“Ardham Chesukovu Enduke” Lyrical Song Released from ‘Drinker Sai’ Movie

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ ‘అర్థం చేసుకోవు ఎందుకే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘అర్థం చేసుకోవు ఎందుకే..’ లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘అర్థం చేసుకోవు ఎందుకే, అర్థం చేసుకోవు ఎందుకే, ఎన్నెన్నో చెబుతున్నా, ఏవేవో చేస్తున్నా, అర్థం చేసుకోవు ఎందుకే, అర్థం చేసుకోవు ఎందుకే… నా చిన్ని లోకం నువ్వేనని, నాకున్న ప్రాణం నీదేనని, నాకన్నా ఎక్కువగా నిన్నే ప్రేమించానని, ప్రేమన్న మాటే నీతో తెలిసొచ్చిందని, అర్థం చేసుకోవు ఎందుకే అర్థం చేసుకోవు ఎందుకే’ అంటూ లవ్ లోని పెయిన్ ను తెలిపేలా సాగుతుందీ పాట.

నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
స్టిల్స్ – రాజు వైజాగ్ (SVA)
వీఎఫ్ఎక్స్ – సుమరామ్ రెడ్డి.ఎన్
ఆర్ట్ – లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ – భాను, మోయిన్
డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి
మ్యూజిక్ – శ్రీ వసంత్
లిరిక్స్ – చంద్రబోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here