కళ్యాణ్, సోఫియా ఖాన్, ఊహ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్’. వి.జె.సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.ఆర్.ప్రొడక్షన్, వి.జె.ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై రవిసాగర్, వి.జె.సాగర్ ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి చేతుల మీదుగా ‘ఓం నమః శివాయ’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. తనికెళ్ల శంకర్ రాసిన ఈ పాటను చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సునీల్ కశ్యప్ ఆలపించారు. ఈ సందర్భంగా…
తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘‘‘ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్’ సినిమా నుంచి ‘ఓం నమః శివాయ’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ హీరోగా వి.జె.సాగర్ స్వీయ దర్శక నిర్మాణంలో రవి సాగర్‌తో కలిసి సినిమాను రూపొందించారు. తనకు నచ్చినట్లు బతికే వ్యక్తి జీవిత పరిణామ క్రమంలో ఏం జరిగిందనే కథాంశంతో సినిమాను రూపొందించారు. ఒక అనుభవాన్ని, బాధను దిగమింగుకుని తన ప్రయాణాన్ని కొనసాగించే హీరో గురించి తెలియజేసే క్రమంలో ఈ శివుడి పాట వస్తుంది. కథలో చాలా కీలకమైన ఘట్టంలో పాట వస్తుంది. సునీల్ కశ్యప్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. శివ తత్వాన్ని ఈ పాటలో తనికెళ్ల శంకర్ పదాలతో ఎంతో చక్కగా ఆవిష్కరించారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి వెలుగుతోంది. ఈ క్రమంలో సాగర్ లాంటి యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్‌ను ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శక నిర్మాత వి.జె.సాగర్ మాట్లాడుతూ ‘‘‘ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్’ సినిమా యూనిట్‌కు తన సపోర్ట్‌ను తెలియజేస్తూ తనికెళ్లభరణిగారు ఓం నమః శివాయ పాటను విడుదల చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. సినిమా గురించి చెప్పాలంటే సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. త్వరలోనే రిలీజ్ డేట్ వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
నటీనటులు:
కళ్యాణ్, సోఫియా ఖాన్, ఊహ, దయానంద్, మాధవీ కొల్ల, మహేంద్రనాథ్, పులి సీత, పప్పు తదితరులు
సాంకేతిక వర్గం:
నిర్మాణ సంస్థలు: సి.ఆర్.ప్రొడక్షన్, వి.జె.ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాతలు: రవి సాగర్, వి.జె.సాగర్
రచన, దర్శకత్వం: వి.జె.సాగర్
మ్యూజిక్: సునీల్ కశ్యప్
ఎడిటర్: సత్య గుడిపాటి









