను రూపొందించారు దర్శకురాలు డా.హరిత గోగినేని. ఒకవైపు వేదికను అందంగా చూపిస్తూనే, ఆమె పాత్రలోని సంఘర్షణను తెరపై ఆవిష్కిరించారు. అలాగే ప్రస్తుతం పిల్లల భౌతిక, మానసిక పరిస్థితులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలనే ఒక మంచి సందేశాన్ని కూడా ఫియర్ మూవీ ద్వారా అందించారు. సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కలిసిన ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. తనకిది మొదటి సినిమా అయినా చాలా చక్కగా హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పచ్చు .

సంగీత దర్శకుడు అనూప్ తన బెస్ట్ బీజీఎం, సాంగ్స్ ఇచ్చాడు. కెకె రాసిన ఫియర్ సాంగ్ బాగుంది ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఫియర్ కు మరో హైలైట్ అని చెప్పచ్చు .దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి లు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.ఫైనల్ గా “ఫియర్” సినిమా గురించి చెప్పాలి అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీ తో వచ్చి హ్యాపీ గా ఎంజాయ్ చేయచ్చని కచ్చితంగా చెప్పచ్చు
Cinemarangam.Com Review Rating.. 3/5









