Cinemarangam.Com
బ్యానర్ : పిఎల్‌వి క్రియేషన్స్
సినిమా : “ప్రణయగోదారి “
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 13.12.2024
నిర్మాత : పారమళ్ళ లింగయ్య
దర్శకత్వం : పి. యల్. విఘ్నేశ్
సంగీతం : మార్కండేయ
సినిమాటోగ్రఫీ : ప్రసాద్
ఎడిటర్ : కొడగంటి వీక్షిత వేణు
పి. ఆర్. ఓ : సాయి సతీష్

సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ప్రణయగోదారి” సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:
పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన కథ ఇది. పెద కాపు (సాయి కుమార్) ఆంధ్రప్రదేశ్‌లోని గోదారి పరిసర ప్రాంతంలో ఉన్న 40 గ్రామాలకు పెద్ద. మరియు పరువు కోసం ప్రాణమిచ్చే వ్యక్తి.అలాగే 1000 ఎకరాలు ఉన్నపెద్ద ఆసామి. తన గ్రామంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడంలో ముందుంటాడు. అదే గ్రామం లో ఉన్న దత్తుడు (పృద్వి) కూడా ఆ గ్రామంలో పట్టు సాధించాలానే కోరికతో పెద కాపు పై ఆధిపత్యం సాధించాలని ప్రతిసారీ పోటీపడుతుంటాడు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న పెదకాపు చెల్లి భర్త చనిపోవడంతో కొడుకు శీను (సదన్) తో కలసి అన్నయ్య దగ్గరకు వస్తుంది. అయితే కొద్ది రోజులకు అదే గ్రామంలో చేపలు పట్టే జాలరు అమ్మాయి గొయ్య (ప్రియాంక ప్రసాద్)ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శ్రీను.

ఆ తరువాత ప్రతిరోజు గోచిగాడు(సునీల్)తో కలసి వెళ్లి గొయ్యను కలుస్తుంటాడు. వీరి ప్రేమ వ్యవహారం గొయ్య తల్లి తండ్రులకు మరియు శ్రీను మామయ్య పెద కాపు కు తెలుస్తుంది. తన అల్లుడు శ్రీను కి తన కూతురు లలిత (ఉష శ్రీ )ని ఇచ్చి పెళ్లి చెయ్యాలను కుంటాడు. అయితే తన అల్లుడు తక్కువ కులం ఉన్న జాలరు అమ్మాయి వెంటపడడం సహించలేకపోతాడు. పదిమందికి న్యాయం చెప్పే తన ఇంట్లోనే తన అల్లుడు ఇలా చెయ్యడం తట్టుకోలేకపోతాడు. దాంతో పెద కాపు ఒక నిర్ణయం తీసుకుంటాడు.తను తీసుకున్న నిర్ణయం వలన గొయ్య, శీనులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? శీను, గొయ్యల ప్రేమను పెదకాపు అంగీకరించాడా? ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకున్న ఈ జంట చివరకు ఒక్కటయ్యారా లేదా అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి “ప్రణయగోదారి” సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
పెదకాపు పాత్రలో నటించిన డైలాగ్ కింగ్ సాయి కుమార్ హై ఆక్టేన్ యాక్షన్ మరియు ఎమోషన్స్ తో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పెదకాపు పాత్రలో జీవించాడు అని చెప్పాలి.శ్రీను పాత్రలో హీరో గా నటించిన సదన్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. గొయ్య పాత్రలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక ప్రసాద్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. చివరి వరకు ఆమె మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. గోచి క్యారెక్టర్‌లో ఆర్టిస్ట్ సునీల్ రావినూతల మంచి పాత్రతో ప్రేక్షకులను అలరించాడు. వీరి ముగ్గురికి ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా నటించారు. 30 సంవత్సరాల పృద్వి నిడివి తక్కువ ఉన్న బాగానే చేశాడు. ఇంకా ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పరిధి మేరకు చాలా చక్కగా నటించారు

సాంకేతిక నిపుణుల పనితీరు
పునర్జన్మ ల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పల్లెటూరు నేపథ్యంలో పాత్రలకు తగ్గట్టు చక్కటి కథను రాసుకొని దానికి తగ్గట్టు చక్కటి ఎమోషన్స్ ను జోడించి తెరకెక్కించడంలో దర్శకుడుగా పిఎల్ విఘ్నేష్ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. సంగీత దర్శకుడు మార్కెండేయ అందించిన సంగీతం మరియు బిజీయం బాగుంది. పాటలు బాగున్నాయి. డిఓపి ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్‌గా ఉంది.కొడగంటి వీక్షిత వేణు ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది.పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా “ప్రణయగోదారి” సినిమా గురించి చెప్పాలి అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీ తో వచ్చి హ్యాపీ గా ఎంజాయ్ చేయచ్చని కచ్చితంగా చెప్పచ్చు
Cinemarangam.Com Review Rating.. 3/5









